For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డు.. కస్టమర్లకు ప్రయోజనాలివే

|

న్యూఢిల్లీ: నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), జపాన్‌కు చెందిన జేసీబీ ఇంటర్నేషనల్ కంపెనీలతో కలిసి ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)... SBI రూపే JCB ప్లాటినమ్ కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డును తీసుకు వచ్చింది. దీనిని మంగళవారం (డిసెంబర్ 1) ప్రకటించింది. కార్డులోని ట్యాప్ అండ్ పే టెక్నాలజీ సురక్షితమైన, వేగవంతమైన కాంటాక్ట్‌లెస్ చెల్లింపులతో వినియోగదారుల రోజువారీ కొనుగోళ్లను సులభతరం చేస్తుందని ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ విద్యా క్రిష్ణన్ అన్నారు.

PF అకౌంట్ నుండి డబ్బులు తీసుకున్నారా? ఐటి రిటర్న్స్‌లో ఇది తప్పనిసరి!PF అకౌంట్ నుండి డబ్బులు తీసుకున్నారా? ఐటి రిటర్న్స్‌లో ఇది తప్పనిసరి!

ప్రపంచవ్యాప్తంగా వినియోగించవచ్చు

ప్రపంచవ్యాప్తంగా వినియోగించవచ్చు

దేశీయంగా, అంతర్జాతీయంగా ట్రాన్సాక్షన్స్ జరిపేందుకు ఎక్కువ మంది భారతీయులు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు మొగ్గు చూపుతున్నారని, ఈ కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డు వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని JCB ఇంటర్నేషనల్ కంపెనీస్ ప్రెసిడెంట్, సీవోవో యోషికి కానెకో అన్నారు. ఎస్బీఐ, జేసీబీతో కలిసి తెచ్చిన ఈ కార్డు బహుళ ప్రయోజనాలు అందిస్తాయని, భారతీయ, అంతర్జాతీయ మార్కెట్లో ఉపయోగపడుతుందని ఎన్పీసీఐ సీవోవో ప్రవీణా రాయ్ అన్నారు. SBI రూపే JCB ప్లాటినమ్ కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డును ప్రపంచవ్యాప్తంగా లక్షల ప్రాంతాల్లో ఉపయోగించవచ్చునని చెప్పారు.

రూపే నెట్ వర్క్ ద్వారా..

రూపే నెట్ వర్క్ ద్వారా..

ఈ కార్డును జేసీబీతో కలిసి ఎస్బీఐ రూపే నెట్ వర్క్ ద్వారా ఈ కార్డును విడుదల చేసింది. జేసీబీ ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన పేమెంట్ బ్రాండ్. జపాన్‌లో క్రెడిట్ కార్డులు జారీ చేస్తుంది ఈ సంస్థ. ఎన్పీసీఐ సహకారంతో రూపే కార్డును ప్రపంచవ్యాప్తంగా బలోపేతం చేస్తున్నారు. రూపే కార్డుదారులు రోజురోజుకు పెరుగుతున్నారు.

ఈ కార్డుతో ప్రయోజనాలు...

ఈ కార్డుతో ప్రయోజనాలు...

సరికొత్త డ్యూయల్ ఇంటర్ ఫేస్ ఫీచర్‌ను కలిగి ఉండే ఈ డెబిట్ కార్డుతో కస్టమర్లు దేశీయ మార్కెట్‌లో కాంటాక్ట్, కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్‌ను, విదేశాల్లో కాంటాక్ట్ ట్రాన్సాక్షన్స్‌ను నిర్వహించుకోవచ్చు. SBI రూపే జేసీబీ ప్లాటినమ్ కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డు ద్వారా కస్టమర్లు ప్రపంచవ్యాప్తంగా జేసీబీ నెట్ వర్క్ పరిధిలోని ఏటీఎంలు, పీవోఎస్ టెర్నినల్స్‌లో ట్రాన్సాక్షన్స్ నిర్వహించవచ్చు.

అలాగే జేసీబీతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్న పలు అంతర్జాతీయ ఈ-కామర్స్ సైట్లలో కూడా ఈ కార్డును ఉపయోగించి ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయవచ్చు. ఈ కార్డులో ఉండే అడిషనల్‌ పేమెంట్ మోడ్‌ను ఎనేబుల్ చేసుకొని రూపే ఆఫ్‌లైన్ వ్యాలెట్ ఆధారిత ట్రాన్సాక్షన్స్ నిర్వహించవచ్చు. ఈ కార్డు వినియోగదారులు ఆఫ్‌లైన్ వ్యాలెట్‌ను లోడ్ చేసుకుని దేశీయంగా బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణాలకు, రిటైల్ చెల్లింపులకు ఉపయోగించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా లక్షల ప్రాంతాల్లో ఈ కార్డును వినియోగించవచ్చు.

English summary

SBI కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డు.. కస్టమర్లకు ప్రయోజనాలివే | SBI launches contactless debit card: How customers will benefit

The State Bank of India (SBI), along with the National Payments Corporation of India (NPCI) and Japan’s JCB International Co, on Tuesday announced the launch of SBI RuPay JCB Platinum Contactless Debit Card.
Story first published: Wednesday, December 2, 2020, 8:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X