For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోమ్ లోన్‌ను తక్కువ వడ్డీ రేటుకు అందించే టాప్ 10 బ్యాంకులు ఇవే..

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో రెపో రేటును 4 శాత వద్ద యథాతథంగా ఉంచింది కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI). ఈ నేపథ్యంలో పలు బ్యాంకులు ఫ్లోటింగ్ హోమ్ లోన్ రేట్లను గత ఏడాది కాలంగా తగ్గిస్తున్నాయి. కరోనా కాలంలో హోమ్ లోన్ వడ్డీ రేట్లు కస్టమర్లకు అనుకూలంగా కనిష్టానికి తగ్గాయి. కొన్ని బ్యాంకులు అయితే 6.65 శాతం వడ్డీ రేటును కూడా అందిస్తున్నాయి. ప్రయివేటురంగ బ్యాంకు కొటక్ మహీంద్రా ఈ వడ్డీ రేటును అందిస్తోంది. అలాగే ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.70 శాతం వడ్డీని అందిస్తోంది. రూ.30 లక్షల వరకు హోమ్ లోన్ పైన కొన్ని బ్యాంకులు ఆకర్షణీయ వడ్డీని అందిస్తున్నాయి.

క్రెడిట్ స్కోర్ ముఖ్యం

క్రెడిట్ స్కోర్ ముఖ్యం

సాధారణంగా బ్యాంకులు మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్ ఇస్తాయి. ఈ నేపథ్యంలో రూ.30 లక్షల లోపు హోమ్ లోన్ తీసుకునే వారు మీ క్రెడిట్ స్కోర్, ఆదాయ ప్రమాణాల ఆధారంగా ఈ కింది బ్యాంకుల నుండి ఉత్తమ వడ్డీ రేట్లను పొందవచ్చు. పర్సనల్ లోన్ లేదా హోమ్ లోన్ ఏదయినా క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం.

కమర్షియల్ బ్యాంకులో తక్కువ వడ్డీ రేటు

కమర్షియల్ బ్యాంకులో తక్కువ వడ్డీ రేటు

హోమ్ లోన్ వడ్డీ రేటు తక్కువగా ఉన్న 5 టాప్ కమర్షియల్ బ్యాంకుల్లో పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు ముందు ఉన్నది. ఈ బ్యాంకులో వడ్డీ రేటు 6.65 శాతం నుండి 7.35 శాతం మధ్య ఉంది. ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6.70% నుండి 7.15% మధ్య, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 6.75% నుండి 8.25% మధ్య, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6.80% నుండి 7.35% మధ్య, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 6.80% నుండి 7.60% మధ్య ఉంది.

ఐదు బెస్ట్ ప్రయివేటు బ్యాంకు వడ్డీ రేట్లు

ఐదు బెస్ట్ ప్రయివేటు బ్యాంకు వడ్డీ రేట్లు

ప్రయివేటు బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ రేటు కొటక్ మహీంద్రా బ్యాంకులో తక్కువగా ఉంది. ఈ బ్యాంకులో వడ్డీ రేటు 6.65% నుండి 7.30% మధ్య ఉంది. ఆ తర్వాత ICICI బ్యాంకులో 6.75% నుండి 7.30%, HDFC బ్యాంకులో 6.75% నుండి 7.30%, IDBI బ్యాంకులో 6.95% నుండి 10.05%, యాక్సిస్ బ్యాంకులో 6.90% నుండి 8.55% మధ్య ఉంది.

క్రెడిట్ స్కోర్ అవసరమే

క్రెడిట్ స్కోర్ అవసరమే

హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు మొదట వారి క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేసుకోవాలి. అన్ని ఇతర ప్రమాణాల మాదిరిగా సిబిల్ స్కోర్ ప్రమాణాలు కూడా బ్యాంకు నుండి బ్యాంకుకు మారుతాయి. రుణ మొత్తాన్ని మంజూరు చేయడానికి బ్యాంకులు కస్టమర్ సిబిల్ స్కోర్ 750కి ఎక్కువగా ఉండాలని భావిస్తాయి. వీరికి వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ 700 ఉన్నప్పటికీ రుణం వస్తుంది. కానీ వడ్డీ రేటు ఎక్కువ. మరో విషయం ఏమంటే పురుష రుణ గ్రహీతల కంటే మహిళా రుణగ్రహీతలకు 5 నుండి 10 బేసిస్ పాయింట్లు తగ్గుతుంది.

English summary

హోమ్ లోన్‌ను తక్కువ వడ్డీ రేటుకు అందించే టాప్ 10 బ్యాంకులు ఇవే.. | Top 10 Banks With The Cheapest Interest Rates On Home Loans

Following the Reserve Bank of India's decision to maintain the repo rate at a record low of 4%, numerous banks have reduced their floating home loan rates since last year.
Story first published: Monday, July 12, 2021, 15:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X