For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలు తగ్గుతాయా, స్టాక్ మార్కెట్ ఎగిసిపడుతుందా?

|

ఈ వారం స్టాక్ మార్కెట్ సానుకూలంగా, బులియన్ మార్కెట్ ప్రతికూలంగా కదలాడవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా బ్యాంకింగ్ స్టాక్స్ ముందుకు నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయని, ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ ఈ వారం ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ట్రేడింగ్ నిర్వహిస్తారు. ఈ కంపెనీలు బలమైన గణాంకాలతో సానుకూల అంచనాలను ప్రకటిస్తాయని ధీమాగా ఉన్నారు.

దీనికి తోడు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పైన ప్రభుత్వాల చర్యలు, వ్యాక్సినేషన్ వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంటును బలపరుస్తాయని చెబుతున్నారు. అదే సమయంలో ఫెడ్ వడ్డీ రేటు పెంపు అంశం పసిడిపై ఈ వారం కూడా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. వచ్చే నెల ప్రారంభంలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సూచీలు అప్రమత్తంగా కదలాడనున్నాయి.

ఏ రంగం ఎలా

ఏ రంగం ఎలా

ఈ వారం నిఫ్టీ 18000 స్థాయిని పరీక్షీంచవచ్చునని అంచనా. స్వల్పకాలంలో నిఫ్టీ బ్యాంకు 38500ను తాకవచ్చునని భావిస్తున్నారు. కరోనా పరిణామాలు చాలా కీలకం. ద్రవ్యోల్భణం, పారిశ్రామిక ఉత్పత్తు గణాంకాలు కూడా ప్రభావం చూపుతాయి. ఈ వారం టెలికం రంగం స్టాక్స్ అప్రమత్తంగా కదలాడవచ్చు. మెటల్ స్టాక్స్ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ధరలు పెరిగిన కారణంగా సిమెంట్ షేర్లు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీల షేర్లు రెండో వారం ఢీలా పడే అవకాశం కనిపిస్తోంది. ఐటీ షేర్లు మాత్రం పుంజుకోవచ్చునని భావిస్తున్నారు.

మార్కెట్ జంప్

మార్కెట్ జంప్

నిఫ్టీ గతవారం 17812 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఈ వారం 18000 దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత మూడు వారాల్లో నిఫ్టీ దాదాపు 1500 పాయింట్లు ఎగిసింది. 17930 ఎగువన నిరోధకం కనిపిస్తోంది. అప్ ట్రెండ్ కనబరిస్తే తదుపరి నిరోధకం 18050 పాయింట్లు.

17800 పాయింట్ల వద్ద మద్దతు, 17930 పాయింట్ల వద్ద నిరోధకం కనిపిస్తోందని చెబుతున్నారు. సెన్సెక్స్ క్రితం వారం 59,745 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఈ వారం 60,000 మార్కును దాటి, ఆల్ టైమ్ గరిష్టం 62,245 పాయింట్ల సమీపానికి చేరుకునే అవకాశాలు కొట్టి పారేయలేమని చెబుతున్నారు.

బంగారం ధరలు మరింత

బంగారం ధరలు మరింత

బంగారం ధరలు గతవారం రెండు నెలల కనిష్టానికి పడిపోయాయి. ప్రధానంగా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు ప్రభావం చూపాయి. ఈ వారం కూడా ఈ ప్రభావం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కామెక్స్‌లో పసిడి 1760 డాలర్ల దిగువకు పడిపోవచ్చునని, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో 47,000 స్థాయికి రావొచ్చునని అంచనా.

English summary

బంగారం ధరలు తగ్గుతాయా, స్టాక్ మార్కెట్ ఎగిసిపడుతుందా? | Stock Market and Gold Market Forecast for January 10 week

As we head into the last five trading sessions of the year, it is important to note that Nifty is still below the 20-week MA which presently stands at 17,443.
Story first published: Monday, January 10, 2022, 8:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X