For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పండుగ సమయంలో షాపింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్ పాటించండి

|

పండుగ సీజన్ ప్రారంభమైంది. సెలవుల సీజన్/పండుగ సీజన్‌లో షాపింగ్ ఎక్కువగా ఉంటుంది. పండుగ సమయంలో చిన్న చిన్న దుకాణాల నుండి షాపింగ్ మాల్స్, ఈ-కామర్స్ వెబ్ సైట్స్ వరకు ఆఫర్ల వర్షం కురిపిస్తాయి. కొన్ని దుకాణాలు క్లియరింగ్ సేల్స్ పేరుతో తక్కువ ధరకే ఉత్పత్తులను అందిస్తాయి. దీంతో ఈ కాలంలో వివిధ ఉత్పత్తుల సేల్స్ ఎక్కువగా ఉంటాయి. పండుగ సమయంలో కొనుగోలుకు ముందు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. పండుగ సీజన్‌ను సొమ్ము చేసుకునేందుకు ఇప్పటికే పలు సంస్థలు బంపరాఫర్స్ ప్రకటించాయి.

పండుగ సమయంలో ఖర్చు ఎక్కువగా చేయాలని భావిస్తున్నవారు చాలామంది ఉన్నారు. అయితే కస్టమర్లు ఖర్చు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దుబారా చేయడం సరికాదు. అలాగే, భారీ ఆఫర్ అనే పేరుతో గుడ్డిగా కొనుగోలు చేయడం కూడా సరికాదని అంటున్నారు. సెలవుల సీజన్ లేదా పండుగ సీజన్‌లో ఇష్టారీతిన ఖర్చు చేసి ఆ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు పడవద్దు. ఈ నేపథ్యంలో ఖర్చు చేయడానికి, ఖర్చు చేసే సమయంలో టిప్స్ తెలుసుకోండి.

ఇవి ముఖ్యం

ఇవి ముఖ్యం

షాపింగ్‌కు ముందు బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవాలి. కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ ద్వారా కొనుగోళ్లకు మొగ్గుచూపడం కాస్త మంచిది అని భావిస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్‌ను ఉపయోగించాలి. అవసరమైన వాటికే ప్రాధాన్యత ఇవ్వాలి. షాపింగ్ చేసే సమయంలో ఎక్కువగా ఉపయోగపడే వస్తువుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. తోటివారు కొంటున్నారని, మనమూ కొనుగోలు చేయాలనే ఆలోచన చేయడం సరికాదు. మనకు ఏది అవసరమైతే దానిని కొనుగోలు చేయాలి.

ప్లాన్ చేసుకోండి

ప్లాన్ చేసుకోండి

షాపింగ్ చేయడానికి ముందు ఏం కొనుగోలు చేయాలనే అంశానికి సంబంధించి ప్లాన్ చేసుకోవాలి. అలాగే, మన బడ్జెట్ ఎంత, ఎంత బడ్జెట్‌లో వస్తాయో తెలుసుకోవాలి. బడ్జెట్‌ను మీ స్తోమతకు తగినట్లు రూపొందించుకోవాలి. ఖర్చు ఎక్కువగా చేసి ఇబ్బందుల్లో పడటం మంచిది కాదు. బడ్జెట్ ప్లాన్ చేసుకునే సమయంలోనే పది శాతం నుండి ఇరవై శాతాన్ని నచ్చినవి కొనుగోలు చేయడానికి కేటాయించాలి.

ఆఫర్.. డిస్కౌంట్.. క్యాష్ బ్యాక్

ఆఫర్.. డిస్కౌంట్.. క్యాష్ బ్యాక్

డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించేందుకు పలు సంస్థలు ఎన్నో ఆఫర్లు ప్రకటించాయి. వాటిని వినియోగించుకోవాలి. డెబిట్, క్రెడిట్ కార్డ్స్ పైన ప్రత్యేక డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుంది. సాధ్యమైనంత వరకు వినియోగించుకోవడం ద్వారా ఖర్చు తగ్గుతుంది. ఏ డిజిటల్ మాద్యమం రూపంలో చెల్లిస్తే ఆఫర్ లేదా క్యాష్ బ్యాక్ ఎక్కువగా ఉందో చూసుకోవాలి. అయితే ప్రతి ఆఫర్‌కు షరతులు ఉండవచ్చు. కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకోవాలి. ఎక్కువ ఆఫర్ ఉంది కదా అని కండిషన్స్ చూసుకోకుండా ముందుకు సాగవద్దు. అలాగే, వివిధ సస్థలు అందించే డిస్కౌంట్‌ను కూడా పరిగణలోకి తీసుకోవాలి.

అవసరం లేని ఉత్పత్తులకు దూరం

అవసరం లేని ఉత్పత్తులకు దూరం

మంచి ఆఫర్లో వస్తుందని లేదా తక్కువ ధరకు వస్తుందని అవసరం లేని ఉత్పత్తులు కొనుగోలు చేయడం సరికాదు. మన బడ్జెట్ అవసరాలను పరిగణలోకి తీసుకొని, ప్రాధాన్యతా క్రమంలో కొనుగోలు చేయాలి. ఆ తర్వాత ఇంకా అవసరమైతే కొనుగోలు చేయవచ్చు. నాణ్యత విషయంలో రాజీ పడవద్దు. తక్కువ మొత్తంలో ఎక్కువ నాణ్యత వస్తువులను ఎంపిక చేసుకోవాలి.

నాణ్యత అంటే బ్రాండ్ అనే భ్రమలో ఉండవద్దు. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేస్తే అధనపు ప్రయోజనాలు పరిగణలోకి తీసుకోవాలి. ఇతరులు కొనుగోలు చేస్తున్నారు కదా అని మనం కూడా కొనుగోలు చేయాలని భావించడం సరికాదు. అవసరమైన ఉత్పత్తినే కొనుగోలు చేయాలి.

మరిన్ని టిప్స్

మరిన్ని టిప్స్

ఆన్ లైన్ షాపింగ్ ద్వారా సమయాన్ని, పెట్రోల్ వంటి ఖర్చును తగ్గించుకోవచ్చు. కానీ ఆన్ లైన్ షాపింగ్ చేస్తే ఫిజికల్ షాపింగ్ చేసిన అనుభూతి ఉండదు. ఒకవిధంగా ఫిజికల్ షాపింగ్ చాలా బెట్టర్. కానీ ఆన్ లైన్ షాపింగ్ ద్వారా సమయం, ఖర్చును మాత్రం ఆదా చేయవచ్చు.

ఎక్స్‌పెన్సివ్ ఉత్పత్తుల పైన ధరలును ట్రాక్ చేయాలి.

ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేస్తే కూపన్స్ ఉపయోగించాలి.

వీకెండ్స్‌లో ఎక్కువమంది ఉంటారు. కాబట్టి ఆ సమయంలో షాపింగ్‌కు దూరంగా ఉండటం మంచిదేమో ఆలోచించాలి.

English summary

పండుగ సమయంలో షాపింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్ పాటించండి | Tips for shopping smareter during the Festive season

Tips for Shopping Smarter During the Festival Season. Plan ahead, plan budget. save time by shopping online.
Story first published: Friday, October 1, 2021, 16:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X