For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సుకన్య సమృద్ధి యోజన వర్సెస్ చైల్డ్ ఇన్సురెన్స్ ప్లాన్

|

పిల్లలకు మంచి విద్యను అందించడం, ఆ తర్వాత వివాహం వంటివి తల్లిదండ్రుల అతిపెద్ద ఆందోళన. పిల్లల చదువులకు, పెళ్లికి పెద్ద మొత్తంలో ఖర్చులు ఉంటాయి. కాబట్టి వీటి కోసం సరైన ప్రణాళిక, పెట్టుబడులు అవసరం. విద్యారంగంలో ద్రవ్యోల్భణం అధికంగా ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే నిధుల కొరత కారణంగా తమ పిల్లలు బంగారంలాంటి అవకాశం కోల్పోకుండా ఉండేలా తల్లిదండ్రులు కార్పస్‌ను సిద్ధం చేయాలి.

సుకన్య సమృద్ధి యోజన

సుకన్య సమృద్ధి యోజన

అమ్మాయి పేరెంట్స్ లేదా లీగల్ గార్డియన్‌లు సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరుచుకోవచ్చు. అమ్మాయి పదేళ్ళు వచ్చే వరకు ఈ ఖాతాను తెరువవచ్చు.

సుకన్య సమృద్ధి యోజన పూర్తి రిస్క్ ఫ్రీ సావరీన్ గ్యారెంటీ స్కీమ్. ఆకర్షణీయ వడ్డీ రేటును అందిస్తోంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కంటే అధిక వడ్డీ రేటు వస్తుంది. ఇది ప్రమాదరహితమైనది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పై అందించే రేటు కంటే ఆకర్షణీయ వడ్డీ రేటును అందిస్తుంది.

సుకన్య సమృద్ధి యోజన మెచ్యూరిటీ కాల వ్యవధి 21 సంవత్సరాలు. పదిహేనేళ్లు డిపాజిట్ చేయాలి. ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత 50 శాతం పాక్షిక ఉపసంహరణకు అవకాశముంది. మెచ్యూరిటీ వయస్సు 21 సంవత్సరాలు అయినప్పటికీ ఆఢపిల్ల వివాహం 18 ఏళ్లు నిండిన తర్వాత చేస్తే ఆ ఖాతాను మూసివేయవచ్చు. సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం ఉంది.

ఆడపిల్లల పేరు మీదనే

ఆడపిల్లల పేరు మీదనే

ఎస్ఎస్‌వై అకౌంట్‌ను కేవలం ఆడపిల్లల పేరు మీదనే ఓపెన్ చేయవచ్చు. మగపిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఇతర పెట్టుబడి సాధానాలను ఎంచుకోవాలి. సంపాదించే పేరెంట్ అనుకోని పరిస్థితుల్లో మృతి చెందితే SSYలో పెట్టుబడి పెట్టడం ఆపివేయవచ్చు. SSY ఖాతాను పిల్లల చదువుల కోసం వినియోగించవచ్చు.

చైల్డ్ ఇన్సురెన్స్ ప్లాన్

చైల్డ్ ఇన్సురెన్స్ ప్లాన్

SSY వలె చైల్డ్ ఇన్సురెన్స్ ప్లాన్ కూడా పిల్లల ఉన్నత చదువుల కోసం, వివాహం వంటి వాటి ఆర్థిక అవసరాల కోసం ప్లాన్ చేయడానికి ఉపయోగించే పెట్టుబడి సాధానం. అంతేకాకుండా ఈ ఇన్సురెన్స్‌లు బాలికలతో పాటు బాలురు తీసుకోవచ్చు. చైల్డ్ ఇన్సురెన్స్ ప్లాన్స్ ద్వారా సంపాదిస్తున్న పేరెంట్స్ దురదృష్టవశాత్తూ దూరమైన ప్రీమియం చెల్లించకుండానే పాలసీ కొనసాగుతుంది. తల్లిదండ్రులు మెచ్యూరిటీ వ్యవధిని ఎంచుకునే సౌలభ్యం ఉంది. కొన్ని సందర్భాల్లో మనీ బ్యాక్ వంటి సౌకర్యం ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన వలె చైల్డ్ ఇన్సురెన్స్ ప్లాన్స్‌లో పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు ఉంటాయి. మెచ్యూరిటీ, మనీ బ్యాక్ పన్నురహితం.

English summary

సుకన్య సమృద్ధి యోజన వర్సెస్ చైల్డ్ ఇన్సురెన్స్ ప్లాన్ | Sukanya Samriddhi Yojana vs Child Insurance Plan

Providing good education to children are the prime concern for parents. The high rate of inflation in the education sector adds to the concern, as parents need to keep a corpus ready to ensure that their children don’t miss a golden opportunity due to paucity of funds.
Story first published: Thursday, February 17, 2022, 18:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X