For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంపు, ఏ కాలపరిమితిపై ఎంత వడ్డీ అంటే?

|

ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రికరింగ్ డిపాజిట్స్ వడ్డీ రేట్లను పెంచింది. ఈ బ్యాంకులో 12 నెలల నుండి 10 ఏళ్ల కాలపరిమితిపై రికరింగ్ డిపాజిట్‌ను తీసుకోవచ్చు. రికరింగ్ డిపాజిట్ అన్ని కాలపరిమితిల పైన సీనియర్ సిటిజన్స్‌కు అదనపు వడ్డీ రేటు ఉంటుంది. సురక్షిత పెట్టుబడి కోసం బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ (FD), రికరింగ్ డిపాజిట్ (RD) ప్రముఖమైనవి. వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. అయితే సురక్షిత, భద్రమైన పెట్టుబడి ఇది. రికరింగ్ డిపాజిట్స్ మెచ్యూరిటీ తర్వాత వడ్డీ రేటుతో కలిపి తీసుకోవచ్చు. ఇన్‌స్టాల్‌మెంట్ మొత్తం ఓసారి ఫిక్స్ చేస్తే, దానిని మార్చలేము.

ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్

ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్

ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు వివిధ కాలపరిమితిలపై సాధారణ పౌరులకు 5.1 శాతం నుండి 5.4 శాతం మధ్య ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్ అయితే 50 బేసిస్ పాయింట్లు అదనంగా ఉంటుంది. ఈ పెరిగిన వడ్డీ రేట్లు 15 జనవరి 2022 నుండి అమల్లోకి వచ్చాయి. ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌లో కస్టమర్లు ప్రతి నెల కనీసం రూ.100 లేదా రూ.10X ఇన్వెస్ట్ చేయాలి. గరిష్ట పరిమితి లేదు.

ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ రేట్లు ఇలా ఉన్నాయి

ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ రేట్లు ఇలా ఉన్నాయి

1 year to less than 2 years - 5.1%

2 years to less than 3 years - 5.1%

3 years to less than 5 years - 5.3%

5 years and up to 10 years - 5.4%

రికరింగ్ డిపాజిట్ ఓపెన్

రికరింగ్ డిపాజిట్ ఓపెన్

- ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌ను రెండు మార్గాల్లో ఓపెన్ చేయవచ్చు.

- బ్రాంచీలో సంప్రదించి ఓపెన్ చేయవచ్చు.

- నెట్ బ్యాంకింగ్ ద్వారా ఓపెన్ చేయవచ్చు.

- మీరు ఎస్బీఐ అకౌంట్ హోల్డర్ అయితే నెట్ బ్యాంకింగ్ ద్వారా యూజర్ నేమ్, పాస్ వర్డ్ ద్వారా లాగ్-ఇన్ అయి ఆన్ లైన్‌లో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. e-RD ఓపెన్ చేయవచ్చు.

- రికరింగ్ డిపాజిట్ మొత్తాన్ని మీరు ముందుగా కూడా తీసుకోవచ్చు. మెచ్యూరిటీ కంటే ముందే మీ నగదు మొత్తాన్ని తీసుకుంటే నామినల్ పెనాల్టీ ఉంటుంది. రికరింగ్ డిపాజిట్ పాక్షిక ఉపసంహరణకు అనుమతించడం లేదు.

English summary

SBI రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంపు, ఏ కాలపరిమితిపై ఎంత వడ్డీ అంటే? | SBI hikes recurring deposit interest rates

The SBI allows you to open a Recurring Deposit account with the bank for a minimum deposit of ₹100. The RD account can be opened for a period that ranges between 12 months and 10 years. Senior citizens are offered an additional interest in all tenures.
Story first published: Sunday, January 30, 2022, 11:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X