For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కస్టమర్లకు SBI గుడ్‌న్యూస్: క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతే ఆఫర్!

|

గత నెల చివరి నాటికి లోన్ మారటోరియం ముగిసింది. అయితో కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ కోలుకోవడానికి ఇంకా సమయం పట్టనుంది. వ్యాపారాలు లేక, చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో లోన్ మారటోరియం పొడిగించాలనే డిమాండ్లు వస్తున్నాయి. తాజాగా, ఎస్బీఐ కార్డ్స్ తమ కస్టమర్లకు ఓ గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు బిల్లుతో సతమతమయ్యేవారికి ఎస్బీఐ కొత్త ఆప్షన్‌తో తీపి కబురు అందించనుంది.

టిక్‌టాక్‌ను ఎవరికీ విక్రయించలేదు: మైక్రోసాఫ్ట్‌తో పాటు ఒరాకిల్‌కు చైనా ఝలక్టిక్‌టాక్‌ను ఎవరికీ విక్రయించలేదు: మైక్రోసాఫ్ట్‌తో పాటు ఒరాకిల్‌కు చైనా ఝలక్

ఆర్బీఐ లోన్ రీస్ట్రక్చర్ లేదా సొంత ప్లాన్

ఆర్బీఐ లోన్ రీస్ట్రక్చర్ లేదా సొంత ప్లాన్

లోన్ మారటోరియం ముగిసిన అనంతరం, రుణాలు చెల్లించలేని వారికి ఆర్బీఐ రీస్ట్రక్చరింగ్ స్కీం లేదా సొంతగా రీపేమెంట్ ప్లాన్‌ను తీసుకువచ్చి కస్టమర్లకు మరింత సమయం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు ఎస్బీఐ కార్డ్ అధికారి చెబుతున్నారు. లోన్ మారటోరియం మొదటి మూడు నెలల కాలంలో చాలామంది కస్టమర్లు రుణాలు చెల్లించలేదని, అలాంటి వారిని ప్రామాణిక ఖాతాలుగానే పరిగణించినట్లు తెలిపారు. అయితే మారటోరియం పొడిగించినప్పుడు రెండోసారి కొంతమంది రుణాలు చెల్లించారని ఎస్బీఐ కార్డ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో అశ్విని కుమార్ తివారీ అన్నారు.

వారికి మరింత సమయంతో ఊరట

వారికి మరింత సమయంతో ఊరట

రుణ మారటోరియం అనంతరం చాలామంది రుణాలు చెల్లిస్తున్నారని, మరికొంతమంది చెల్లించలేదని, ఇలాంటి వారిని అపరాధ కస్టమర్లుగా భావిస్తారని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వారికి వెసులుబాటు కల్పిస్తామని, ఆర్బీఐ రుణ పునర్వ్యవస్థీకరణ లేదా తమ సొంత రీపేమెంట్ ఆప్షన్‌ను తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తద్వారా బకాయిలు చెల్లించేందుకు వారికి మరింత సమయం ఇస్తామని, అలాగే, వడ్డీ రేటు భారం కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పారు.

లోన్ మారటోరియం..

లోన్ మారటోరియం..

లోన్ మారటోరియం కింద చెల్లించాల్సిన మొత్తం మే నెల నాటికి రూ.7,083 కోట్లు ఉండగా, జూన్ నెలలో ఇది రూ.1500 కోట్లుగా ఉంది. కరోనా నేపథ్యంలో ఆర్బీఐ మొదట మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మారటోరియం వెసులుబాటు కల్పించింది. ఆ తర్వాత దీనిని మరో మూడు నెలలు పొడిగించి ఆగస్ట్ వరకు అవకాశం ఇచ్చింది. ఎస్బీఐ కార్డ్ నెట్ ప్రాఫిట్ ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో 14 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం రూ.2,304 కోట్ల నుండి రూ.2,196కు తగ్గింది.

English summary

కస్టమర్లకు SBI గుడ్‌న్యూస్: క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతే ఆఫర్! | SBI to enrol delinquent customers in restructuring plans

SBI Card is in the process of enrolling delinquent customers, who did not repay after the end of moratorium, in the RBI restructuring scheme or its own repayment plan to provide them more time for repayments, a top company official said.
Story first published: Tuesday, September 15, 2020, 9:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X