For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంచి రిటర్న్స్ కావాలా.. ఐతే ఈ కంపెనీల్లో పెట్టుబడులు చూడండి

|

స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల్లో ఉన్నాయి. స్టాక్స్ క్షీణించినప్పుడు కొనుగోలు చేయాలని చాలామంది భావిస్తారు. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారు నిపుణుల సలహాలు తీసుకొని పెట్టుబడులు పెట్టడం మంచిది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ ఖేమ్కా ప్రకారం నిఫ్టీ అంతకుముందు సరికొత్త గరిష్టాలకు చేరుకుంది. కానీ గత రెండు సెషన్లలో భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో కీలక మద్దతు 15500 పాయింట్లు, నిరోధకస్థాయి 15800 పాయింట్లు. ప్రముఖ బ్రోకరేజీ సంస్థ షేర్‌ఖాన్ మూడు స్టాక్స్ కొనుగోలు చేయవచ్చునని సూచిస్తోంది. ఆ స్టాక్స్...

టాటా ఈఎల్ఎక్స్ఐ స్టాక్

టాటా ఈఎల్ఎక్స్ఐ స్టాక్

టాటా ఈఎల్ఎక్స్ఐ షేర్ ధర ప్రస్తుతం రూ.4100 వద్ద ఉంది. ఈ షేర్ టార్గెట్ ధరను రూ.5000కు పెంచింది షేర్ ఖాన్. రానున్న కాలంలో టాటా ఈఎల్ఎక్స్ఐ మరింత దూకుడు ప్రదర్శిస్తుందని షేర్ ఖాన్ అభిప్రాయపడింది. ఎందుకంటే ఇది మీడియా, హెల్త్ కేర్ వంటి వాటి పైన దృష్టి సారించిందని గుర్తు చేస్తోంది. అలాగే క్లయింట్స్ బడ్జెట్ పెట్టగలిగిన ఎమర్జింగ్ టెక్నాలజీ (కనెక్టెడ్, ఆటోమోనస్, ఓటీటీ, డిజిటల్ హెల్త్, మెడికల్ డివైసెస్ తదితరాలు) వాటి పైనా దృష్టి సారించిందని చెబుతోంది. ఇండస్ట్రీ యావరేజ్ కంటే టాటా ఈఎల్ఎక్స్ఐ రెండింతలు వృద్ధి నమోదు చేయవచ్చునని అంచనా వేస్తోంది.

HDFC బ్యాంకు

HDFC బ్యాంకు

ఇటీవల HDFC బ్యాంకు ఫలితాలు వచ్చిన తర్వాత ఈ స్టాక్ క్షీణిస్తోంది. సోమవారం, మంగళవారం వరుసగా రెండు సెషన్లలో నష్టపోయింది. ప్రస్తుతం ఈ స్టాక్ రూ.1433 వద్ద ఉంది. షేర్ ఖాన్ టార్గెట్ ధర రూ.1800. బ్రోకరేజ్ సంస్థ ప్రకారం బలమైన కేపబిలిటీ, బలమైన రిస్క్ మెజర్‌మెంట్స్, అధిక నాణ్యత కలిగిన కార్పోరేట్స్ పైన దృష్టి సారించింది. ఇవి ఈ స్టాక్‌కు మద్దతునిస్తాయని తెలిపింది.

ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్

ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్

ఎల్ అండ్ టీ ఇన్ఫోటిక్ త్వరలో నియామకాలు చేపట్టవచ్చునని, అలాగే సమయానికి వేతనం ఇవ్వడం ఈ కంపెనీకి కలిసి వస్తాయని తెలిపింది. ప్రస్తుతం ఈ స్టాక్ రూ.4,346 వద్ద ఉంది. షేర్ ఖాన్ టార్గెట్ ధర రూ.4,800. స్టాక్స్‌లో పెట్టుబడులు, రిటర్న్స్ మార్కెట్‌కు అనుగుణంగా ఉంటాయి. దీని ఆధారంగా మాత్రమే పెట్టుబడులు సరికావు. నిపుణుల సలహాలు తీసుకొని, అన్నీ పరిశీలించి పెట్టుబడులు పెట్టాలి.

English summary

మంచి రిటర్న్స్ కావాలా.. ఐతే ఈ కంపెనీల్లో పెట్టుబడులు చూడండి | This brokerage believes strong returns on these stocks

Even as the markets have seen three successive days of losses, it opens a small window of opportunity for those looking to buy stocks on declines.
Story first published: Wednesday, July 21, 2021, 19:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X