For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Personal Finance: ఈ పోస్టాఫీస్ స్కీంతో అధిక రిటర్న్స్, ప్రభుత్వ హామీ

|

సురక్షిత పెట్టుబడికి చాలామంది బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్‌ను ఎంచుకుంటారు. రిస్క్‌ను ఇష్టపడని వారు ఫిక్స్డ్ డిపాజిట్స్ వైపు మొగ్గు చూపుతారు. ఫిక్స్డ్ డిపాజిట్స్‌తో పాటు పోస్టాఫీస్ పథకాలు కూడా సురక్షితమైనవి. అంతేకాదు, ఇక్కడ పలు పథకాల్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే అధిక వడ్డీరేటు వస్తుంది. కరోనా కంటే ముందు బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్స్ (FD) పైన అధిక వడ్డీ రేటును ఇచ్చాయి. కరోనా నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను భారీగా తగ్గించడంతో బ్యాంకులు కూడా FD వడ్డీ రేటును కనిష్టాలకు తీసుకెళ్లాయి. ప్రస్తుతం బ్యాంకుల్లో 5 శాతం కంటే తక్కువ వడ్డీ రేటు వస్తోంది.

అదే సమయంలో పోస్టాఫీస్ పథకాల్లో 5.5 శాతం నుండి 6.7 శాతం వరకు ఉంది. పోస్టాఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ప్రభుత్వ గ్యారెంటీతో పాటు మంచి రిటర్న్స్ ఉంటాయి. వడ్డీ రేటు ప్రయోజనం త్రైమాసికం పరంగా ఉంటుంది.

పోస్టాఫీస్ FDలో ఇన్వెస్ట్ చేయడం చాలా సులభం. పోస్టాఫీస్ FDలో ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, అయిదేళ్ల కాలపరిమితి ఉంది.

Want higher returns on fixed deposits? Check out post office interest rates

పోస్టాఫీస్ FD ప్రయోజనాలు

- పోస్టాఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన ప్రభుత్వ హామీ ఉంటుంది.

- ఇందులో ఇన్వెస్టర్ మనీ పూర్తి సురక్షితం.

- ఆఫ్ లైన్(క్యాష్, చెక్కు రూపంలో) రూపంలోను ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు. లేదా ఆన్ లైన్(నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్) రూపంలోను ఇన్వెస్ట్ చేయవచ్చు.

- ఒక FDకి మించి మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు.

- జాయింట్ అకౌంట్ రూపంలోను FDని ఓపెన్ చేయవచ్చు.

- అయిదేళ్ల కాలపరిమితికి ఫిక్స్డ్ డిపాజడిట్ చేస్తే ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో పన్ను మినహాయింపు ఉంది.

- ఒక పోస్టాఫీస్ నుండి మరో పోస్టాఫీస్‌కు fdని ట్రాన్సుఫర్ చేసుకోవచ్చు.

- కనీసం రూ.1000 నుండి ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి లేదు.

- సాధారణంగా వడ్డీ రేట్లు 7 రోజుల నుండి 10 రోజుల కాలపరిమితిపై 5.50 శాతం ఉంది. మూడేళ్ల నుండి అయిదేళ్ల కాలపరిమితిపై 6.70 శాతం వడ్డీ రేటు ఉంది.

English summary

Personal Finance: ఈ పోస్టాఫీస్ స్కీంతో అధిక రిటర్న్స్, ప్రభుత్వ హామీ | Want higher returns on fixed deposits? Check out post office interest rates

Bank FD has remained traditional investment option among those investors who don't want to take risk and keep their liquidity option open in the case of financial emergency.
Story first published: Tuesday, December 7, 2021, 9:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X