For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 3 స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడి ఉండొచ్చు, షేర్‌ఖాన్ ఏం చెబుతోందంటే

|

బజాజ్ ఫైనాన్స్, గ్లాండ్ ఫార్మా, ఐటీ కంపెనీ మాస్టెక్ షేర్లను కొనుగోలు చేయవచ్చునని ప్రముఖ బ్రోకింగ్ సంస్థ షేర్‌ఖాన్ సిఫార్స్ చేస్తోంది. మీడియం టర్మ్‌లో ఈ స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది. అయితే ఇన్వెస్టర్లు ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పటికే స్టాక్స్ భారీగా రాణించాయనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఈ స్టాక్స్ కొనుగోలు చేసే విషయంలో అన్ని అంశాలను పరిశీలనలోకి తీసుకోవాలి. పెట్టుబడికి ముందు అన్నింటిని పరిశీలించి, నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

మాస్కెట్

మాస్కెట్

FY2021-FY2024Eలో ప్రముఖ ఐటీ కంపెనీ మాస్కెట్ బలమైన వృద్ధి నమోదు చేయవచ్చునని, CAGR 24 శాతం ఉండవచ్చునని పేర్కొంది. ఈ సంస్థ ఊహించిన దాని కంటే మెరుగైన ఫనితీరును కనబరిచిందని, బలమైన ఫలితాలను ఇచ్చిందని తెలిపింది. క్లౌడ్ మైగ్రేషన్ స్పేస్, హెల్తీ డీల్ పైప్‌లైన్, SAPలో అవకాశాలు ఉన్నందున, FY22లోను బలమైన వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ కంపెనీ డీల్ సైజ్ పెరగడం, పెద్ద డీల్స్, డిజిటల్ ఖర్చులు పెరగడం, క్లౌడ్ ట్రాన్స్‌ఫార్మేషన్ వంటివి కలిసి వస్తాయని వెల్లడించింది. మాస్కెట్ టార్గెట్ ధరను రూ.2950గా పేర్కొంది.

గ్లాండ్ ఫార్మా

గ్లాండ్ ఫార్మా

గ్లాండ్ ఫార్మా షేర్ ధర ప్రస్తుతం రూ.4148 వద్ద ఉంది. టార్గెట్ ధర రూ.4,400. FY21 మొదటి త్రైమాసికంలో బలమైన వృద్ధిని నమోదు చేసిందని, అంచనాల కంటే మించి ఫలితాలు నమోదయ్యాయని తెలిపింది. కోవిడ్ డ్రగ్ వంటి సామర్థ్యం కలిసి వస్తుందని చెబుతున్నారు. ఇండియన్ మార్కెట్లలో బలమైన వృద్ధి, కోర్ మార్కెట్లలో రెండంకెల వృద్ధి, వ్యాక్సీన్ అవకాశాలు కంపెనీకి కీలకమైన చోదకాలుగా పేర్కొంది.

బజాజ్ ఫైనాన్స్ స్టాక్

బజాజ్ ఫైనాన్స్ స్టాక్

దేశంలో బలమైన, అగ్ర ఎన్బీఎఫ్‌సీగా బజాజ్ ఫైనాన్స్ ఉంది. రిటైల్ రుణాల్లో ఇది బలంగా ఉంది. FY2020లో ఊహించిన దాని కంటే బలమైన వృద్ధిని నమోదు చేసిందని తెలిపింది. ప్రస్తుతం బజాజ్ ఫైనాన్స్ షేర్ ధర రూ.6192గా ఉంది. టార్గెట్ ధరను రూ.7000గా పేర్కొంది. ఈక్విటీల్లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. ఇన్వెస్టర్లు తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా పెట్టుబడులు పెట్టాలి. ఈ ఆర్టికల్ సమాచార ప్రయోజనం కోసం అందించడమైనది. కానీ పెట్టుబడికి సూచనగా భావించరాదు. నిపుణుల సలహాలు అవసరం.

English summary

ఈ 3 స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడి ఉండొచ్చు, షేర్‌ఖాన్ ఏం చెబుతోందంటే | Sharekhan suggests to buy these sectoral stocks

Sharekhan says that Mastek would leverage Evosys clientele for cross-sell opportunities and its management remains confident that the UK private sector's growth rate would match the company's growth rate in coming years.
Story first published: Friday, July 23, 2021, 9:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X