For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అదిరిపోయే న్యూస్, చాలా ఈజీగా 9.60 శాతంతో SBI ప్రీ-అప్రూవ్డ్ రుణాలు

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తమ ఖాతాదారులకు వివిధ రకాల రుణాలను అందిస్తోంది. ఇందులో భాగంగా వ్యక్తిగత అవసరాల కోసం అత్యవసరంగా నగదు కావాల్సిన బ్యాంకు ఖాతాదారులు ముందుగా ఆమోదించిన వ్యక్తిగత రుణాన్ని (ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్)ను ప్రత్యేక రాయితీతో వేగంగా ఎస్బీఐ యోనో యాప్ ద్వారా పొందవచ్చు. ఈ సౌకర్యం బ్యాంకు వినియోగదారులకు అన్ని రోజులు, 24 గంటలు అందుబాటులో ఉంటుంది. సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో తీసుకునే రుణాల్లో గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ ఉంటుంది. గోల్డ్ లోన్ సురక్షిత రుణం కాబట్టి వడ్డీ రేటు కాస్త తక్కువగా ఉంటుంది. పర్సనల్ లోన్ అసురక్షిత రుణం. హోమ్ లోన్, గోల్డ్ లోన్ కంటే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అయితే ఇటీవల కరోనా కారణంగా అన్ని వడ్డీ రేట్లు భారీగా తగ్గాయి. ప్రస్తుతం ఎస్బీఐ ప్రీ-అప్రూవ్డ్ రుణాల గురించి కొన్ని విషయాలు చూద్దాం...

9.60 శాతం నుండి వడ్డీ రేటు ప్రారంభం

9.60 శాతం నుండి వడ్డీ రేటు ప్రారంభం

- పర్సనల్ లోన్ పైన ఈ నెలాఖరు వరకు ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు ఉంది.

- కనిష్టంగా వడ్డీ రేటు 9.60 శాతం నుండి ప్రారంభమవుతుంది.

- జనవరి 31, 2022 వరకు ప్రాసెసింగ్ ఛార్జీలలో 100 శాతం మినహాయింపు ఉంటుంది.

- కేవలం నాలుగు క్లిక్స్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. రుణ మంజూరు తక్షణమే ఉంటుంది.

- భౌతికంగా పత్రాలు ఇవ్వవలసిన అవసరం లేదు.

- బ్రాంచీకి వెళ్లే పని లేదు.

- యోనో యాప్ ద్వారా 24X7 ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

4 స్టెప్స్‌లలో..

4 స్టెప్స్‌లలో..

- ఎస్బీఐ యోనో యాప్ ద్వారా ప్రీ-అప్రూవ్డ్ లోన్ దరఖాస్తు ఇలా..

- మొదట యోనో యాప్ ఓపెన్ చేసి, లాగ్-ఇన్ కావాలి.

- డ్రాప్ మెనూలోని Avail Now పైన క్లిక్ చేయాలి.

- రుణ మొత్తం, రుణ కాలపరిమితిని ఎంచుకోవాలి.

- బ్యాంకు ఖాతాతో రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్‌కు సందేశం వస్తుంది. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేశాక ప్రాసెస్ పూర్తవుతుంది. రుణ మొత్తం ఖాతాకు క్రెడిట్ అవుతుంది.

- నాలుగు స్టెప్పుల్లో లేదా క్లిక్కులతో పర్సనల్ రుణానికి సంబంధించిన ప్రాసెస్ పూర్తవుతుంది.

రుణ అర్హత ఎలా?

రుణ అర్హత ఎలా?

ఎస్బీఐ ఖాతాదారులు తమ రుణ అర్హతను తెలుసుకునే విధానం ఉంది. <�స్పేస్><�చివరి నాలుగు అంకెల ఎస్బీఐ సేవింగ్స్ ఖాతా నెంబర్> టైప్ చేసి 5676766 నెంబర్‌కు ఎస్సెమ్మెస్ చేయడం ద్వారా రుణ అర్హతను తెలుసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు ఎస్బీఐ వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు.

English summary

అదిరిపోయే న్యూస్, చాలా ఈజీగా 9.60 శాతంతో SBI ప్రీ-అప్రూవ్డ్ రుణాలు | SBI Pre approved Personal Loan on Yono app

Prep up for the New Year with SBI Pre-approved Personal Loan! Avail SBI Pre-approved Personal Loan on YONO app.
Story first published: Tuesday, January 4, 2022, 8:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X