For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI గుడ్‌న్యూస్, హోంలోన్‌పై వడ్డీరేటు తగ్గింపు, ప్రాసెసింగ్ ఫీజు మాఫీ

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. హోంలోన్ వడ్డీ రేటు కన్సెషన్‌ను ప్రకటించింది. అయితే ఇది లిమిటెడ్ ఆఫర్. కేవలం మార్చి నెల ముగిసే వరకు మాత్రమే ఉంటుంది. ఈ మేరకు సోమవారం(మార్చి 1) నాడు ఎస్బీఐ ప్రకటన విడుదల చేసింది. ఎస్బీఐ 70 బేసిస్ పాయింట్ల(bps) మేర వడ్డీ రాయితీని అందించనున్నట్లు తెలిపింది. వడ్డీ రేట్లు 6.70 శాతం నుండి ప్రారంభం అవుతాయని వెల్లడించింది.

పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ తర్వాత నెత్తిన మరో పిడుగు: లీటర్‌కు ఏకంగా రూ.12 పెంపు!పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ తర్వాత నెత్తిన మరో పిడుగు: లీటర్‌కు ఏకంగా రూ.12 పెంపు!

ఇది పరిమిత కాల ఆఫర్ అని, మార్చి 31వ తేదీన ముగుస్తుందని తెలిపింది. అంతేకాదు, లోన్ ప్రాసెసింగ్ ఫీజు పైన 100 శాతం మాఫీని కూడా బ్యాంకు అందిస్తున్నట్లు తెలిపింది. అయితే లోన్ తీసుకునే మొత్తం, రుణ గ్రహీత సిబిల్ స్కోర్ పైన వడ్డీ రేటు రాయితీ ఆధారపడి ఉంటుందని వెల్లడించింది. మంచి రీపేమెంట్ హిస్టరీ ఉన్నవారికి ఇది ఎంతో ప్రయోజనకరమని తెలిపింది.

 SBI cuts home loan interest rate, offers full waiver on processing fee

మంచి సిబిల్ స్కోర్ ఉన్న వ్యక్తులకు ఇది అద్భుత అవకాశమని, ఇందుకు అర్హులు అని పేర్కొంది. రూ.75 లక్షల వరకు హోం లోన్ పైన వడ్డీ రేటు 6.70 శాతంగా ఉంటుంది. ఆ పైన రూ.6.75 శాతం ఉంటుందని తెలిపింది. ఎగ్జిస్టింగ్ కస్టమర్లు కూడా యోనో యాప్ ద్వారా కొత్త లిమిటెడ్ పీరియడ్ హోం లోన్ ఆఫర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చునని వెల్లడించింది. ఇలా దరఖాస్తు చేసుకునే వారికి 5 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రాయితీ లభిస్తుంది.

English summary

SBI గుడ్‌న్యూస్, హోంలోన్‌పై వడ్డీరేటు తగ్గింపు, ప్రాసెసింగ్ ఫీజు మాఫీ | SBI cuts home loan interest rate, offers full waiver on processing fee

The country’s largest public lender, State Bank of India (SBI), on Monday announced an interest concession on home loans as part of a limited offer that will continue till the end of March.
Story first published: Monday, March 1, 2021, 15:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X