For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అదిరిపోయే ఆఫర్: ఈ 5 బ్యాంకుల్లో పర్సనల్ లోన్ తక్కువ వడ్డీ రేటుకే

|

సాధారణంగా హోమ్ లోన్, వెహికిల్ లోన్, గోల్డ్ లోన్ పైన వడ్డీ రేటు పర్సనల్ లోన్ కంటే కాస్త తక్కువగానే ఉంటుంది. మొదటి మూడు సెక్యూర్డ్ లోన్స్. కానీ పర్సనల్ లోన్ అన్-సెక్యూర్డ్ రుణం. కాబట్టి మిగతా రుణాలతో పోలిస్తే ఈ రుణంపై వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అయితే వివిధ బ్యాంకుల్లో వివిధ వడ్డీ రేట్లు ఉంటాయి. కరోనాకు ముందు పర్సనల్ లోన్ వడ్డీ రేటు 12 శాతం నుండి 18 శాతం వరకు కూడా ఉంది. ప్రస్తుతం వడ్డీ రేట్లు తగ్గడంతో 10 శాతం నుండి 12 శాతం మధ్య కూడా వస్తున్నాయి.

అయితే పలు బ్యాంకులు 9 శాతం కంటే తక్కువ వడ్డీ రేటుతోను పర్సనల్ లోన్ ఇస్తున్నాయి. ఇప్పుడు హోమ్ లోన్ వడ్డీ రేటు కనిష్టంగా 6.5 శాతం నుండి 8.5 శాతం వరకు ఉంది. కొన్ని బ్యాంకులు ఈ అన్-సెక్యూర్డ్ పర్సనల్ లోన్ కూడా దాదాపు హోమ్ లోన్(గరిష్టం)తో సమానమైన వడ్డీ రేటును కూడా అందించడం గమనార్హం. యూనియన్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలు పర్సనల్ లోన్ పైన అతి తక్కువ వడ్డీ రేటును అందిస్తున్నాయి.

వడ్డీ రేటు 8.9 శాతమే

వడ్డీ రేటు 8.9 శాతమే

దీపావళి సమయంలో పలు బ్యాంకులు వడ్డీ రేటు తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించాయి. దీపావళి దాటిన తర్వాత కూడా కొన్ని బ్యాంకులు ఈ ఆఫర్ కొనసాగిస్తున్నాయి. పండుగ సందర్భంగా తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు రద్దు లేదా తగ్గింపును ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి.

అయిదేళ్ల కాలపరిమితి కోసం రూ.5 లక్షల వరకు తీసుకునే పర్సనల్ లోన్ పైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.9 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. నెలవారీ ఈఎంఐ రూ.10,355 అవుతుంది. సెంట్రల్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా తక్కువ వడ్డీ రేటుతో పర్సనల్ లోన్ ఇస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది.

ఈ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ రేటు

ఈ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ రేటు

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.9 శాతం వడ్డీ రేటుకే పర్సనల్ లోన్ ఇస్తుండగా, ఇండియన్ బ్యాంకు తక్కువ వడ్డీ రేటుకే పర్సనల్ లోన్ ఇవ్వడంలో రెండో స్థానంలో ఉంది. ఈ బ్యాంకు 9.05 శాతానికే అందిస్తోంది. రూ.5 లక్షలు తీసుకుంటే నెలవారీ ఈఎంఐ రూ.10,391.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పర్సనల్ లోన్ వడ్డీ రేటు 9.45 శాతంగా ఉంది. ఈఎంఐ రూ.10.489 అవుతుంది.

పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు పర్సనల్ లోన్ వడ్డీ రేటు 9.5 శాతంగా ఉంది. అయిదేళ్ల కాలపరిమితితో రూ.5 లక్షల రుణం తీసుకుంటే రూ.10,501 ఈఎంఐ అవుతుంది.

IDBI బ్యాంకు పర్సనల్ లోన్ వడ్డీ రేటు 9.5 శాతంగా ఉంది. అయిదేళ్ల కాలపరిమితితో రూ.5 లక్షల రుణం తీసుకుంటే రూ.10,501 ఈఎంఐ అవుతుంది.

ఆ వడ్డీ రేటు కంటే తక్కువ

ఆ వడ్డీ రేటు కంటే తక్కువ

పండుగ సమయంలో పలు బ్యాంకులు వడ్డీ రేటు తగ్గింపుతో పాటు ప్రాసెసింగ్ ఫీజు రద్దు లేదా తగ్గింపును అమలు చేశాయి. కొన్ని బ్యాంకులు ఈ ప్రయోజనాలను కొనసాగిస్తున్నాయి. దేశంలోని ప్రధాన బ్యాంకులు పండుగ సమయంలో 9.6 శాతం తక్కువ వడ్డీ రేటుకు పర్సనల్ లోన్ అందించాయి. అప్పుడు నెలవారీ ఈఎంఐ రూ.10,525 అవుతుంది. ఈ ఆఫర్ సమయం కంటే కూడా పై బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుతో అందిస్తున్నాయి.

English summary

అదిరిపోయే ఆఫర్: ఈ 5 బ్యాంకుల్లో పర్సనల్ లోన్ తక్కువ వడ్డీ రేటుకే | These 5 banks offer the cheapest personal loans starting at 8.9 percent

Diwali may have ended in the country, but several banks continue to offer festive loan offers across categories. The concessions include lower festive rates and processing fee waivers.
Story first published: Wednesday, November 24, 2021, 11:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X