For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాట్సాప్ నుండి త్వరలో హెల్త్ ఇన్సూరెన్స్, ఆ కస్టమర్లకు ఇప్పటికే నగదు బదలీ

|

న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరినాటికి తమ యాప్‌ని ఉపయోగించి మైక్రో ఆరోగ్య బీమాను కొనుగోలు చేసే అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది. ఈ మేరకు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కవరేజి కల్పించనుంది. భారత్‌ని యూజర్లకు మరిన్ని ఫైనాన్షియల్ సొల్యూషన్లు అందుబాటులోకి తీసుకు రావడంలో భాగంగా ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. అలాగే, UPI చెల్లింపుల విధానం ద్వారా పేమెంట్స్ ఫీచర్ ప్రారంభించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్(NPCI) నుండి గత నెల అనుమతి లభించిందని, దీని ద్వారా యూజర్లు పరస్పరం నగదును బదిలీ చేసుకోవచ్చునని తెలిపింది. ఇందుకు ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, HDFC, యాక్సిస్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది.

2015లోని అంచనా కంటే చాలా ఎక్కువ, 6 నెలలు జాగ్రత్త..: బిల్‌గేట్స్ హెచ్చరిక2015లోని అంచనా కంటే చాలా ఎక్కువ, 6 నెలలు జాగ్రత్త..: బిల్‌గేట్స్ హెచ్చరిక

ఆరోగ్య బీమా పథకాలు

ఆరోగ్య బీమా పథకాలు

వినియోగదారులకు అందుబాటు ధరల్లో చిన్నపాటి ఆరోగ్య బీమా పథకాలు కొనుగోలు చేసేందుకు వీలుకల్పిస్తామని తెలిపింది వాట్సాప్. దేశవ్యాప్తంగా 20 మిలియన్ల యూజర్లకు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. 400 మిలియన్ల క్రియాశీలక యూజర్లతో కూడిన భారత్‌కు కట్టుబడి ఉన్నామని, ఇది తమ అతిపెద్ద మార్కెట్ అని వాట్సాప్ తెలిపింది. తమ మొదటి దృష్టి ఎప్పుడూ ప్రజలు ఒకరితో మరొకరు కనెక్ట్ అవడానికి సరళమైన, నమ్మకమైన, సురక్షితమైన ఫీచర్ అందించడమేనని తెలిపింది.

నాలుగు బ్యాంకుల కస్టమర్లకు..

నాలుగు బ్యాంకుల కస్టమర్లకు..

దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది వినియోగదారులకు చెల్లింపుల ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చామని వాట్సాప్ తెలిపింది. ప్రస్తుతం ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, HDFC, యాక్సిస్ బ్యాంకు కస్టమర్లకు ఈ ఫీచర్ పని చేస్తోంది. వాట్సాప్ యూజర్లందరికీ ఈ సేవలు అందించడం కోసం ఇతర ఆర్థిక సంస్థలతోను కలిసి పని చేయనున్నట్లు తెలిపింది. సూక్ష్మ పింఛన్, సూక్ష్మ బీమా, ఎడ్యు-టెక్, అగ్రి-టెక్ వంటి ఫీచర్లను ప్రయోగాత్మకంగా నిర్వహిస్తోంది.

ఆరోగ్య బీమా

ఆరోగ్య బీమా

ఈ ఏడాది చివరి వరకు ఎస్బీఐ జనరల్ నుండి వాట్సాప్ అందుబాటు ధరలో చిన్నపాటి ఆరోగ్య బీమా కొనుగోలు చేసేందుకు వీలు కల్పించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్, పిన్‌బాక్స్ సొల్యూషన్లను అందించాలని భావిస్తోంది. అలాగే, భారత్‍‌లో చిన్న వ్యాపారుల వ్యవస్థను కూడా డిజిటలీకరణ చేయాలని వాట్సాప్ భావిస్తోంది. తమ కస్టమర్లకు తమకు నచ్చిన వ్యాపారుల నుండి కొనుగోలు చేసేందుకు వీలు కల్పించాలని భావిస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది.

English summary

వాట్సాప్ నుండి త్వరలో హెల్త్ ఇన్సూరెన్స్, ఆ కస్టమర్లకు ఇప్పటికే నగదు బదలీ | WhatsApp to help users in India buy sachet sized health insurance

WhatsApp is set to roll out health insurance and micro-pension products on its messaging platform in India through tie-ups with licensed financial services players.
Story first published: Thursday, December 17, 2020, 7:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X