For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వారెన్ బఫెట్, ఝున్‌ఝున్‌వాలా నుండి పవర్‌ఫుల్ పెట్టుబడి రూల్స్: ఈ రెండూ చేయవద్దు..

|

ప్రపంచ దిగ్గజ పెట్టుబడిదారుడు, కుబేరుడు వారెన్ బఫెట్. దాదాపు దశాబ్దాలుగా ఆయన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ఆయన ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ వ్యాల్యూ పెరిగి ఆయన బిలియనీర్ అయ్యారు. దాదాపు గత ఆరు దశాబ్దాలుగా ఆయన ఇన్వెస్ట్ చేస్తుండగా, దాదాపు ప్రతి సంవత్సరం 20 శాతం వరకు రిటర్న్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. బెర్క్‌షైర్ హాత్‌వే సీఈవో. ఇన్వెస్టర్ నుండి బిజినెస్‌మెన్, ఫిలాంత్రపిస్ట్ వరకు చేరుకున్నారు. మరోవైపు, మన వద్ద రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భారతీయ పెట్టుబడిదారు. ఆయనను వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. పెట్టుబడుల ద్వారా ఆయన బాగా ఆర్జించారు. వీరి నుండి కొన్ని కీలక పెట్టుబడి సూత్రాలు చూద్దాం.

ఈ రెండు ఉండవద్దు...

ఈ రెండు ఉండవద్దు...

సాధారణంగా ఏ పెట్టుబడిదారు అయినా స్టాక్స్‌లో లేదా ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేశాక, ఊగిసలాటలు కనిపిస్తే గందరగోళానికి గురవుతారు. వాటిని వెనక్కి తీసుకునే వారు చాలా ఎక్కువ మంది ఉంటారు. అలాగే, కొద్ది కాలంలోనే అధిక ప్రయోజనం చూసేవారు ఉంటారు. ఓ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేశాక అది మెల్లిగా ముందుకు కదులుతుంటే ఆ స్టాక్ నుండి మార్చేస్తారు లేదా వెనక్కి తీసుకుంటారు.

అంటే పెట్టుబడిదారులు మార్కెట్ ఊగిసలాట సమయంలో ఆందోళన చెందుతారు. దీంతో వెనక్కి తీసుకుంటారు. మరో విషయం.. వేచి చూసే ధోరణి ఉండదు. మనం ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి చాలా వేగంగా రిటర్న్స్ చూస్తారు.

పెట్టుబడి పరిధి

పెట్టుబడి పరిధి

వారెన్ బఫెట్ లేదా రాకేష్ ఝున్‌ఝున్‌వాలాలు ఇన్వెస్ట్ చేయడానికి ఈ మూడు సూత్రాలు పాటిస్తారని చెప్పవచ్చు. ఇవి ఇరువురిలో సహజంగా కనిపించేవి అంటారు. ఇందులో ఒకటి మీకు ఏ బిజినెస్ అయితే అర్థమైందో అందులో ఇన్వెస్ట్ చేయాలి. పెట్టుబడులు తమ తమ పరిధిలోనే పెడతారు.

ప్రస్తుతం బఫెట్ పెట్టుబడులు అమెరికన్ ఎక్స‌ప్రెస్, కోకా-కోలా, జనరల్ మోటార్స్, చెవ్రాన్ వంటి వాటిలో ఉన్నాయి. ఇటీవలే ఆపిల్‌లో 5.6 శాతం స్టేక్‌ను దక్కించుకున్నారు. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఎస్కార్ట్స్, ర్యాలీస్ ఇండియా, స్పైస్ జెట్‌లో ఇన్వెస్ట్ చేశారు.

వాస్తవ వ్యాల్యూ కంటే తక్కువగా

వాస్తవ వ్యాల్యూ కంటే తక్కువగా

వారెన్ బఫెట్ షేర్ ధరలపై కాకుండా వ్యాల్యూపై దృష్టి పెడతారు. షేర్ వ్యాల్యూకు అనేక కారణాలు ఉంటాయి. భవిష్యత్తులో ఆ కంపెనీ ఆదాయాలు, ఆస్తుల పెంపు కీలకం. ముఖ్యంగా వ్యాపారం వాస్తవ వ్యాల్యూను తక్కువగా అంచనా వేస్తున్న కంపెనీలను వెతుకుతారు వారెన్ బఫెట్. అయితే స్టాక్ వ్యాల్యూ పడిపోవడాన్ని ఇక్కడ ప్రమాణంగా తీసుకోవద్దు. అయితే కొన్నిసార్లు కనిష్టాల వద్ద కూడా కొన్ని స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చు.

వెయిట్ అండ్ సీ

వెయిట్ అండ్ సీ

వారెన్ బఫెట్ లేదా రాకేష్ ఝున్‌ఝున్‌వాలా.. వీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ప్రప్రథమంగా లాంగ్ టర్మ్ కోసం చూస్తారు. అంటే ఇన్వెస్ట్ చేసి నిరీక్షిస్తారు. ఇన్వెస్ట్ చేసి, కొద్ది నెలల్లోనే రిటర్న్స్ కోసం చూడటం సరైనది కాదు. కరోనా లేదా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి సమయాల్లో స్టాక్స్ పతనం తాత్కాలికమేనని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ఆందోళన చెంది, స్టాక్స్ విక్రయిస్తారు. అలా చేయకూడదు. లాంగ్ టర్మ్ కోసం చూడాలి.

English summary

వారెన్ బఫెట్, ఝున్‌ఝున్‌వాలా నుండి పవర్‌ఫుల్ పెట్టుబడి రూల్స్: ఈ రెండూ చేయవద్దు.. | Three Warren Buffett's and Rakesh Jhunjhunwala's rules for investing

Warren Buffett’s investment performance has been phenomenal. Since 1964, his portfolio of stocks and businesses has delivered a compounded annual gain of around 20%.
Story first published: Monday, March 14, 2022, 10:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X