For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేటు చాలా తక్కువ, లోన్ ట్రాన్సుఫర్ చేస్తే..

|

కొటక్ మహీంద్రా బ్యాంకు లిమిటెడ్(KMBL) ఇటీవల ఖుషీ కా సీజన్ ఫోర్త్ ఎడిషన్‌ను తీసుకు వచ్చింది. రుణాలు, మార్కీ బ్రాండ్స్, స్మార్ట్ ఈఎంఐ ఆఫర్స్ సహా అన్నింటి పైన బంపర్ డీల్స్ అందిస్తోంది. ఈ పండుగ సీజన్‌లో వినియోగదారులకు ఇది మంచి ప్రయోజనం. ఈ పండుగ సీజన్‌లో KMBL రుణాలపై తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. KMBL హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్‌తో అనుసంధానం చేయబడింది. అంటే ఆర్బీఐ పాలసీ వడ్డీ రేటు 6.5 శాతంతో ప్రారంభమవుతుంది. హోమ్ లోన్ పైన ఈ ప్రత్యేక 6.5 శాతం వడ్డీ రేటు నవంబర్ 8వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.

వివిధ వడ్డీ రేట్లు

వివిధ వడ్డీ రేట్లు

పండుగ సీజన్‌లో KMBL తక్కువ వడ్డీపై రుణాలు అందిస్తోంది. KMBL హోమ్ లోన్ వడ్డీ రేటు సంవత్సరానికి 6.5 శాతంగా ఉంది. వ్యక్తిగత రుణాలు సంవత్సరానికి 10.25 శాతం, ఆస్తి రుణాలు 7.25 శాతం, ద్విచక్ర వాహన రుణాలు 16.49 శాతం నుండి ప్రారంభమవుతున్నాయి. సెక్యూరిటీలు, వ్యాపార రుణాలు, హెల్త్ కేర్ ఫైనాన్స్, వర్కింగ్ క్యాపిటల్ సొల్యూషన్స్ పైన రుణాలన్నింటికి కాంపిటీటివ్ వడ్డీ రేట్లు ఉన్నాయి. గోల్డ్ లోన్స్, అగ్రి ఫైనాన్స్, నిర్మాణ సామాగ్రి రుణాలు, వాణిజ్య వాహనాలు, ఆటో రుణాలు, ట్రాక్టర్ ఫైనాన్స్ పైన ప్రత్యేకమైన డీల్స్ ఉన్నాయి. ఇందులో ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు ఉంది.

కొటక్ మహీంద్రా బ్యాంకు జాయింట్ ప్రెసిడెంట్ ఎలిజబెత్ వెంకటరామన్ మాట్లాడుతూ... పండుగ సీజన్ సందర్భంగా తాము తమ కస్టమర్లకు ఆనందాన్ని ఇవ్వదలుచుకున్నామని చెప్పారు. నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకున్న నేపథ్యంలో తమ కస్టమర్లకు ఉత్తమ ఆఫర్లు, డీల్స్, వడ్డీ రేట్లు అందిస్తున్నామన్నారు. తాము స్థానిక స్టోర్స్‌తో జత కట్టామని, దీంతో ఈ పండుగ సమయంలో మరింత విస్తృత సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

కొటక్ మహీంద్రా బ్యాంకు హోమ్ లోన్ ఫీచర్స్

కొటక్ మహీంద్రా బ్యాంకు హోమ్ లోన్ ఫీచర్స్

కొటక్ మహీంద్రా బ్యాంకు తమ హోమ్ లోన్ గ్రహీతలకు వివిధ రకాల కస్టమైజ్డ్ సేవలను అందిస్తోంది. నిరంతర హోమ్ లోన్ పైన జీరో ప్రాసెసింగ్ ఫీజు, హోమ్ లోన్ ప్రాసెస్ చేసి మంజూరు చేయడానికి డోర్ స్టెప్ సేవలు, సులభమైన డాక్యుమెంటేషన్, హోమ్ లోన్ బీమా, ఆన్ లైన్ ఈఎంఐ కాలిక్యులేటర్, ఇన్-ప్రిన్సిపాల్ మంజూరు లెట్టర్ ఆన్ లైన్ ద్వారా పొందవచ్చు.

కొటక్ బ్యాంకులో హోమ్ లోన్ దరఖాస్తు అర్హత

కొటక్ బ్యాంకులో హోమ్ లోన్ దరఖాస్తు అర్హత

- వయస్సు 18 నుండి 60 ఏళ్లు.

- సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండివిడ్యువల్స్ వయస్సు 18 ఏళ్ల నుండి 65 ఏళ్లు.

- రెసిడెంట్ ఇండియన్ ఇండివిడ్యువల్స్ గ్రాస్ ఆదాయం పరిమితి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణే, చెన్నైలలో కనీసం రూ.20,000 నెలకు. ఇతర నగరాల్లో కనీస ఆదాయ పరిమితి రూ.15,000 నెలకు.

- కనీస విద్యార్హత - ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ లేదా పార్ట్‌నర్‌షిప్ కంపెనీ ఉద్యోగి గ్రాడ్యుయేట్. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగం చేస్తే అవసరం లేదు.

- ఉద్యోగి అయితే కావాల్సిన పత్రాలు ఫోటోగ్రాఫ్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, రెసిడెంట్ ప్రూఫ్, చివరి మూడు నెలల శాలరీ స్లిప్స్, ఫామ్ 16, రెండేళ్ల ఐటీఆర్, ఆరు నెలల బ్యాంకు స్టేట్‌మెంట్, రిలేషన్‌షిప్ ప్రూఫ్, ఇప్పటికే రుణాలు ఏమైనా ఉంటే అందుకు సంబంధించిన వివరాలు, ప్రాపర్టీ డాక్యుమెంట్ అవసరం.

- సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే.. బ్యాంక్ స్టేట్‌మెంట్/పాస్ బుక్ కాపీ, ఏజ్ ప్రూఫ్, బిజినెస్ కంటిన్యుటీ అండ్ ఇన్‌కం ప్రూఫ్, జాబ్ కార్డ్, జాబ్ కన్ఫర్మేషన్ ప్రూఫ్.

వడ్డీ రేటు

వడ్డీ రేటు

స్పెషల్ బ్యాలెన్స్ ట్రాన్సుఫర్ రేటు ఉద్యోగులకు అయితే 6.5 శాతం నుండి ప్రారంభం, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే 6.60 శాతం నుండి ప్రారంభం. నాన్-బ్యాలెన్స్ ట్రాన్సుఫర్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కు 6.65 శాతం నుండి 7.25 శాతం వడ్డీ రేటు, శాలరైడ్ అయితే 6.50 శాతం నుండి 7.10 శాతం వడ్డీ రేటు ఉంది.

English summary

These banks offering home loans with 6.5 interest rate, know the details

Kotak Mahindra Bank Limited (KMBL) on Friday revealed the unveiling of the 4th edition of Khushi ka Season, a month-long initiative that promises bumper deals on everything - loans, marquee brands, and Smart EMI offers - in an action to disperse festive life force even further during the ongoing festive season.
Story first published: Thursday, October 14, 2021, 13:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X