For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకోసమే... ఎస్బీఐ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులొచ్చాయ్... వాటి ఫీచర్లేంటో తెలుసా?

|

క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఎస్బీఐ కార్డు తాజాగా మరో మూడు కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను తీసుకువచ్చింది. వీటికోసం దేశంలో అతిపెద్ద రిటైల్, హాస్పిటాలిటీ దిగ్గజమైన ల్యాండ్ మార్క్ గ్రూప్ తో చేతులు కలిపింది. ఈ నేపథ్యంలోనే లైఫ్ స్టైల్ హోమ్ సెంటర్ ఎస్బీఐ కార్డు, మాక్స్ ఎస్బీఐ కార్డు, స్పార్ ఎస్బీఐ కార్డు పేర్లతో క్రెడిట్ కార్డులను తీసుకువచ్చారు. ల్యాండ్ మార్క్ గ్రూప్ బ్రాండ్స్ అయిన లైఫ్ స్టైల్, హోమ్ సెంటర్, మాక్స్, స్పార్ బ్రాండ్ల భాగస్వామ్యంతో ఈ కార్డులు వచ్చాయన్నమాట.

మొత్తం కుటుంబానికి వన్ స్టాప్ పేమెంట్ సొల్యూషన్ గా ఉండేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. ఈ కార్డుల వినియోగదారులకు ఆకర్షణీయంగా రివార్డులను అందించనున్నారు. వీటిలో ఎకార్డ్ వినియోగదారులైనా ల్యాండ్ మార్క్ బ్రాండ్స్ లో ఒకే రకమైన ప్రయోజనాలు పొందుతారు. దీనివల్ల కార్డు దారు లు ఫ్యాషన్, హోమ్ ఫర్నీషింగ్, ఫర్నీచర్, గ్రాసరీపై తమ సొమ్మును అదా చేసుకునే చేసుకునే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా వివిధ కేటగిరీల్లో ప్రయోజనాలు అందుకోవచ్చని ఎస్బీఐ కార్డు చెబుతోంది.

Rs.35,000 ధరల లోపు ఉత్మమమైన స్మార్ట్‌ఫోన్‌లు

ఎన్ని వేరియంట్లు ఉన్నాయంటే..

ఎన్ని వేరియంట్లు ఉన్నాయంటే..

- ఈ కో బ్రాండెడ్ కార్డుల్లో మూడు వేరియంట్లు ఉన్నాయి. అవి బేస్, సెలెక్ట్, ప్రైమ్. వీటి ద్వారా వినియోగదారులు మంచి ప్రయోజనాలని పొందుతారని, వారి విభిన్న రకాల అవసరాలు తీర్చుకోవడానికి దోహదపడతాయని ఎస్బీఐ కార్డు వర్గాలు చెబుతున్నాయి.

- ప్రైమ్ వేరియెంట్ కార్డుదారులు వార్షికంగా ఈ కార్డుపై 30,000 వరకు అదా చేసుకోవచ్చట.

- ల్యాండ్ మార్క్ రివార్డ్స్ ప్రోగ్రాంకు కాంప్లిమెంటరీ లాయల్టీ మెంబర్ షిప్ కల్పిస్తారు.

షాపింగ్‌పై మంచి రివార్డ్ పాయింట్లు

షాపింగ్‌పై మంచి రివార్డ్ పాయింట్లు

- షాపింగ్ పై మంచి రివార్డ్ పాయింట్లను పొందే అవకాశం కల్పిస్తున్నారు. కో బ్రాండెడ్ కార్డుల ప్రైమ్ వేరియంట్ కార్డుదారులు లైఫ్ స్టైల్, హోమ్ సెంటర్, మాక్స్, స్పార్ లో ఖర్చు చేసే రూ.100 పై 15 రివార్డ్ పాయింట్లను పొందుతారు.

- డైనింగ్, సినిమాల పై వెచ్చించే ప్రతి 100 రూపాయలపై 10 రివార్డ్ పాయింట్లను అందిస్తారు. ప్రతి 100 రిటైల్ కొనుగోళ్లపై 2 రెండు రివార్డ్ పాయింట్లను పొందవచ్చు.

- ఎస్బీఐ కార్డు రివార్డ్ పాయింట్లను ల్యాండ్ మార్క్ రివార్డ్ పాయింట్లుగా మార్చుకొని లైఫ్ స్టైల్, హోమ్ సెంటర్, మాక్స్, స్పార్, ఇతర ల్యాండ్ మార్క్ బ్రాండ్స్ లో రేడీమ్ చేసుకోవచ్చు.

మైల్ స్టోన్ వ్యయాలపై..

మైల్ స్టోన్ వ్యయాలపై..

- మైల్ స్టోన్ వ్యయాలపై ప్రైమ్ వేరియెంట్ కస్టమర్లు 14,500 వరకు పొదుపు చేయడానికి అవకాశం ఉంటుందట.

- ప్రైమ్ వేరియెంట్ పై 3,000 రూపాయల వెల్కమ్ ప్రయోజనాలు అందిస్తున్నారు. రెన్యూవల్ పై కూడా 3,000 రూపాయల విలువైన ప్రయోజనాలు అందిస్తున్నారు.

ఇవీ ఫీజులు

ఇవీ ఫీజులు

- బేస్ వేరియెంట్ జాయినింగ్, రెన్యువల్ ఫీజు రూ.499 తో పాటు జీఎస్టీ ఉంటుంది.

- సెలెక్ట్ వేరియెంట్ ధర రూ. 1,499 తో పాటు జీఎస్టీ

- ప్రైమ్ వేరియంట్ ధర రూ. 2,999 ప్లస్ జీఎస్టీ ఉంటుంది.

English summary

మీకోసమే... ఎస్బీఐ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులొచ్చాయ్... వాటి ఫీచర్లేంటో తెలుసా? | SBI card launches three co-branded credit cards

SBI card has partnered with Landmark group to launch co-branded credit cards. The three cards are lifestyle Home Centre SBI Card, Max SBI Card, Spar SBI Card. These cards are offering varies benefits to the consumers.
Story first published: Sunday, February 23, 2020, 20:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X