For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాటా మోటార్స్ బంపరాఫర్, 6నెలలు ఈఎంఐ లేకుండా కారు కొనొచ్చు

|

కరోనా - లాక్ డౌన్ నేపథ్యంలో కంపెనీలు, వ్యాపారులకు ఆదాయం లేకపోవడం, ఉద్యోగులకు వేతనం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశాల మేరకు బ్యాంకులు ఆరు నెలల పాటు ఈఎంఐపై మారటోరియం ఇచ్చాయి. ఇప్పుడు ఎంపిక చేసిన మోడల్ వాహనాలపై టాటా మోటార్స్ కూడా ఆకర్షణీయమైన ఫైనాన్స్ పథకం ప్రవేశ పెట్టింది.

ఎకానమీ రికవరీపై శుభవార్త, ఇక మారటోరియం పొడిగింపు అవసరంలేదుఎకానమీ రికవరీపై శుభవార్త, ఇక మారటోరియం పొడిగింపు అవసరంలేదు

జీరో డౌన్ పేమెంట్, 6 నెలల మారటోరియం

జీరో డౌన్ పేమెంట్, 6 నెలల మారటోరియం

టియాగో, నెక్సాన్, ఆల్ ట్రెజ్ కార్లు కొనుగోలు చేసే కస్టమర్ల కోసం కరూర్ వైశ్య బ్యాంకు (KVB)తో కలిసి టాటా మోటార్స్ ఈ సరికొత్త ఆరు నెలల ఈఎంఐ మారటోరియం పథకాన్ని తీసుకు వచ్చింది. ఈ పథకంలో భాగంగా ఆరు నెలల వరకు ప్రతి నెల వడ్డీ చెల్లిస్తే చాలు. ఈ కాలంలో ఈఎంఐ చెల్లించవలసిన అవసరం లేదు. ప్రస్తుత కరోనా టైంలో వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఎంతో వెసులుబాటు కలిగిన స్కీంగా చెబుతున్నారు.

జీరో డౌన్ పేమెంట్

జీరో డౌన్ పేమెంట్

ఈఎంఐ మారటోరియం స్కీంతో పాటు ఇతర ఫైనాన్షియల్ స్కీమ్స్‌ను కూడా టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది. ఈఎంఐ మారటోరియంతో పాటు ఎంపిక చేసిన ఉద్యోగులు లేదా స్వయంఉపాధి కలిగిన వారు జీరో డౌన్ పేమెంట్‌తో వాహనాలు కొనుగోలు చేయవచ్చు. ఇందుకు ఈ కంపెనీ దేశంలోని సుదీర్ఘ అనుభవం కలిగిన కేవీబీ బ్యాంకు ద్వారా అయిదేళ్ల కాలపరిమితితో కూడిన వాహన రుణాన్ని అందిస్తుంది.

సామాజిక దూరం... ఊతం

సామాజిక దూరం... ఊతం

ప్రస్తుత కరోనా సమయంలో చాలామంది వ్యక్తిగత వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించాలంటే సామాజిక దూరం తప్పనిసరి. ఇందుకు వాహనాల సేల్స్ రానున్న కాలంలో మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే సెకండ్ హ్యాండ్ వాహనాల సేల్స్ పెరిగాయి. కొత్త వాహనాల సేల్స్ కూడా క్రమంగా పుంజుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తమ స్కీం సహకరిస్తుందని టాటా మోటార్స్ తెలిపింది. ఉద్యోగ అనిశ్చితుల నేపథ్యంలో తమ పథకం ఉద్యోగులకు ఉపయోగపడుతుందని పేర్కొంది.

ప్రారంభ ఈఎంఐలు

ప్రారంభ ఈఎంఐలు

ఈ కొత్త పథకంతో పాటు టాటా మోటార్స్ లాంగ్ టెన్యూర్ లోన్‌లో భాగంగా ఎనిమిదేళ్ల ఈఎంఐ అందిస్తోంది. ఇందుకు వివిధ బ్యాంకులతో జత కట్టింది. టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హాచ్‌బ్యాక్ ప్రారంభ ఈఎంఐ రూ.5,555, నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, బ్రాండ్ ఎంట్రీ లెవల్ మోడల్ టియాగో ప్రారంభ ఈఎంఐ వరుసగా రూ.7,499, రూ.4,999గా ఉంది.

English summary

టాటా మోటార్స్ బంపరాఫర్, 6నెలలు ఈఎంఐ లేకుండా కారు కొనొచ్చు | Tata Motors Introduces New EMI Moratorium Scheme

Tata Motors has announced the launch of a novel and attractive financing offer on its select models in the line-up. The new finance scheme offers customers a six-month moratorium on monthly instalments.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X