For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టర్మ్ ఇన్సురెన్స్ ప్రీమియంలు పెరగొచ్చు, త్వరపడండి

|

కరోనా మహమ్మారితో సహా పలు అంశాల కారణంగా, సెటిల్ చేసిన లైఫ్ ఇన్సురెన్స్ క్లెయిమ్స్ వాస్తవ మొత్తం ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉంది. మీరు టర్మ్ ఇన్సురెన్స్ ప్లాన్స్‌ను కొనుగోలు చేయాలని చూస్తే కనుక ప్రీమియం ఖర్చును ఆదా చేసుకోవడానికి లేదా ఇప్పటికీ టర్మ్ ఇన్సురెన్స్ తీసుకోని వారైతే బీమాను తీసుకోవడానికి త్వరపడాలి. ఎందుకంటే ప్రపంచ రీ-ఇన్సూరర్లు తమ రేట్లను పెంచనున్నారు. అలా పెంచితే టర్మ్ ఇన్సురెన్స్ ప్లాన్ ప్రీమియం త్వరలో పెరుగుతుంది. కొంతమంది రీ-ఇన్సురెన్స్ రేట్లను పెంచాలని భావిస్తున్నాయి.

కరోనా మరణాల ప్రభావంతో క్లెయిమ్స్ పెరగడంతో టర్మ్ ప్లాన్స్ రేట్లను సవరించాలని భావిస్తున్నారు. అంతేకాకుండా, భవిష్యత్తు స్థూల ఆర్థిక కారణాలు, ఊహించే మరణాల రేటు, ఇతర బీమా ప్రమాణాలతో పాటు కొంతమంది రీ-ఇన్సూరర్ల రేట్లను సవరించవచ్చు. అయితే రీ-ఇన్సూరర్లు తమ రేట్లు పెంచిన అనంతరం భారత్‌లో టర్మ్ ఇన్సురెన్స్ ప్రీమియం రేట్లపై వెంటనే ప్రభావం ఉండకపోవచ్చు. ప్రీమియం ధరలు పెంచాలనే నిర్ణయం కంపెనీ వ్యూహాలపై ఆధారపడి ఉంటుంది. ప్రీమియం పెంచడం లేదంటే మార్జిన్లు తగ్గించుకోవడం ద్వారా ప్రీమియం రేట్లు యథాతథంగా ఉండవచ్చునని అంటున్నారు.

 You Should Buy Term Insurance Before Premiums Go Up

టర్మ్ ఇన్సురెన్స్ ప్రీమియం రేట్లను సవరిస్తే అన్ని వర్గాల్లో ఒకేలా ఉండకపోవచ్చు. ఎందుకంటే సవరించిన ప్రీమియం రేట్లన వయస్సు, గ్రూప్, జెండర్, ఎంచుకున్న హామీ మొత్తం మొదలైన వాటిలో భిన్నంగా ఉండవచ్చు. అయితే ఈ పెంపు ప్రస్తుత పాలసీదారుపై ఎలాంటి ప్రభావం చూపించకపోవచ్చు. ఒకరు బీమా పాలసీని కొనుగోలు చేసిన రోజు నుండి జీవిత బీమా ప్రీమియంలు లాక్ చేస్తారు. కాబట్టి ప్రస్తుత పాలసీదారులు లేదా రాబోయే కొద్దిరోజుల పాటు బీమాను కొనుగోలు చేసిన వారికి ప్రస్తుత ప్రీమియం వర్తిస్తుంది.

English summary

టర్మ్ ఇన్సురెన్స్ ప్రీమియంలు పెరగొచ్చు, త్వరపడండి | You Should Buy Term Insurance Before Premiums Go Up

On the prodding of global re-insurers, life insurers are set to hike premiums on term plans in the December - January window.
Story first published: Friday, December 3, 2021, 19:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X