For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తక్కువ వడ్డీ రేటుకు పర్సనల్ లోన్ ఇచ్చే టాప్ 10 బ్యాంకులు...

|

ఈ ప్రపంచంలో దాదాపు అందరికీ ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. వీటిని స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలుగా వర్గీకరించుకోవచ్చు. పెట్టుబడులు సురక్షితంగా ఉండటంతో పాటు అధిక రాబడి ఇచ్చేవి ఉండాలి. అలాగే, సౌకర్యవంతమైన కాలపరిమితి కలిగిన పెట్టుబడులపై దృష్టి పెడుతారు. ఇక, అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు అవసరం అనుకుంటే గోల్డ్ లోన్, వ్యక్తిగత లోన్ వైపు మొగ్గు చూపుతారు. వ్యక్తిగత లోన్ మీ తక్షణ అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడుతుంది. హఠాత్తుగా ఆసుపత్రి ఖర్చులు, విహారయాత్రలు, ఇంటి పునరుద్ధరణ, పెళ్లి, స్కూల్ ఫీజుల వంటి వివిధ అంశాలు ఇందులో ఉంటాయి. డబ్బులు తక్షణ అవసరం అనుకుంటే చాలామంది పర్సనల్ లోన్‌ను ఎంచుకుంటారు.

పర్సనల్ లోన్ కోసం ఇవి తప్పనిసరి

పర్సనల్ లోన్ కోసం ఇవి తప్పనిసరి

పర్సనల్ లోన్ ఇచ్చే సమయంలో ఏ బ్యాంకు అయినా మొదట చూసేది క్రెడిట్ స్కోర్. అత్యుత్తమ క్రెడిట్ స్కోర్ ఉంటే చాలా ఈజీగా వస్తుంది. అంతేకాదు, తక్కువ వడ్డీ రేట్లతో రుణం పొందవచ్చు. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే రుణం తిరస్కరణకు గురి కావొచ్చు. కొన్ని సందర్భాల్లో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండవచ్చు. 750 పాయింట్లకు పైన ఉన్న క్రెడిట్ స్కోర్ ఉత్తమమైనదిగా భావిస్తారు. మంచి క్రెడిట్ స్కోర్‌తో పాటు రుణగ్రహీత వయస్సు, ఆదాయ వనరు, అవసరమైన రుణ మొత్తం, వృత్తి సహా వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.

ఇవి అవసరం

ఇవి అవసరం

పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు డాక్యుమెంటేషన్ చాలా కీలకం. లోన్ వెంటనే రావడానికి కనీస డాక్యుమెంటేషన్‌లో ఐడీ ప్రూఫ్ (పాస్‌పోర్ట్, వోటర్ ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, పాన్), అడ్రస్ ప్రూఫ్ (పాస్‌పోర్ట్, వోటర్ ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్), 3 నెలల బ్యాంకు స్టేట్‌మెంట్, 6 నెలల పాస్‌బుక్, లేటెస్ట్ శాలరీ స్లిప్స్, ఫామ్ 16 అవసరం.

వడ్డీ రేట్లు

వడ్డీ రేట్లు

కరోనా నేపథ్యంలో వివిధ బ్యాంకులు వడ్డీ రేటును కాస్త తగ్గించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు వంటి ప్రభుత్వరంగ సంస్థలు 8.5 శాతం నుండి వడ్డీ రేటు విధిస్తున్నాయి. ప్రయివేటు బ్యాంకులు కూడా కరోనా సమయంలో వడ్డీ రేట్లు తగ్గాయి. వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

ఏ ప్రభుత్వ బ్యాంకులో ఎంతంటే

ఏ ప్రభుత్వ బ్యాంకులో ఎంతంటే

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు 8.90 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు 8.90 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంకు వడ్డీ రేటు 8.95 శాతం, ఇండియన్ బ్యాంకు వడ్డీ రేటు 9.05 శాతం, పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు వడ్డీ రేటు 9.50 శాతం, IDBI బ్యాంకు వడ్డీ రేటు 9.50 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడ్డీ రేటు 9.55 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు 9.60 శాతం, యూకో బ్యాంకు వడ్డీ రేటు 10.30 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేటు 10.50 శాతంగా ఉంది.

English summary

తక్కువ వడ్డీ రేటుకు పర్సనల్ లోన్ ఇచ్చే టాప్ 10 బ్యాంకులు... | Top 10 Banks Promising The Cheapest Rates On Personal Loans

We all have certain financial goals in our life which can be classified as short-term, medium-term and long-term. As a result, we consider the investment options that not only provide secure and high returns but also flexible tenure.
Story first published: Sunday, June 20, 2021, 17:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X