For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్: 22శాతం మేరా పక్కా రిటర్న్స్..రిస్క్ తక్కువే..!

|

మీరు స్టేట్ బ్యాంక్ కస్టమర్లుగా ఉన్నారా..? తక్కువ సమయంలోనే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ప్లాన్ కోసం ఎదురు చూస్తున్నారా.. అలాంటి వారికోసమే ఓ మంచి ప్లాన్‌ను తీసుకొచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి..? దీని వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

తక్కువ సమయంలో ఎక్కువ లాభం

తక్కువ సమయంలో ఎక్కువ లాభం

స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF, ఇతర పోస్టాఫీసు పథకాల కోసం చూస్తున్నవారికి సరికొత్త మార్గం చూపిస్తోంది బ్యాంకు. పైన చెప్పిన పథకాలతో రిటర్న్స్ మరీ అంత ఎక్కువగా ఉండవు. అంటే వాటిపై వచ్చే లాభం లేదా వడ్డీ ఎక్కువగా ఉండదు.

అదే సమయంలో అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభం కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సి వస్తుంది. వీటికి ప్రత్యామ్నాయంగా ఎక్కువ లాభాలు పొందేందుకు, అది కూడా తక్కువ సమయంలో పొందేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ ఫండ్- డైరెక్ట్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. గత ఐదేళ్లలో ఇందులో ఇన్వెస్ట్ చేసినవారికి 22శాతం కంటే అధికంగా లాభాలు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఐదేళ్లలో 22.23శాతంతో రిటర్న్స్

ఐదేళ్లలో 22.23శాతంతో రిటర్న్స్

ఇక ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ - డైరెక్ట్ ప్లాన్‌ పేరులోనే డైరెక్ట్ అనే పదంపై ఇన్వెస్టర్లు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాలంలో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన దానికంటే ఎస్‌బీఐ స్మాల్ క్యాఫ్ ఫండ్ - డైరెక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేసిన వారికి తక్కువ సమయంలోనే అధిక లాభాలు వచ్చినట్లు వాల్యూ రీసెర్చ్ పీర్ కంపారిజన్ రిపోర్టు చెబుతోంది. గత ఐదేళ్లలో 22.23 శాతం మేరా ప్రాఫిట్స్ వచ్చినట్లు ఆ సంస్థ నివేదించింది. ఇక ఒక ఏడాది ప్రకారం చూస్తే ఈ ఎస్‌బీఐ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లకు 36.41శాతం మేరా లాభాలు వచ్చాయి.

 ఎస్‌బీఐ డైరెక్ట్ వర్సెస్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ ప్లాన్

ఎస్‌బీఐ డైరెక్ట్ వర్సెస్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ ప్లాన్

ఇక ఎస్‌బీఐ డెరెక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి బెనిఫిట్లు ఉంటాయి..? డైరెక్ట్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేయడం చాలా ఉత్తమం అని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే ఇందులో 0.5శాతం నుంచి 1.5శాతం మేరా లాభాలు కచ్చితంగా ఉంటాయని సూచిస్తున్నారు. అదికూడా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ గడువును బట్టి మారుతుంటుందని చెబుతున్నారు. ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ కూడా ఈ కోవాలోకే వస్తుందని చెబుతున్నారు. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ ప్లాన్ అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ఎలాంటి సందేహాలు లేకుండా ఇన్వెస్ట్ చేయొచ్చనే భరోసాను నిపుణులు ఇస్తున్నారు.

ఐదేళ్లకు రూ.3.6 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే...

ఐదేళ్లకు రూ.3.6 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే...

ఒక వ్యక్తి నెలకు రూ.6వేలు ఇన్వెస్ట్ చేశారని అనుకుంటే... ఐదేళ్లకు గాను మొత్తం రూ.3.6 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉంటాడు. ఇక గడువు ముగియగానే అంటే మెచ్యూరిటీ నాటికి ఎస్‌బీఐ లెక్క ప్రకారం ఆ వ్యక్తి రూ. 6.58 లక్షలు పొందుతాడు. అంటే తాను ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ.3.6 లక్షలకు గాను 22శాతం మేరా లాభం పొందుతాడు. ఇంకెందుకు ఆలస్యం కొంచెం రిస్క్ తీసుకుంటామనుకుంటే ఎఫ్‌డీ, ఆర్‌డీ, పీపీఎఫ్, ఈపీఎఫ్, పోస్టాఫీసు పథకాలు, ప్రభుత్వ అందించే చిన్న మొత్తాల పొదుపు పథకాలకు గుడ్ బై చెప్పేసి ఎవర్ గ్రీన్ ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

English summary

SBI స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్: 22శాతం మేరా పక్కా రిటర్న్స్..రిస్క్ తక్కువే..! | SBI Small Cap fund Direct plan:Best alternative to regular Mutual funds plan, what experts say?

SBI is offering the SBI small cap mutual fund Direct plan wherin it is giving 22 percent returns for five years which is more when compared to the other regular plans like RD, FD's,PPF and EPF.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X