For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అతి తక్కువ వడ్డీకే కారు రుణాలు: వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు

|

సాధారణ కారు రుణానికి బదులు రుణగ్రహీత స్టెప్ అప్ పథకం, బెలూన్ పథకం వంటివి ఎంచుకోవచ్చు. కొనుగోలుదారులకు వారి నగదు లభ్యతను బట్టి రుణం తిరిగి చెల్లించే సౌలభ్యాన్ని కలిగిస్తున్నాయి ఈ పథకాలు. కార్ల తయారీ సంస్థలు మారుతీ సుజుకీ ఇండియా, హ్యుండాయ్ మోటార్ రుణ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని సౌకర్యవంతమైన కారు లోన్స్‌ను అందిస్తున్నాయి. రుణగ్రహీతలు కొత్త కారు పైన ఏడు శాతం నుండి ఏడున్నర శాతం వరకు వడ్డీ రేట్లను పొందవచ్చు.

బీవోబీ, ఎస్బీఐలో...

బీవోబీ, ఎస్బీఐలో...

- బ్యాంక్ ఆఫ్ బరోడాలో కొత్త కారు రుణం ఏడు శాతం నుండి 10.25 శాతం ఉంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.1500. లోన్ చెల్లించే కాలపరిమితి ఏడు సంవత్సరాలు.

- యూబీఐలో కొత్త కారు రుణం 7.30 శాతం నుండి 9.90 శాతం ఉంది. ప్రాసెసింగ్ ఫీజు 0.25 శాతం లేదా రూ.1000 నుండి రూ.5,000. లోన్ చెల్లించే కాలపరిమితి ఏడు సంవత్సరాలు.

- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొత్త కారు రుణం 7.5 శాతం నుండి 11.20 శాతం ఉంది. ప్రాసెసింగ్ ఫీజు 0.40 శాతం వరకు. లోన్ చెల్లించే కాలపరిమితి ఏడు సంవత్సరాలు.

బీవోఐలో...

బీవోఐలో...

- బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొత్త కారు రుణం 7.45 శాతం నుండి 8.55 శాతం ఉంది. ప్రాసెసింగ్ ఫీజు 0.25 శాతం. గరిష్టంగా రూ.25000 వసూలు చేస్తారు. లోన్ చెల్లించే కాలపరిమితి ఏడు సంవత్సరాలు.

- ఐడీబీఐలో కొత్త కారు రుణం 7.5 శాతం నుండి 8.10 శాతం ఉంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.2,500 వసూలు చేస్తారు. లోన్ చెల్లించే కాలపరిమితి ఏడు సంవత్సరాలు.

- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో కొత్త కారు రుణం 7.55 శాతం నుండి 10.40 శాతం ఉంది. ప్రాసెసింగ్ ఫీజు 0.25 శాతం. గరిష్టం రూ.25,000 ఉంది. లోన్ చెల్లించే కాలపరిమితి ఏడు సంవత్సరాలు.

- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో కొత్త కారు రుణం 7.55 శాతంగా ఉంది. ప్రాసెసింగ్ ఫీజు 0.6 శాతం. కనిష్టం రూ.500 నుండి గరిష్టం రూ.10,000 ఉంది. లోన్ చెల్లించే కాలపరిమితి ఏడు సంవత్సరాలు.

ICICI, HDFC బ్యాంకులో..

ICICI, HDFC బ్యాంకులో..

- పంజాబ్ నేషనల్ బ్యాంకులో కొత్త కారు రుణం 7.55 శాతం నుండి 7.80 శాతంగా ఉంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.1,500. లోన్ చెల్లించే కాలపరిమితి ఏడు సంవత్సరాలు.

- ICICI బ్యాంకులో కొత్త కారు రుణం 7.90 శాతం నుండి 9.85 శాతంగా ఉంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.3,500 నుండి రూ.8,500 వరకు ఉంది. లోన్ చెల్లించే కాలపరిమితి ఏడు సంవత్సరాలు.

- HDFC బ్యాంకులో కొత్త కారు రుణం 7.95 శాతం నుండి 8.30 శాతంగా ఉంది. ప్రాసెసింగ్ ఫీజు 1 శాతం. కనిష్టం రూ.5,000 నుండి రూ.10,000 వరకు ఉంది. లోన్ చెల్లించే కాలపరిమితి ఏడు సంవత్సరాలు.

- ఫెడరల్ బ్యాంకులో కొత్త కారు రుణం 8.50 శాతంగా ఉంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.1,500 నుండి రూ.2,500 వరకు ఉంది. లోన్ చెల్లించే కాలపరిమితి ఏడు సంవత్సరాలు.

English summary

అతి తక్కువ వడ్డీకే కారు రుణాలు: వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు | Should you opt for flexible car loans?

Car manufacturers like Maruti Suzuki India Ltd and Hyundai Motor India Ltd have tied up with lenders to offer flexible auto loans. Instead of a regular car loan, the borrower can choose from a step-up scheme, balloon scheme, and other loan structures.
Story first published: Monday, May 17, 2021, 18:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X