For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI జనరల్ ఇన్సురెన్స్ అదిరిపోయే బీమా పాలసీ... ఆరోగ్య సుప్రీం

|

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజలు ఇప్పుడు బీమా వైపు దృష్టి సారించారు. ప్రతి ఒక్కరు ఆరోగ్య బీమా తప్పనిసరిగా అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ సంస్థలు వివిధ రకాల ఇన్సురెన్స్‌లు అందిస్తున్నాయి. దేశీయ ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) అనుబంధ జనరల్ ఇన్సురెన్స్ ఇటీవల ఆకర్షణీయ ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఆరోగ్య సుప్రీం పేరుతో సరికొత్త బీమా పాలసీని అందుబాటులోకి తెచ్చింది.

అనువైన ప్లాన్ ఎంచుకోవచ్చు

అనువైన ప్లాన్ ఎంచుకోవచ్చు

ఆరోగ్య సుప్రీం పేరుతో సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించినట్లు ఎస్బీఐ జనరల్ ఇన్సురెన్స్ వెల్లడించింది. ఈ ప్రత్యేకమైన ప్లాన్ 20 ప్రాథమిక కవరేజీ, 8 ఐచ్చిక కవరేజీ కలిగి ఉండి సంపూర్ణ హెల్త్ ఇన్సురెన్స్ కవరేజీని అందిస్తుంది. మీరు చెల్లించే ప్రీమియంను బ‌ట్టి రూ.5 కోట్ల వ‌ర‌కు కవరేజ్ ఆప్షన్ ఉంది. మూడు విధాలైన ఆప్షన్స్ ఇస్తుంది.

ప్రో, ప్ల‌స్, ప్రీమియం ఆధారిత మొత్తం క‌వ‌రేజీ ఈ బీమా ప్లాన్‌లో ఉన్నాయి. ఈ మూడింటిలో ఏ ఆప్షన్‌ను అయినా ఎంచుకోవచ్చు. రిక‌వ‌రీ బెనిఫిట్, స‌మ్ ఇన్సూర్డ్ రీఫిల్, ప‌రిహారం చెల్లింపు త‌దిత‌ర ఆఫర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఒక సంవత్సరం నుండి మూడేళ్ల వరకు పాలసీ కవరేజీ ఉంటుంది. ఖాతాదారులు తమ అవసరాలకు అనుగుణంగా అనువైన ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

అనుకూల ప్రీమియం, కాలపరిమితి

అనుకూల ప్రీమియం, కాలపరిమితి

ఎస్బీఐ జనరల్ ఇన్సురెన్స్ కంపెనీ ఎండీ అండ్ సీఈవో పీసీ కండ్పాల్ మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో (కరోనా పరిస్థితి) ఆరోగ్య బీమా అవశ్యంగా మారిందన్నారు. ఇదివరకు ఆరోగ్య బీమా ఆప్షన్ కాగా, ఇప్పుడు తప్పనిసరి అయిందని చెప్పారు. సమగ్ర ఆరోగ్య బీమా పథకంలో భాగంగా ఆరోగ్య సుప్రీంను తీసుకు వచ్చినట్లు తెలిపారు. కస్టమర్లు తమకు అనుగుణంగా ప్రీమియం, కాలపరిమితిని ఎంచుకునే వెసులుబాటును కల్పిస్తుందన్నారు.

బహుళ ప్రయోజనాలు

బహుళ ప్రయోజనాలు

కొవిడ్ 19 ఆరోగ్య బీమాను తప్పనిసరి చేసింది! ఆరోగ్య బీమా పాలసీ కస్టమర్లకు మంచి ఉపశమనమని తెలిపారు. ఆరోగ్య బీమా సమగ్ర హెల్త్ ఇన్సురెన్స్ పాలసీ అని, రిటైల్ కస్టమర్ల కోసం బహుళ ప్రయోజనాలు, కవరేజీలు కలిగి ఉందని తెలిపారు.

English summary

SBI జనరల్ ఇన్సురెన్స్ అదిరిపోయే బీమా పాలసీ... ఆరోగ్య సుప్రీం | SBI General Insurance launches Arogya Supreme

SBI General Insurance, one of India's leading general insurers, announced the launch of a comprehensive health insurance plan named Arogya Supreme today.
Story first published: Wednesday, July 14, 2021, 12:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X