For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI ఎంసీఎల్ఆర్ లెండింగ్ రేటు పెంపు: హోమ్ లోన్ నుండి అన్ని రుణాలపై ప్రభావం

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) అన్ని కాలపరిమితులపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు (MCLR) 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. సవరించిన ఎంసీఎల్ రేటు ఏప్రిల్ 15వ తేదీ నుండి అమలులోకి వచ్చినట్లు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. ఇది హోమ్ లోన్ ఈఎంఐ, కారు లోన్ ఈఎంఐతో పాటు ఇతర రుణాలపై ప్రభావం చూపుతుంది.

ఒకరోజు, నెల రోజులు, మూడు నెలల వరకు ఎంసీఎల్ఆర్ 6.65 శాతం నుండి 6.75 శాతానికి పెంచింది. ఆరు నెలల కాలపరిమితిపై ఎంసీఎల్ఆర్ వడ్డీ రేటును 6.95 శాతం నుండి 7.05 శాతానికి పెంచింది. ఏడాది కాలపరిమితిపై ఎంసీఎల్ఆర్ రేటును 7 శాతం నుండి 7.10 శాతానికి, రెండేళ్ల కాలపరిమితిపై 7.20 శాతం నుండి 7.30 శాతానికి, మూడేళ్ల కాలపరిమితిపై 7.30 శాతం నుండి 7.40 శాతానికి సవరించింది.

 SBI hikes marginal cost of lending rate by 10 basis points

బ్యాంక్ ఆఫ్ బరోడా ఇదివరకే MCLR వడ్డీ రేటును ఏప్రిల్ 12వ తేదీని పెంచినట్లు ప్రకటించింది. ఏడాది కాలపరిమితిపై 7.35 శాతం, ఒక రోజు, నెల రోజులు, మూడు నెలలు, ఆరు నెలల కాలపరిమితి ఎంసీఎల్ఆర్ వరుసగా 6.50 శాతం, 6.95 శాతం, 7.10 శాతం, 7.20 శాతానికి పెంచింది.

English summary

SBI ఎంసీఎల్ఆర్ లెండింగ్ రేటు పెంపు: హోమ్ లోన్ నుండి అన్ని రుణాలపై ప్రభావం | SBI hikes marginal cost of lending rate by 10 basis points

SBI has hiked the MCLR across tenors by 10 bps. The revision in MCLR rates came into effect from April 15, thus impacting the EMIs of home, car and other loans, according to a notification on its website.
Story first published: Monday, April 18, 2022, 13:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X