For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI Gold Loan: డిస్కౌంట్ వడ్డీ రేటుతో SBI బంగారు రుణాలు

|

పర్సనల్ లోన్స్, హోమ్ లోన్, ఆటో లోన్, బంగారు రుణాలు సహా వివిధ రకాల రుణాలను ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) అందిస్తోంది. ఈ దేశీయ అతిపెద్ద బ్యాంకు ఇటీవలే బంగారు రుణ రేట్లను సవరించింది. అత్యల్ప వడ్డీ రేటు ఇప్పుడు 8.25 శాతంగా ఉంది. అంతేకాదు, 30 సెప్టెంబర్ 2021 వరకు 0.75 శాతం రాయితీని కూడా అందిస్తోంది. సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వడ్డీ రేటు 7.50 శాతం మాత్రమే. ఎస్బీఐ గోల్డ్ లోన్స్ సేవలను యోనో ఎస్బీఐ పోర్టల్ ద్వారా తక్కువ పేపర్ వర్క్‌తో, తక్కువ ప్రాసెసింగ్ సమయంతో చాలా సులభంగా, వేగంగా పొందవచ్చును.

YONO ద్వారా దరఖాస్తు

YONO ద్వారా దరఖాస్తు

ఎస్బీఐ గోల్డ్ లోన్ కోసం వివిధ పద్ధతులు ఉన్నాయి. ఇతర వివిధ పద్ధతుల వలె యోనో పోర్టల్‌లోకి లాగ్-ఇన్ కావడం ద్వారా కూడా బంగారు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. యోనో యాప్‌లోకి లాగ్-ఇన్ అయ్యాక మెనూ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మూడో ఆప్షన్‌గా లోన్ ఆప్షన్ ఉంటుంది. దానిని కూడా ఎంచుకోవాలి. అందులో చివరి ఆప్షన్ గోల్డ్ లోన్ అని ఉంటుంది. గోల్డ్ లోన్ ఆప్షన్‌ను ఎంచుకున్న తర్వాత Apply Now పైన క్లిక్ చేయాలి.

ఆ తర్వాత ఆన్ లైన్ దరఖాస్తు కొన్ని డ్రాప్ బాక్సెస్‌తో కనిపిస్తుంది. అందులో రెసిడెన్షియల్ టైప్, ఆక్యుపేషన్ టైప్, నెట్ మంత్లీ ఇన్‌కం వంటివి కనిపిస్తాయి.

ఆ తర్వాత ఫామ్‌లో ఆర్నమెంట్ టైప్, క్వాంటిటీ, బంగారం క్యారెట్లు, బంగారం ఎంత బరువు ఉంది అనే వాటిని పూర్తి చేయాలి.

పూర్తి సమాచారాన్ని పూరించిన తర్వాత కస్టమర్ బంగారు ఆభరణం, రెండు ఫోటోలు, కేవైసీ డాక్యుమెంట్‌తో కలిసి సమీపంలోని బ్యాంకు శాఖను సంప్రదించాలి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గరిష్టంగా రూ.50,00,000 లక్షలు, కనిష్టంగా రూ.20,000 రుణాన్ని అందిస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 0.50 శాతంగా ఉంటుంది. జీఎస్టీ కనీసం రూ.500 వర్తిస్తుంది. గోల్డ్ అప్రైజర్ ఛార్జీలను రుణ దరఖాస్తుదారు చెల్లించవలసి ఉంటుంది.

రుణ చెల్లింపు కాలపరిమితి 36 నెలలు ఉంటుంది. బుల్లెట్ రీపేమెంట్ గోల్డ్ లోన్ అయితే 12 నెలలు.

ఇతర బ్యాంకుల్లో గోల్డ్ లోన్ ఆప్షన్స్

ఇతర బ్యాంకుల్లో గోల్డ్ లోన్ ఆప్షన్స్

ఎస్బీఐతో పాటు మరిన్ని ఇతర సంస్థలు కూడా బంగారంపై రుణాలను అందిస్తున్నాయి. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు ఎస్బీఐ కంటే మెరుగైన వడ్డీ రేటును కలిగి ఉన్నాయి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు వడ్డీ రేటు 7 శాతంగా మాత్రమే ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు 7.30 శాతం, కెనరా బ్యాంకు 7.35 శాతంగా ఉంది. మూడేళ్ల కాలపరిమితిపై రూ.5 లక్షల రుణంపై ఇవి వర్తిస్తున్నాయి. భారత దేశంలో ప్రస్తుతం బంగారు రుణాలపై తక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంకులు ఇవే.

NBFCలలో...

NBFCలలో...

నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు కూడా బంగారంపై రుణాలు అందిస్తున్నాయి. అయితే ఇక్కడ వడ్డీ రేట్లు ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఇక్కడ వడ్డీ రేట్లు 9.12 శాతం నుండి ప్రారంభమవుతాయి.

English summary

SBI Gold Loan: డిస్కౌంట్ వడ్డీ రేటుతో SBI బంగారు రుణాలు | SBI is offering Gold Loan at A discounted interest rate

India largest public bank SBI offers various loans, including personal loans, home loans, auto loans, and gold loans.
Story first published: Thursday, August 12, 2021, 11:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X