For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ బిర్లా స్టాక్ 2700% లాభాలిచ్చింది: ఏడాది క్రితం రూ.33 ఇన్వెస్ట్ చేస్తే నేడు రూ.950 చేతికి

|

భారత స్టాక్ మార్కెట్లు 2021 ఏడాదిలో భారీగా లాభపడ్డాయి. 2021 క్యాలెండర్ ఏడాదిలో 47,869 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్టం 62,245 పాయింట్లకు ఎగిసి, ఒమిక్రాన్, ద్రవ్యోల్భణ ఆందోళన నేపథ్యంలో ఇటీవల కాస్త తగ్గి 57,806 పాయింట్ల వద్ద ముంది. ప్రస్తుత క్యాలెండర్ ఏడాదిలో సెన్సెక్స్ ఇప్పటి వరకు 9,937 పాయింట్లు జంప్ చేసింది. ఈ ఏడాది పలు స్టాక్స్ మల్టీ బ్యాగర్ స్టాక్స్‌గా నిలిచాయి. పలువురు ఇన్వెస్టర్లు భారీగా లాభపడ్డారు. కొన్ని స్టాక్స్ ఈ ఏడాది వెయ్యి నుండి 20వేల శాతం వరకు కూడా రిటర్న్స్ ఇచ్చాయి. అదే సమయంలో కొన్ని స్టాక్స్ నష్టాలను మిగిల్చాయి.

2700 శాతం జంప్

2700 శాతం జంప్

బిర్లా గ్రూప్‌లోని ఓ స్టాక్ 2021 సంవత్సరంలో 2700 శాతం ఎగిసింది. ఆ స్టాక్ ఎక్స్‌ప్రో ఇండియా. ఇది ఇన్వెస్టర్లకు అదిరిపోయే రిటర్న్స్ అందించింది. ఈ ఏడాది బెంచ్‌మార్క్ ఇండెక్స్ బీఎస్ఈ సెన్సెక్స్ 21 శాతం లాభపడగా, బిర్లా గ్రూప్‌లోని ఈ స్టాక్ మాత్రం 2700 శాతం లాభపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ అంటే టాప్ 30 స్టాక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్. 2021లో ఎక్స్‌ప్రో ఇండియా అత్యధిక రిటర్న్స్ ఇచ్చిన మల్టీ బ్యాగర్‌గా నిలిచింది. పాలీమర్ ప్రాసెసింగ్ రంగంలో ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. భారత్‌లో కెపాసిటర్స్ కోసం ప్యాకేజీంగ్ మెటీరియల్‌ను, రిఫ్రిజిరేటర్స్ కోసం లైనర్స్‌ను తయారీ చేసే ఏకైక సంస్థ. ఈ క్యాపిటల్ ఇంటెన్సివ్ వ్యాపారంలో పోటీదారులు లేరు.

 స్మాల్ క్యాప్ స్టాక్స్ రిటర్న్స్

స్మాల్ క్యాప్ స్టాక్స్ రిటర్న్స్

2021 జనవరి 1న ఈ స్టాక్ రూ.33.75 వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం ఇది రూ.949.95 వద్ద ముగిసింది. రూ.33 నుండి రూ.916 లాభపడి ఈ స్థాయికి చేరుకుంది. అక్షరాలా 2714 శాతం లాభపడింది. 52 వారాల గరిష్టం రూ.1003. గత ఆరు నెలల కాలంలో 462 శాతం, నెల రోజుల్లో 22 శాతం లాభపడింది.

స్మాల్ క్యాప్ స్టాక్స్ గత రెండేళ్ల కాలంలో 4200 శాతం రిటర్న్స్ ఇచ్చాయి. మూడేళ్ల కాలంలో సగటున 2350 శాతం రిటర్న్స్, అయిదేళ్ల కాలంలో సగటున 2000 శాతం రిటర్న్స్ ఇచ్చాయి.

తగ్గిన రుణాలు

తగ్గిన రుణాలు

Xpro ఇండియా నేడు 0.74 శాతం లేదా రూ.0.70 లాభపడి రూ.949.95 వద్ద ముగిసింది. గత మూడు సెషన్లుగా ఈ స్టాక్ దాదాపు 3 శాతం లాభపడింది. 5 రోజుల, 20 రోజుల, 50 రోజుల చలన సగటు కంటే ఎక్కువ. నవంబర్ 23, 2021న రూ.727 వద్ద ఉన్న ఈ స్టాక్ ఈ కొద్ది రోజుల్లోనే 31 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఈ కంపెనీ డెబిట్స్ మార్చి 31, 2020 నాటికి రూ.168 కోట్లు కాగా, మార్చి 31, 2021 నాటికి రూ.135 కోట్లకు తగ్గింది.

English summary

ఈ బిర్లా స్టాక్ 2700% లాభాలిచ్చింది: ఏడాది క్రితం రూ.33 ఇన్వెస్ట్ చేస్తే నేడు రూ.950 చేతికి | This Birla group stock rallied 2,700% in 2021

The Indian equities have witnessed a strong rally since the coronavirus-led market crash in March 2020. Since then, a large number of shares have entered the list of multibagger stocks, delivering skyrocketing returns to investors.
Story first published: Wednesday, December 29, 2021, 18:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X