For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్బీఐ IMPS ట్రాన్సాక్షన్ పరిమితి పెంపు, ట్రాన్సాక్షన్ ఛార్జీ ఎంతంటే

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కస్టమర్లకు గుడ్‌న్యూస్. బ్యాంకు శాఖల వద్ద చేసే ఐఎంపీఎస్(ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీసెస్-IMPS) నగదు బదలీ పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి ప్రస్తుతం రూ.2 లక్షల పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపింది. ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ ప్రకారం ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్స్‌కు సరికొత్త స్లాబ్‌ను ఏర్పాటు చేసింది. రూ.2 లక్షల నుండి రూ.5 లక్షల మధ్య చేసే నగదు బదలీలు కొత్త స్లాబ్ కిందకు వస్తాయి. వీటికి రూ.20 ప్లస్ జీఎస్టీ వర్తిస్తుంది. కొత్త రూల్స్ ఫిబ్రవరి 1, 2022 నుండి అమల్లోకి వస్తాయి.

రియల్ టైమ్ ఫండ్ ట్రాన్సుఫర్

రియల్ టైమ్ ఫండ్ ట్రాన్సుఫర్

IMPS రియల్ టైమ్ ఫండ్ ట్రాన్సుఫర్‌ను చేస్తుంది. ఇది మొబైల్, ఇంటర్నెట్, ఐటీఎం, ఎస్సెమ్మెస్ వంటి బహుళ ఛానల్స్‌లో యాక్సెస్ చేయగల తక్షణ, 24X7, ఇంటర్ బ్యాంకు ఎలక్ట్రానిక్ ఫండ్ బదలీ సేవలను అందిస్తుంది. ఇది తక్షణమే నిధులను బదలీ చేయడానికి అనుమతిస్తుంది. ఇది సురక్షితంగా మాత్రమే కాకుండా ఎకనమికల్ కూడా. ప్రస్తుతం ఐఎంపీఎస్‌లో 639 మెంబర్స్ ఉన్నారు. ఇందులో బ్యాంకులు, పీపీఐలు ఉన్నాయి.

ఛార్జీలు

ఛార్జీలు

ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్స్ పైన బ్యాంకులు కస్టమర్లకు ఛార్జీలు విధిస్తాయి. అయితే కొన్ని బ్యాంకులు కస్టమర్ ఖాతా రకాన్ని బట్టి, ఉచిత ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్స్‌ను అనుమతిస్తున్నాయి.

ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్స్ లక్ష్యాలు ఏమంటే... లబ్ధిదారుల మొబైల్ నెంబర్‌తో చెల్లింపులు సులభతరం చేయడం, పూర్తిస్థాయి మొబైల్ ఆధారిత బ్యాంకింగ్ సేవలను ప్రోత్సహించేందుకు.. ఇలా ఎన్నో ఉన్నాయి.

ఐఎంపీఎస్ బదలీ చార్జీలు

ఐఎంపీఎస్ బదలీ చార్జీలు

ఐఎంపీఎస్ బదలీలు, ఛార్జీలు ఇలా ఉన్నాయి. స్లాబ్ రూ.1000 వరకు ఛార్జీలు వర్తించవు. రూ.1000 నుండి రూ.10,000 వరకు రూ.2 ప్లస్ జీఎస్టీ, రూ.10వేల నుండి రూ.1 లక్ష వరకు రూ.4 ప్లస్ జీఎస్టీ, రూ.1 లక్ష నుండి రూ.2 లక్షల వరకు రూ.12 ప్లస్ జీఎస్టీ. అయితే ఫిబ్రవరి నుండి జరిగే మార్పుల్లో ఇవి యథాతథంగా ఉంటాయి. ప్రస్తుత ఛార్జీలే వర్తిస్తాయి. కానీ రూ.2 లక్షల నుండి రూ.2 లక్షల వరకు స్లాబ్ కొత్తది. దీనిపై రూ.20 ప్లస్ జీఎస్టీ వర్తిస్తుంది.

English summary

ఎస్బీఐ IMPS ట్రాన్సాక్షన్ పరిమితి పెంపు, ట్రాన్సాక్షన్ ఛార్జీ ఎంతంటే | SBI increases IMPS transaction limit, to charge this much per transaction

The State Bank of India has increased the IMPS (Immediate Payment Service) transaction limit to ₹5 lakh as per the directions of Reserve Bank of India (RBI).
Story first published: Tuesday, January 4, 2022, 15:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X