For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్యాక్స్ సేవింగ్స్ FDలో మంచి వడ్డీ రేటు అందించే బ్యాంకులివే

|

పెట్టుబడిదారులు, ముఖ్యంగా వృద్ధులు ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు కలిగిన సాధనాల్లో పెట్టుబడులు పెట్టాలనుకోవడంతో పాటు DICGC నుండి రూ.5 లక్షల బీమా హామీ సాధనాన్ని పరిశీలించాలి. పన్ను ఆదా చేసే ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన వచ్చే వడ్డీ నెలవారీ లేదా త్రైమాసిక ప్రాతిపదికన చెల్లిస్తారు. సంపాదించిన వడ్డీ మొత్తాన్ని ఖాతాదారు తిరిగి పెట్టుబడిగా పెట్టవచ్చు. సీనియర్ సిటిజన్స్ విషయానికి వస్తే సాధారణ ప్రజలతో పోలిస్తే చాలా బ్యాంకులు వారికి అదనపు వడ్డీ రేట్లను అందిస్తాయి. అకాల ఉపసంహరణ చేయకుండా అయిదు సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలనుకునే సీనియర్ సిటిజన్ల కోసం, రెపో రేటు తర్వాత కూడా 2021లో పన్ను ఆధా చేసే ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన అధిక రాబడిని ఇస్తుంది. ఇలాంటి టాప్ 10 ప్రభుత్వ, ప్రయివేటు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇక్కడ చూడవచ్చు..

ప్రభుత్వరంగ బ్యాంకులు

ప్రభుత్వరంగ బ్యాంకులు

రూ.2 కోట్ల లోపు మొత్తం పైన సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ రేటును అందించే ప్రభుత్వరంగ బ్యాంకులు...

- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 6.00% - మూడేళ్ల నుండి 5 ఏళ్లు,

- కెనరా బ్యాంకు - 6.00% - మూడేళ్ల నుండి 5 ఏళ్లు,

- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 5.80% - మూడేళ్ల నుండి 5 ఏళ్లు,

- పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు - 5.80% - మూడేళ్ల నుండి 5 ఏళ్లు,

- బ్యాంక్ ఆఫ్ బరోడా - 5.75% - మూడేళ్ల నుండి 5 ఏళ్లు,

- పంజాబ్ నేషనల్ బ్యాంకు - 5.75%- మూడేళ్ల నుండి 5 ఏళ్లు,

- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు - 5.70% - 3 ఏళ్లు & ఆ పైన,

- ఇండియన్ బ్యాంకు - 5.65% - 5ఏళ్లు,

- బ్యాంక్ ఆఫ్ ఇండియా - 5.55% - మూడేళ్ల నుండి 5 ఏళ్లు,

- UCO బ్యాంకు - 5.50% - మూడేళ్ల నుండి 5 ఏళ్లు,

ప్రయివేటు సెక్టార్ బ్యాంకులు

ప్రయివేటు సెక్టార్ బ్యాంకులు

- DCB బ్యాంకు - 7.00% - 36 నెలల నుండి 60 నెలలు,

- యస్ బ్యాంకు - 7.00% - 3 ఏళ్ల నుండి 5 ఏళ్ల లోపు,

- RBL బ్యాంకు 7.00% - 60 నెలలు,

- ఇండస్ఇండ్ బ్యాంకు - 6.50% - ఇండస్ ట్యాక్స్ సేవర్ స్కీం (5 ఏళ్లు),

- IDFC ఫస్ట్ బ్యాంకు - 6.25% - ట్యాక్స్ సేవర్ డిపాజిట్ (5 ఏళ్లు),

- సౌత్ ఇండియన్ బ్యాంకు - 6.15% - ట్యాక్స్ గెయిన్ ( 5 ఏళ్లు),

- కరూర్ వైశ్య బ్యాంకు - 6.00% - KVB - ట్యాక్స్ షీల్డ్,

- బంధన్ బ్యాంకు - 6.00% - 3 ఏళ్ల నుండి 5 ఏళ్లు,

- యాక్సిస్ బ్యాంకు - 5.90% - 3 ఏళ్ల నుండి 5 ఏళ్లు,

- ICICI బ్యాంకు - 5.85% - 5 ఏళ్లు (80C FD)

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు

- Ujjivan Small Finance Bank - 7.25% - 3 ఏళ్ళ ఒకరోజు నుండి 5 ఏళ్ళు,

- Jana Small Finance Bank - 7.00% - 5 ఏళ్లు[1825 Days],

- North East Small Finance Bank - 7.00% - 1096 రోజుల నుండి 1825 రోజుల లోపు,

- Fincare Small Finance Bank - 6.75% - 48 నెలల 1 రోజు నుండి 59 నెలలు,

- Equitas Small Finance Bank - 6.75% - 4 ఏళ్ల 1 రోజు నుండి 5 ఏళ్ళ 1,

- Suryoday Small Finance Bank - 6.50% - 5 ఏళ్లు,

- Utkarsh Small Finance Bank - 6.50% - 701 రోజుల నుండి 3652 రోజులు,

- AU Small Finance Bank - 6.50% - 45 రోజుల1 రోజు నుండి 60 నెలలు,

- Capital Small Finance Bank - 6.00% - 1 ఏడాది నుండి 5 ఏళ్లు,

- ESAF Small Finance Bank - 5.75% - 1821 రోజుల నుండి 3653 రోజులు.

English summary

ట్యాక్స్ సేవింగ్స్ FDలో మంచి వడ్డీ రేటు అందించే బ్యాంకులివే | These ten banks promising best interest rates on Tax Saving FD

For senior citizens who want to open a tax-saving fixed deposit account for a deposit amount of less than Rs 2 Cr, here are the top 10 public sector banks offering the best interest rates.
Story first published: Saturday, August 7, 2021, 20:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X