ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ బ్యాంకు సేఫ్ డిపాజిటర్లకు షాకిచ్చింది. మార్చి 31, 2020 నుండి స్మాల్, మీడియం, లార్జ్ సేఫ్ డిపాజిట్ లాకర్ ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పెంచిన వివరాలను వెబ్ సైట్లో ఉంచింది.

రూ.500 నుండి రూ.3,000 వరకు పెరిగిన లాకర్ ఛార్జీలు
సైజ్ లాకర్, నగరాన్ని బట్టి ఛార్జీలు మారుతాయి. రూ.500 నుంచి రూ.3,000 వరకు ఛార్జీలు మారాయి. ఎస్బీఐ అన్ని బ్రాంచీలలోను 33 శాతం వరకు ఛార్జీలు పెరిగాయి. మెట్రో, అర్బన్, సెమీ అర్బన్, రూరల్ బ్యాంకులలోని స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్ల ఛార్జీలు పెరిగాయి.

స్మాల్ లాకర్స్
ఎస్బీఐ స్మాల్ లాకర్ కావాలంటే మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో కనీసం రూ.2,000, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో రూ.1,500 చెల్లించాలి. ఇదివరకటి కంటే ఈ రెండు చోట్ల రూ.500 పెరిగింది.

మీడియం లాకర్స్ ఛార్జ్ పెంపు రూ.1,000
ఎస్బీఐ మీడియం లాకర్స్ కావాలంటే మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ప్రస్తుతం రూ.3,000 ఉండగా మార్చి 31 తర్వాత నుండి రూ.4,000గా ఉంటుంది. సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో రూ.2,000 నుండి రూ.3,000కు పెరుగుతోంది. అంటే రెండు చోట్ల రూ.1,000 పెరుగుతోంది.

లార్జ్ లాకర్స్
ఎస్బీఐ లార్జ్ లాకర్స్ మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో రూ.వెయ్యి పెరిగి.. రూ.6,000 నుండి రూ.8,000కు, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో రూ.వెయ్యి పెరిగి రూ.5వేల నుండి రూ.6వేలుగా ఉంది.

ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్స్
ఎస్బీఐ ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్స్ మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో రూ.3వేలు పెరిగి రూ.9వేల నుండి రూ.12,000కు, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో రూ.2వేలు పెరిగి రూ.7వేల నుండి రూ.9వేలగా ఉంది. లార్జ్, ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్లకు జీఎస్టీ అదనంగా ఉంటుంది.

ఏమిటీ బ్యాంకు లాకర్?
బ్యాంకులు సేఫ్ డిపాజిట్ లాకర్స్‌ను అందిస్తున్నాయి. కస్టమర్లు తమ విలువైన వస్తువులు దాచి పెట్టేందుకు డిఫరెంట్ సైజ్ లాకర్స్ ఉంటాయి. ఈ లాకర్‌ను లాకర్ లేదా జాయింట్ హైరర్ మాత్రమే ఆపరేట్ చేయగలరు. దీనిని జాయింట్‌గా లేదా ఇండివిడ్యువల్‌గా ఆపరేట్ చేయవచ్చు.

జరిమానా.. లాకర్ ఆపరేట్
లాకర్ ఛార్జీలు చెల్లించకుంటే 40 శాతం జరిమానా పడుతుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం కస్టమర్లు లాకర్‌ను ఏడాదికి ఒకసారి ఆపరేట్ చేయాలి. లేదంటే దానిని బ్యాంకులు తెరిచే వీలు ఉంది. అయితే తెరవడానికి ముందు కస్టమర్లకు నోటీసులు పంపిస్తారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications