For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

FD: ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా, అయితే ఇవి గమనించండి

|

కరోనా మహమ్మారి సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన వడ్డీ రేట్లు తగ్గాయి. ఈ వైరస్ కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రెపో, రివర్స్ రెపో రేటును స్థిరంగా ఉంచింది. గత ఏడాది కరోనా ప్రారంభంలో ఈ రేట్లు భారీగా తగ్గించింది. ఇప్పటి వరకు పెంచింది లేదు. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన ఆ ప్రభావం ఉంది. సాధారణ సిటిజన్ల నుండి సీనియర్ సిటిజన్స్ వరకు రిస్క్-లేని లేదా తక్కువ రిస్క్ కలిగిన పెట్టుబడి కావాలనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ వైపు చూస్తారు.

వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పటికీ, రిటర్న్స్ తక్కువగా ఉన్నప్పటికీ రిస్క్ లేని పెట్టుబడి. అందుకే సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా దీనికి మొగ్గు చూపుతారు. సేవింగ్స్ అకౌంట్స్ కంటే ఎక్కువ వడ్డీ రేటు వస్తుంది. కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎక్కువే ఉంటాయి. వివిధ బ్యాంకులు వివిధ కాలపరిమితిలపై వివిధ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.

వడ్డీ రేట్లు ఇలా...

వడ్డీ రేట్లు ఇలా...

ఎస్బీఐ ఏడు రోజుల నుండి పదేళ్ల కాలపరిమితిపై 2.9 శాతం నుండి 5.4 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

HDFC బ్యాంకు వడ్డీ రేటు ఏడు రోజుల నుండి పదేళ్ల కాలపరిమితిపై 2.50 శాతం నుండి 5.50 శాతం మధ్య ఉంది.

ICICI బ్యాంకు ఏడు రోజుల నుండి పదేళ్ల కాలపరిమితిపై 2.5 శాతం నుండి 5.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఏడు రోజుల నుండి పదేళ్ల కాలపరిమితిపై 2.5 శాతం నుండి 6.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఏడు రోజుల నుండి పదేళ్ల కాలపరిమితిపై 3 శాతం నుండి 6.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇలా వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు 2.5 శాతం నుండి ఉన్నాయి.

కాలపరిమితి చూసుకోవాలి

కాలపరిమితి చూసుకోవాలి

మన దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో ఫిక్స్డ్ డిపాజిట్ ముందు ఉంటుంది. బ్యాంకుల్లో నిర్దేశిత కాలం నిధులను పెట్టడంతో పాటు సురక్షితంగా భావించడం, అలాగే అదనపు వడ్డీ రేటు ఇస్తుండటంతో చాలామంది FD వైపు మొగ్గు చూపుతుంటారు. మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, ఈక్విటీ వంటి వివిధ పెట్టుబడి సాధనాలు ఉన్నప్పటికీ, ఫిక్స్డ్ డిపాజిట్ సురక్షిత, భద్రతతో కూడిన పెట్టుబడి కాబట్టి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు.

ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టే ముందు మన ఆర్థిక లక్ష్యం లేదా మనకు ఎన్నేళ్లు అవసరమో చూసుకోవడం అవసరం. ఏడాది నుండి మూడేళ్ల FD అయితే స్వల్పకాలం, మూడేళ్ల నుండి అయిదేళ్లు అయితే మధ్య కాలికం, అయిదేళ్ల నుండి పదేళ్లు అయితే దీర్ఘకాల FDగా పేర్కొంటారు. ఈ కాలపరిమితిని బట్టి వడ్డీ రేటు మారుతుంది.

FD చేస్తే ఇవి కీలకం

FD చేస్తే ఇవి కీలకం

ఎక్కువ FD వడ్డీ రేటు ఇస్తున్నాయని ఏ బ్యాంకులో పడితే ఆ బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఉండే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ప్రముఖ బ్యాంకులు అలాగే క్రిసిల్, కేర్ వంటి రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చే బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్‌సీలను ఎంచుకోవాలి. క్రిసిల్ ఎఫ్ఏఏ-ప్లస్, కేర్ ఏఏ రేటింగ్ సంస్థలను ఎంచుకోవచ్చు. వీటితో రిస్క్ ఉండదు.

FD పెట్టినప్పుడు వడ్డీ రేటు కూడా చూసుకోవాలి. రిస్క్ లేని బ్యాంకు తర్వాత వడ్డీ రేటును చూసుకోవాలి. దాదాపు అన్ని బ్యాంకులు కూడా సీనియర్ సిటిజన్స్‌కు అదనపు వడ్డీ రేటును ఇస్తుంటాయి.

వడ్డీ రేట్లలో క్యుములేటివ్, నాన్-క్యుములేటివ్ ఉంటాయి. క్యుములేటివ్ కాలపరిమితి ముగిసిన తర్వాత ఒకేసారి వడ్డీతో పాటు అసలు వస్తుంది. నాన్-క్యుములేటివ్ అయితే మీరు ఎంచుకున్న దానిని బట్టి ప్రతి నెల లేదా మూడు నెలలు లేదా ఐదు నెలలు లేదా ఆరు నెలలు లేదా ఏడాదికి వడ్డీ రేటు వస్తుంది.

FD పైన రుణం కూడా వస్తుంది. అయితే నిర్దేశిత మొత్తాన్ని FD చేసిన వారు నేరుగా రుణానికి అర్హత సాధిస్తారు. మీరు డిపాజిట్ చేసిన సొమ్ములో 75 శాతం సొమ్మును తిరిగి రుణం రూపంలో అందిస్తారు. అయితే ఈ వడ్డీ రేటు మనకు వచ్చే వడ్డీ రేటు కంటే రెండు శాతం ఎక్కువ.

English summary

FD: ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా, అయితే ఇవి గమనించండి | You need to know about FD interest rates and tenure

SBI FDs between 7 days to 10 years will give 2.9% to 5.4% to general customers. HDFC Bank offers interest ranging from 2.50% to 5.50% on deposits maturing between 7 days and 10 years.
Story first published: Monday, August 30, 2021, 15:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X