For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకిది తెలుసా?: క్రెడిట్ కార్డు బిల్లుకు రూ.2 లక్షల లోన్, ఖర్చు తగ్గించవచ్చు

|

వివిథ న్యూఏజ్ ఫిన్‌టెక్ కంపెనీలు క్రిడెట్ కార్డ్ టేకోవర్ లోన్ అందిస్తున్నాయి. దీంతో లాంగ్ పెండింగ్ క్రెడిట్ కార్డు డ్యూస్ చెల్లించవచ్చు. దీంతో సిబిల్ స్కోర్ కూడా మెరుగవుతుంది. ఇప్పుడు క్రెడిట్ కార్డు ఉపయోగం రోజు రోజుకు పెరుగుతోంది. క్రిడెట్ కార్డు ద్వారా చేసిన ఖర్చును నిర్ణీత గడువులోగా చెల్లించకుంటే రుణ ఉచ్చులో పడిపోయే అవకాశాలు ఉంటాయి. క్రెడిట్ కార్డులు ఎన్ని ఉంటే అన్ని ఉపయోగించుకుంటూ వెళ్తే మరింత ఇబ్బందుల్లో పడొచ్చు.

SBI-విస్తారా క్రెడిట్ కార్డ్స్: ఉచిత విమాన టిక్కెట్ సహా ప్రయోజనాలివే...SBI-విస్తారా క్రెడిట్ కార్డ్స్: ఉచిత విమాన టిక్కెట్ సహా ప్రయోజనాలివే...

క్రెడిట్ కార్డు టేకోవర్ లోన్లు

క్రెడిట్ కార్డు టేకోవర్ లోన్లు

క్రిడిట్ కార్డు బిల్లు గడువులోగా చెల్లించకుంటే ఛార్జీల బాదుడు ఉంటుంది. వీటిని చెల్లించకుంటే ఆ బిల్లు మోపెడు అవుతుంది. అప్పుడు అప్పుల ఊబిలో ఇరుక్కుపోవడమే కాకుండా క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. వడ్డీ రేటు భారీగా ఉంటుంది. కాబట్టి నిర్ణీత గడువులోగా క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించడం అలవాటు చేసుకోవాలి. కాగా, ప్రస్తుతం వివిధ ఫిన్‌టెక్ కంపెనీలు క్రెడిట్ కార్డు టేకోవర్ లోన్స్ ఇస్తున్నాయి.

షార్ట్ టర్మ్ రుణాలు.. రూ.2 లక్షల వరకు ఇస్తారు

షార్ట్ టర్మ్ రుణాలు.. రూ.2 లక్షల వరకు ఇస్తారు

ఇలాంటి రుణాల ద్వారా దీర్ఘకాలంలో ఉన్న పెండింగ్ మొత్తాలు చెల్లించవచ్చు. అప్పుడు సిబిల్ స్కోర్ కూడా మెరుగుపరుచుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ టేకోవర్ లోన్లు పర్సనల్ లోన్ వలె ఉంటాయి. ఇక్కడ రుణగ్రహీత లోన్ అమౌంట్‌ను తన అకౌంటులోకి పొందుతాడు. వీటిని వివిధ రకాల చెల్లింపుల కోసం ఉపయోగించుకోవచ్చు. ఇవి షార్ట్ టర్మ్ రుణాలు. రూ.50,000 నుంచి రూ.2 లక్షల వరకు ఇస్తారు. రీపేమెంట్ కాలపరిమితి 12 నెలల వరకు ఉంటుంది.

క్రెడిట్ వడ్డీ రేటు కంటే తక్కువ

క్రెడిట్ వడ్డీ రేటు కంటే తక్కువ

ఇది వ్యక్తిగత రుణం లాంటిది కావడంతో క్రెడిట్ కార్డుపై చెల్లించే వడ్డీ రేటు కంటే తక్కువగా ఉంటుంది. వ్యక్తిగత రుణంతో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ క్రెడిట్ కార్డ్ డ్యూస్‌తో పోలిస్తే తగ్గుతుంది. క్రెడిట్ కార్డు చెల్లింపులపై 3 నుంచి 4 శాతం వడ్డీ ఉంటుంది. క్రెడిట్ టేకోవర్ లోన్‌పై వడ్డీ రేటు నెలకు 1.5 శాతమే ఉంటుంది. అంటే సగం లేదా అంతకంటే తక్కువ వడ్డీ పడుతుంది.

బ్యాలెన్స్ ట్రాన్సుఫర్ చేసుకోవచ్చు

బ్యాలెన్స్ ట్రాన్సుఫర్ చేసుకోవచ్చు

ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే బ్యాలెన్స్ ట్రాన్సుఫర్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. బ్యాలెన్స్ ట్రాన్సుఫర్ ద్వారా ఒక కార్డుపై ఉన్న బకాయిలు మరో కార్టుకు మార్చుకోవచ్చు. ఇక్కడ వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. తొలి కార్డుపై ఉన్న బకాయి మొత్తాన్ని రెండో కార్డు కంపెనీ చెల్లిస్తుంది. ఇప్పుడు రెండో కార్డు బిల్లు మొత్తంలో తొలి కార్డు బకాయి కూడా కనిపిస్తుంది.

ఇదే ఉత్తమం...

ఇదే ఉత్తమం...

బ్యాలెన్స్ ట్రాన్సుఫర్ ద్వారా క్రెడిట్ కార్డు జారీ చేసిన సంస్థ కంటే రెండో కార్డు సంస్థ తక్కువ వడ్డీని వసూలు చేస్తుంది. కానీ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి బ్యాలెన్స్ ట్రాన్సుఫర్ కంటే క్రెడిట్ కార్డు టేకోవర్ లోన్ మంచిదని నిపుణులు సూచిస్తారు. లోన్ తీసుకొని కార్డు బిల్లు చెల్లిస్తే సరిపోతుంది. క్రెడిట్ కార్డు డ్యూ మొత్తం చెల్లించే పరిస్థితి ఉంటే ఇది ఉపయోగకరం. క్రెడిట్ కార్డు టేకోవర్ లోన్ తీసుకుంటే సరైన సమయంలో చెల్లించే విధంగా ప్లాన్ చేసుకోవాలి.

English summary

మీకిది తెలుసా?: క్రెడిట్ కార్డు బిల్లుకు రూ.2 లక్షల లోన్, ఖర్చు తగ్గించవచ్చు | What is good for outstanding balance upto Rs 2 lakh?

Several new age Fintech companies offer Credit Card Takeover Loan that can help you clear the long-pending credit card dues and help maintain the CIBIL score.
Story first published: Sunday, December 1, 2019, 15:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X