For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాప్ కార్డ్స్: క్రెడిట్ కార్డు ఎందుకు ఉండాలి, ప్రయోజనాలు ఏమిటి?

|

మార్కెట్‌లో ఎన్నో రకాల క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ వడ్డీ లేని రుణం. క్రెడిట్ కార్డును సరైన విధంగా ఉపయోగిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. క్రెడిట్ కార్డును ఉపయోగించిన మొత్తాన్ని గడువులోగా చెల్లిస్తే వడ్డీ రహితం అవుతుంది. అయితే ఈ గడువు దాటితే ఆ తర్వాత తడిసి మోపెడు అవుతుంది. కాబట్టి క్రెడిట్ కార్డును వినియోగించే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే మన తాహతుకు మించి క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేయవద్దు. ఆ మొత్తాన్ని చెల్లించకుంటే తలకు మించిన భారం అవుతుంది. మన క్రెడిట్ కార్డు పరిమితిలో 80 శాతం లోపు మాత్రమే ఖర్చు చేసేలా ప్రణాళికలు చేసుకోవాలి. మార్కెట్‌లో ఎన్నో బ్యాంకులు క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నాయి. ఈ బ్యాంకులు కూడా వివిధ రకాల క్రెడిట్ కార్డ్స్ ఇస్తాయి.

భారత్‌లో 10 టాప్ క్రెడిట్ కార్డ్స్

భారత్‌లో 10 టాప్ క్రెడిట్ కార్డ్స్

భారత్‌లో ఎన్నో క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఇందులో పది టాప్ క్రెడిట్ కార్డ్స్, వాటి వార్షిక రుసుము ఇలా ఉంది. వీటితో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

- యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ వార్షిక ఫీజు రూ.499. క్యాష్ బ్యాక్ ప్రయోజనం ఉంటుంది.

-ఎస్బీఐ కార్డ్ ఎలైట్ క్రెడిట్ కార్డ్ ఏడాది ఫీజు రూ.4,999. షాపింగ్, ట్రావెల్, మూవీస్, ఎంటర్టైన్మెంట్‌కు బాగా సూట్ అవుతుంది.

- HDFC రెగాలియా క్రెడిట్ కార్డ్ వార్షిక రుసుము రూ.2500. షాపింగ్, ట్రావెల్ కోసం బాగా సరిపోతుంది.

- ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ వార్షిక ఫీజు రూ.500. ఆన్‌లైన్ షాపింగ్ ప్రయోజనం.

- అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ వార్షిక చార్జీ లేదు. ఇది కూడా ఆన్ లైన్ షాపింగ్ కోసం బాగా సరిపోతుంది.

- సిటీ ప్రిమీయర్ మైల్స్ కార్డు వార్షిక రుసుము రూ.3000. ఎయిర్ మైల్స్‌కు ఉపయోగం.

- HDFC మిల్లీనియా క్రెడిట్ కార్డ్ వార్షిక రుసుము రూ.1000. క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది.

- స్టాండర్డ్ చార్టర్డ్ డిజిస్మార్ట్ కార్డ్ నెల వారీ ఫీజు రూ.49. ఆన్ లైన్ షాపింగ్ కోసం ఇది ప్రయోజనకరం.

- HSBC క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ వార్షిక రుసుము రూ.750. క్యాష్ బ్యాక్‌కు ఇది ప్రయోజనకరం.

- HDFC బ్యాంకు డైనర్స్ క్లబ్ ప్రివిలేజ్ క్రెడిట్ కార్డ్ వార్షిక రుసుము రూ.2500. ట్రావెల్, లైఫ్ స్టైల్‌కు సూట్ అవుతుంది.

క్రెడిట్ కార్డు ఇష్యూ చేసే బ్యాంకులు

క్రెడిట్ కార్డు ఇష్యూ చేసే బ్యాంకులు

క్రెడిట్ కార్డును ఇష్యూ చేసే బ్యాంకులు లేదా ఇష్యూయర్స్‌లో ఎస్బీఐ కార్డ్, HDFC బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు, సిటీ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, HSBC బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, యస్ బ్యాంకు, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి.

క్రెడిట్ కార్డు ఎందుకు ఉండాలి

క్రెడిట్ కార్డు ఎందుకు ఉండాలి

- బ్యాంకు కస్టమర్‌కు మంచి క్రెడిట్ స్కోర్ ఎప్పటికైనా ప్రయోజనకరం. క్రెడిట్ కార్డును తీసుకొని, సక్రమంగా చెల్లించడం ద్వారా క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది.

- ఆయా బ్యాంకును బట్టి 45 రోజుల పన్ను రహితం లేదా వడ్డీ లేని రుణం అందుబాటులో ఉంటుంది.

- ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఇబ్బందులు లేని ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు.

- మంచి అవార్డ్స్, క్యాష్ బ్యాక్, డిస్కౌంట్స్, ఆఫర్స్ వంటివి ఉంటాయి.

- ఆర్థిక అత్యవసర సమయాల్లో వెంటనే అందుబాటులో ఉంటుంది.

- అవసరమైతే ఈఎంఐగా మార్చుకునే సౌకర్యం ఉంది.

- ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా సెక్యూర్డ్‌గా ఉంటాయి. ఓటీపీ, పిన్ అథెంటికేషన్ అవసరం.

క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు

క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు

చాలా వరకు క్రెడిట్ కార్డ్స్ వెల్‌‌కమ్ బెనిఫిట్స్ అందిస్తాయి. గిఫ్ట్ ఓచర్లు, డిస్కౌంట్లు, బోనస్ రివార్డు పాయింట్స్ ఇస్తాయి.

మీరు చేసే ప్రతి కొనుగోలుపై రివార్డ్ పాయింట్స్ లేదా క్యాష్ బ్యాక్ ఉంటుంది. రివార్డ్ పాయింట్స్ అన్నింటిని రిడీమ్ చేసుకోవచ్చు.

పలు క్రెడిట్ కార్డ్స్ పైన ఫ్యూయల్ సర్‌ఛార్జ్ మినహాయింపు వర్తిస్తుంది.

ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఉంటుంది. కొన్ని క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఇన్సురెన్స్ కవర్ ఉంటుంది. యాక్సిడెంట్ కవరేజీ కూడా ఉంటుంది.

ఏటీఎం కేంద్రాల నుండి అత్యవసర సమయాల్లో డబ్బును కూడా ఉపసంహరించుకోవచ్చు. యాడ్ ఆన్ కార్డ్ ప్రయోజనం ఉంది. అలాగే క్రెడిట్ కార్డు ఖర్చును ఈఎంఐగా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది.

English summary

టాప్ కార్డ్స్: క్రెడిట్ కార్డు ఎందుకు ఉండాలి, ప్రయోజనాలు ఏమిటి? | Top 10 Credit Cards in India, Why should you have a credit card?

Apart from offering ease of use, it is essential to have a credit card for many reasons.
Story first published: Wednesday, December 15, 2021, 8:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X