For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI Credit Card Alert: ఈఎంఐపై రూ.99 ఎక్స్ ట్రా ఛార్జ్, ట్యాక్స్

|

మీరు SBI క్రెడిట్ కార్డు యూజరా? ఈ కార్డుతో ఏదైనా కొనుగోలు చేసి, EMI పెట్టుకోవాలని భావిస్తున్నారా? అయితే త్వరలో ఈ చెల్లింపులు మరింత భారం కానున్నాయి. డిసెంబర్ నుండి ఈ ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు ఈఎంఐ కొనుగోళ్లపై రూ.99 ఫీజు, అలాగే పన్ను విధించనుంది. ఇది డిసెంబర్ 1వ తేదీ నుండి అమలులోకి రానుంది. ఈ మేరకు క్రెడిట్ కార్డును ఉపయోగించే కస్టమర్లకు బ్యాంకు ఈ-మెయిల్ సందేశాన్ని పంపించింది. 'డిసెంబర్ 1, 2021 నుండి మర్చెంట్ EMI ట్రాన్సాక్షన్స్ పైన రూ.99 అలాగే పన్నులు ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేయనున్నాం.

ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా అన్ని మర్చంట్ ఔట్‌లెట్స్, ఈ-కామర్స్ వెబ్‌సైట్స్, యాప్స్ ద్వారా జరిపే EMI ట్రాన్సాక్షన్స్ పైన ఈ ఫీజు వర్తిస్తుంది' అని ఎస్బీఐ తెలిపింది. అంటే డిసెంబర్ 1వ తేదీ నుండి ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొని EMIగా మార్చుకుంటే ఈ ఫీజు వసూలు చేస్తారు. ఈ నిర్ణయంతో EMI ఆప్షన్ వినియోగించుకోవాలనుకునే కస్టమర్లకు మరింత భారం కానుంది.

బ్యాంకుల దారిలో...

బ్యాంకుల దారిలో...

SBI కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ (SBICPSL) ఇండస్ట్రీ ప్రమాణాలకు అనుగుణంగా ఫీజుల వసూలును అమలు చేస్తోందని చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే పలు బ్యాంకులు ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పైన చాలాకాలంగా ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తున్నాయని గుర్తు చేస్తున్నారు.

'ప్రియమైన కార్డు హోల్డర్ 01 డిసెంబర్ 2021 నుండి ప్రాసెసింగ్ ఫీజు రూ.99, దీనికి తోడు అప్లికెబుల్ పన్నులు వర్తిస్తాయి. ఔట్ లెట్స్/వెబ్ సైట్/యాప్స్ ద్వారా చేసే మర్చంట్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పైన ఇవి వర్తిస్తాయి. మీ నిరంతర ప్రోత్సాహానికి ధన్యవాదాలు. మర్చంట్ ఈఎంఐ ప్రాసెసింగ్ ఫీజు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.' అని SBICPSL నుండి క్రెడిట్ కార్డు కస్టమర్లకు నవంబర్ 12వ తేదీన పంపిన మెయిల్లో ఉంది.

డిసెంబర్ 1 కంటే ముందే పూర్తయితే

డిసెంబర్ 1 కంటే ముందే పూర్తయితే

ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీ, చెల్లింపులు కార్డు స్టేట్మెంట్లో విడిగా ప్రతిబింబిస్తాయని పేర్కొంది. డిసెంబర్ 1వ తేదీ కంటే ముందు పూర్తయిన ట్రాన్సాక్షన్స్ పైన ఈ ఫీజు వర్తించదని తెలిపింది. అయితే నిబంధనల మార్పుకు ముందు ముగిసిన తేదీ నుండి ఈఎంఐలు ప్రారంభం అవుతాయని వెల్లడించింది. అన్ని విజయవంతమైన ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పైన ఫీజు చార్జ్ చేస్తామని తెలిపింది. ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ రద్దయితే దానిని రివర్స్ చేస్తారు. అదనపు ఛార్జీలు ఆన్ లైన్ వ్యాపారుల చెల్లింపుల పేజీలలో, భౌతికంగా షాపిక్ చేసే సమయంలో ఛార్జ్ స్లిప్స్ ద్వారా ప్రాసెసింగ్ ఫీజుగా ప్రతిబింబిస్తాయని తెలిపింది.

ఇలా వసూలు...

ఇలా వసూలు...

ఉదాహరణకు ఒక ఈ-కామర్స్ వెబ్‌సైట్ ద్వారా మొబైల్ ఫోన్ కొనుగోలు చేసి, దానికి ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే, ఆ ట్రాన్సాక్షన్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా నిర్వహిస్తే ప్రాసెసింగ్ ఫీజు కింద అదనంగా రూ.99 ప్లస్ పన్నులు చెల్లించాలి. ఈ ఫీజు మీ క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌లో ఈఎంఐ అమౌంట్‌తో కలిపి కనిపిస్తుంది. ఈఎంఐగా మార్చుకునే ట్రాన్సాక్షన్స్ కు మాత్రమే ఈ ఫీజును ఛార్జ్ చేస్తారు. అయితే ఈఎంఐ ట్రాన్సాక్షన్ రద్దయితే తిరిగి ఈ ఫీజును చెల్లిస్తారు. ప్రాసెసింగ్ ఫీజుకు, కార్డు వడ్డీ రేటు ఛార్జీలకు సంబంధం లేదు. కొన్నిసార్లు ఈఎంఐలకు మార్చుకున్నప్పుడు విక్రయదారులు వడ్డీలపై డిస్కౌంట్ ఇస్తారు. జీరో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంటుంది. వాటికి ఇది వర్తించదు.

English summary

SBI Credit Card Alert: ఈఎంఐపై రూ.99 ఎక్స్ ట్రా ఛార్జ్, ట్యాక్స్ | SBI Credit Card Users have to pay extra RS 99 and tax for EMI

The State Bank of India has said it will charge a processing fee as well as tax on all EMI transactions done through its credit cards.
Story first published: Sunday, November 14, 2021, 9:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X