For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సేవింగ్స్ అకౌంట్స్‌పై మంచి వడ్డీ రేటు ఇచ్చే టాప్ 10 బ్యాంకులివే..

|

అత్యవసర అవసరాల కోసం మీరు పొదుపు చేసిన మొత్తాన్ని వినియోగించాలనుకుంటే మీ పోర్ట్‌పోలియోలో సేవింగ్స్ అకౌంట్ తప్పనిసరి. సాధారణంగా సేవింగ్స్ అకౌంట్స్ వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. సేవింగ్స్ ఖాతాలో పెట్టుబడులు మంచి ఆలోచన. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే కొన్ని బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్స్ పైన అధిక రాబడిని అందిస్తున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఒకేసారి పెద్ద మొత్తం పెట్టాలి. అలాగే అత్యవసర సమయంలో ఉపసంహరణకు అనుమతి ఉండదు. అదే సమయంలో సేవింగ్స్ అకౌంట్ అధిక ద్రవ్యతను అందిస్తుంది. అవసరమైనప్పుడు నిధులను ఉపయోగించుకోవచ్చు. లిక్విడిటీ స్వభావం, వడ్డీ రేట్లను దృష్టిలో ఉంచుకొని సేవింగ్స్ ఖాతాలపై అధిక వడ్డీ రేట్లను అందిస్తున్న టాప్ 10 ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులను తెలుసుకుందాం.

అధిక వడ్డీ రేటు అందించే టాప్ 10 ప్రయివేటు సెక్టార్ బ్యాంకులు

అధిక వడ్డీ రేటు అందించే టాప్ 10 ప్రయివేటు సెక్టార్ బ్యాంకులు

ప్రయివేటు రంగ బ్యాంకుల్లో ఆర్బీఎల్ బ్యాంకు, ఆ తర్వాత ఇండస్‌ఇండ్ బ్యాంకు, యస్ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్స్ పైన అత్యధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. సేవింగ్స్ అకౌంట్స్ పైన బెస్ట్ రిటర్న్స్ ఇచ్చే టాప్ 10 బ్యాంకులు ఇవే...

- RBL బ్యాంకు 4.25% నుండి 6.00%, జూలై 2, 2021 నుండి.

- Yes బ్యాంకు 4.00% నుండి 5.25%, మే 13, 2021 నుండి.

- ఇండస్ ఇండ్ బ్యాంకు 4.00% నుండి 5.50%, జూన్ 4, 2021 నుండి.

- కొటక్ మహీంద్రా బ్యాంకు 3.5% నుండి 4.00%, జూన్ 19, 2021 నుండి.

- DCB బ్యాంకు 3.00% నుండి 6.75%, జూన్ 10, 2021 నుండి.

- బందన్ బ్యాంకు 3.00% నుండి 6.00%, జూన్ 7, 2021 నుండి.

- IDFC ఫస్ట్ బ్యాంకు 3.00% నుండి 5.00%, మే 1, 2021 నుండి.

- DBS బ్యాంకు 3.00% నుండి 4.00%, ఫిబ్రవరి 12, 2021

- HDFC బ్యాంకు 3.00% నుండి 3.50%, జూన్ 11, 2020

- యాక్సిస్ బ్యాంకు 3.00% నుండి 3.50%, ఏప్రిల్ 1, 2021.

అధిక వడ్డీ రేటు అందించే టాప్ 10 PSU బ్యాంకులు

అధిక వడ్డీ రేటు అందించే టాప్ 10 PSU బ్యాంకులు

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.75 శాతం తక్కువగా ఇస్తోంది.

- పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు 3.10%, 12.11.2020.

- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 3.05%, 09.11.2020.

- IDBI బ్యాంకు 3.00% నుండి 3.35%, July 14, 2021.

- పంజాబ్ నేషనల్ బ్యాంకు 3.00%, 1st July 2021.

- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.00%, 31.03.2020.

- కెనరా బ్యాంకు 2.90% నుండి 3.20%, 28.09.2020.

- బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.90%, 01.10.2020.

- ఇండియన్ బ్యాంకు 2.90%, 21.11.2020.

- బ్యాంక్ ఆఫ్ బరోడా 2.75% నుండి 3.20%, 26.05.2021

- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.75% నుండి 2.90%, 10.04.2021

టాప్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు

టాప్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు

- ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 5.00% నుండి 7.00%, July 1, 2021.

- ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 4.00% నుండి 7.00%, 6th March 2021.

- ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 4.00% నుండి 6.50% 1st August 2020.

- నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 4.00% నుండి 6.00% 1st March 2021.

- సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 4.00 నుండి 6.25% June 1, 2020.

- AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 3.50% నుండి 7.00% 17 May 2021.

- ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 3.50% నుండి 7.00% 1st June 2021.

- క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 3.50%, June 3, 2021.

- ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, 3.00% నుండి 7.00% 01 July 2021.

- జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, 3.00% నుండి 6.75%, 06.05.2021.

English summary

సేవింగ్స్ అకౌంట్స్‌పై మంచి వడ్డీ రేటు ఇచ్చే టాప్ 10 బ్యాంకులివే.. | These banks are giving higher interest rates on savings accounts

Among the private sector banks, RBL Bank followed by IndusInd Bank and Yes Bank is currently promising higher interest rates on savings accounts.
Story first published: Thursday, July 15, 2021, 21:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X