For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకుల హోంలోన్ వడ్డీ రేటు తగ్గింపు: వారికి ఇలా ప్రయోజనం

|

ఇటీవల వివధ బ్యాంకులు హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించాయి. ప్రభుత్వరంగ దిగ్గజం SBI, ప్రయివేటు రంగ సంస్థలు HDFC, ICICI, కొటక్ మహీంద్రా తదితర బ్యాంకుల్లో కొన్ని పదేళ్ల కనిష్టానికి వడ్డీ రేట్లను తగ్గించాయి. మరిన్ని బ్యాంకులు అయితే గత పదిహేనేళ్లలో లేనంతగా వడ్డీ రేట్లను తగ్గించాయి. ఎస్బీ నుండి మొదలు ఐసీఐసీఐ వరకు అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి.

వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు

వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు

కోట‌క్ మ‌హీంద్రా బ్యాంకు హోమ్ లోన్ల‌పై వ‌డ్డీరేట‌ను 10 బేసిస్ పాయింట్ల మేర త‌గ్గించింది. ఈ మేర‌కు 2021 మార్చి 1వ తేదీన నిర్ణ‌యం తీసుకుంది. 6.65 శాతం నుండి హోమ్ లోన్స్ అందిస్తామ‌ని తెలిపింది. ప్ర‌స్తుతం మార్కెట్లో ఉన్న అతి త‌క్కువ వ‌డ్డీ రేటు ఇదే. ఆ తర్వాత ఎస్బీఐ రూ.75 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాలు తీసుకునే వారికి 6.70 శాతానికే హోమ్ లోన్ అందిస్తోంది. ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది.

మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేకంగా 5 బేసిస్ పాయింట్ల రాయితీని క‌ల్పించింది. HDFC బ్యాంకు 5 బేసిస్ పాయింట్లు త‌గ్గించి 6.75 శాతానికే హోమ్ లోన్ అందిస్తోంది. ఇటీవల ఐసీఐసీఐ బ్యాంకు హోమ్ లోన్‌పై వ‌డ్డీరేటును 6.7 శాతానికి తగ్గించింది ఈ ఆఫర్లు పరిమిత కాలానికి గాను ఇస్తున్నాయి. మార్చి చివరి వరకు వీటిని ఇస్తున్నాయి.

వీరికి ప్రయోజనం

వీరికి ప్రయోజనం

కొత్త‌గా హోమ్ లోన్ తీసుకునే వారికి ఈ త‌గ్గిన‌ వ‌డ్డీ రేట్లు వ‌ర్తిస్తాయి. ఇప్ప‌టికే హోమ్ లోన్ తీసుకున్న రుణ‌గ్ర‌హీత‌ల‌కు వ‌ర్తించ‌దు. కొన్ని బ్యాంకుల్లో ఎగ్జిస్టింగ్ కస్టమర్లకు వర్తిస్తుంది. ఆర్బీఐ రెపోరేటును త‌గ్గిస్తే మాత్రమే ప్ర‌స్తుత రుణగ్ర‌హీత‌లకు ప్రయోజనం ఉంటుంది. హోమ్ లోన్ రేట్ల‌ను బ్యాంకులు 2019 అక్టోబ‌ర్ 1 నుంచి ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్‌తో అనుసంధానించాల‌ని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పలు బ్యాంకులు రెపో రేట్ల‌ను బెంచ్‌మార్కుగా ఎంచుకున్నాయి. రెపోరేటు ఆధారిత హోమ్ లోన్స్‌ను రెపో రేటు ప్ర‌కార‌మే లెక్కిస్తారు.

రెండు విధాలా ప్రయోజనం

రెండు విధాలా ప్రయోజనం

హోమ్ లోన్ పైన వడ్డీ రేటు తగ్గడం వల్ల రుణగ్రహీతలకు రెండింతల ప్రయోజనం ఉంటుంది. వడ్డీ రేటు తగ్గడం వల్ల లోన్ భారం తగ్గుతుంది. అలాగే కస్టమర్లు మరింత రుణం తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. రుణ పరిమితి పెరిగి, ఎక్కువ మొత్తం తీసుకునే ప్రయోజనం ఉంటుంది. అలాగే, ఎగ్జిస్టింగ్ రుణగ్రహీతలు కూడా త్వరగా లోన్‌ను ముగించవచ్చు.

ఇలా కూడా ప్రయోజనం

ఇలా కూడా ప్రయోజనం

మీ హోమ్ లోన్‌పై అధికవ‌డ్డీ ఉంటే బ్యాలెన్స్ ట్రాన్సుఫ‌ర్‌ను ఎంచుకోవ‌డం ద్వారా కూడా ప్రయోజనం పొంద‌వ‌చ్చు. ప్ర‌స్తుతం ఉన్న వ‌డ్డీరేటుకు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవాల‌నుకునే బ్యాంకు ఇచ్చే వ‌డ్డీ రేటులో తేడా క‌నీసం 50 బేసిస్ పాయింట్లు ఉండాలి. లోన్ కాల ప‌రిమితి పదేళ్లకు మించి ఉంటే మాత్ర‌మే ట్రాన్సుఫ‌ర్ చేసుకోవడం మంచిది. ట్రాన్సుఫ‌ర్ చేసుకునే ముందు స్టాంప్ డ్యూటీ, ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీల్ని చూసుకోవాలి. కొన్ని బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ‌లు డాక్యుమెంటేషన్, లీగ‌ల్, వాల్యూయేష‌న్, ఇత‌ర టెక్నిక్ ఫీజుల‌ను వ‌సూలు చేస్తాయి.

English summary

బ్యాంకుల హోంలోన్ వడ్డీ రేటు తగ్గింపు: వారికి ఇలా ప్రయోజనం | Several banks announce home loan rate cuts: but will you benefit?

Several banks across the country such as State Bank of India (SBI), Kotak Mahindra Bank and ICICI Bank have reduced the interest on home loan rates. In addition to the all-time low-interest rates, some of these lenders have also announced discounts on processing fees or special benefits for select buyers.
Story first published: Sunday, March 7, 2021, 12:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X