For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

senior citizen FD scheme: వడ్డీ రేటు పెరిగింది, ఆ గడువును పెంచిన SBI

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) సీనియర్ సిటిజన్లకు సంబందించిన స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ చివరి తేదీని పొడిగించింది. ఇందులో భాగంగా ఎస్బీఐ వీకేర్‌లో పెట్టుబడి గడువు తేదీని 30 సెప్టెంబర్ 2022 వరకు పొడిగించింది. ఎస్బీఐ వెబ్ సైట్ ప్రకారం రిటైల్ టీడీ సెగ్మెంట్‌లో సీనియర్ సిటిజన్స్ కోసం ప్రవేశ పెట్టిన ప్రత్యేక డిపాజిట్ స్కీమ్ SBI Wecare (ఎస్బీఐ వీ కేర్) ద్వారా సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ రేటు అందుతుంది.

మరోసారి పొడిగింపు

మరోసారి పొడిగింపు

SBI కరోనా సమయంలో అంతకుముందు మే నెలలో సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీంను ప్రవేశపెట్టింది. ఇదే ఎస్బీఐ వీకేర్ సీనియర్ సిటిజన్స్ స్కీమ్(SBI Wecare Senior Citizens Scheme). ఇది భారతీయ సీనియర్ సిటిజన్లకు మంచి వడ్డీ రేటుతో మంచి పెట్టుబడి అవకాశాన్ని అందించేందుకు ఉద్దేశించిన టర్మ్ డిపాజిట్ స్కీం. ఎస్బీఐ వీకేర్ సీనియర్ సిటిజన్స్ స్కీం గడువును గతంలోను పొడిగించారు. ఇప్పుడు మరోసారి పొడిగించారు. గతంలో 2022 మార్చి వరకు పొడిగించినప్పటికీ, ఇప్పుడు మరోసారి 30 సెప్టెంబర్ 2022 వరకు వెసులుబాటు కల్పించారు.

వారికి అందుబాటులో

వారికి అందుబాటులో

'సాధారణ వడ్డీ రేటుతో పోలిస్తే ఇందులో 30 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటు ఉంటుంది. ఈ స్కీం పరిమితిని సెప్టెంబర్ 30, 2022 వరకు పొడిగిస్తున్నాం' అని బ్యాంకు తెలిపింది. టర్మ్ డిపాజిట్ పైన ఎక్కువ వడ్డీ రేటు కచ్చితంగా స్కీమ్ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రయోజనం చేకూరుతుందని, ఈ స్కీం రెన్యూవల్ చేసుకున్న వారికి, కొత్త వారికి అందుబాటులో ఉంటుందని బ్యాంకు తెలిపింది.

వడ్డీ రేటు పెరిగింది..

వడ్డీ రేటు పెరిగింది..

ఎస్బీఐ వీకేర్ సీనియర్ సిటిజన్స్ FD పథకంపై వడ్డీ రేటు 30 బేసిస్ పాయింట్లు అదనంగా లభిస్తుంది. అయిదేళ్ల కాలపరిమితి, అంతకంటే ఎక్కువ కాలపరిమితి పథకాన్ని తీసుకున్న సబ్‌స్క్రైబర్లకు అదనపు వడ్డీ రేటు అందిస్తుంది. ఎస్బీఐ సాధారణ వడ్డీ రేటు అయిదేళ్ల కాలపరిమితిపై 5.50 శాతంగా ఉంది. కానీ ఈ సీనియర్ సిటిజన్ స్పెషల్ ఎఫ్‌డీ స్కీం కింద బ్యాంకు 6.30 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇంతకుముందు సాధారణ వడ్డీ రేటు 5.40 శాతం కాగా, ఇటీవల 10 బేసిస్ పాయింట్లు పెంచడంతో 5.50 శాతంగా నమోదైంది. అలాగే, సీనియర్ సిటిజన్ ప్రత్యేక వడ్డీ రేటు గతంలో 6.20 శాతంగా కాగా, ఇప్పుడు 6.30 శాతానికి పెరిగింది. అంటే ఎస్బీఐ వీకేర్ సీనియర్ సిటిజన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం కింద, ఒక సీనియర్ సిటిజన్ సాధారణ వడ్డీ రేటు కంటే అదనంగా 0.80 శాతం వడ్డీ రేటును పొందుతారు.

English summary

senior citizen FD scheme: వడ్డీ రేటు పెరిగింది, ఆ గడువును పెంచిన SBI | SBI extends deadline for special senior citizen FD scheme

The SBI has extended the last date till when one can invest in its special fixed deposit scheme for senior citizens. The bank has extended the deadline for investing in the SBI WeCare to September 30, 2022.
Story first published: Friday, February 18, 2022, 12:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X