ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) యాన్యుటీ డిపాజిట్ స్కీంను అందిస్తోంది. ఈ పథకంలో కస్టమర్లు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు జమ చేస్తే ఆ తర్వాత ప్రతి నెల నిర్ణీత మొత్తాన్ని పొందవచ్చు. SBI అధికారిక వెబ్ సైట్ ప్రకారం ఖాతాదారుకు నెలవారీ వాయిదాలలో (EMI) చెల్లించబడుతుంది. పెట్టుబడుల విషయంలో ఎంతోమంది ఆచితూచి అడుగు వేస్తుంటారు. పెట్టుబడులు సరైన దిశలో పెట్టకుంటే చిక్కులు వస్తాయి. సురక్షిత, నెలవారీ కొంత మొత్తం రాబడి కోసం కావాలంటే ఎస్బీఐ యాన్యుటీ స్కీంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ స్కీంలో డిపాజిట్ చేస్తే కొంతకాలం తర్వాత క్రమంగా ఆదాయం వస్తుంది.

నెలవారీ ఆదాయం
- ఎస్బీఐ యాన్యూటీ స్కీం ద్వారా మీరు ఎంచుకున్న గడువు వరకు డిపాజిట్ చేసిన అనంతరం వడ్డీతో పాటు కొంత అసలు కలిపి నెలవారీగా క్రమ ఆదాయం వస్తుంది.
- నెలవారీగా నిర్ణీత మొత్తం రావాలంటే ఒకేసారి పెద్ద మొత్తం చెల్లించాలి.
- మైనర్లతో సహా రెసిడెంట్ ఇండివిడ్యువల్ కస్టమర్లు ఎవరైనా ఈ సదుపాయం పొందవచ్చు.
- ఎస్బీఐ యాన్యుటీ స్కీం కోసం కనీస గడువు 36 నెలలు లేదా మూడు సంవత్సరాలు. అంటే నెలకు రూ.1000 డిపాజిట్ చేయాలి. కనీస డిపాజిట్ మొత్తం రూ.36000. దీనికి గరిష్ట పరిమితి లేదు.
- ఎస్బీఐ ఉద్యోగులకు, పెన్షనర్లకు వడ్డీ రేటు ఒక శాతం ఎక్కువ ఉంటుంది.
- ఎస్బీఐ ఈ పథకాన్ని 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాల కాలానికి పెట్టుబడులు పెట్టవచ్చు.

పొదుపు ఖాతాలో జమ
- ఎస్బీఐ యాన్యుటీ పథకానికి వర్తించే వడ్డీ రేటు ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరిగా ఉంటుంది. మీరు అయిదేళ్ల కాలానికి ఫండ్ డిపాజిట్ చేస్తే అయిదేళ్ల కాలానికి గాను ఫిక్స్డ్ డిపాజిట్‌కు వర్తించే వడ్డీ వర్తిస్తుంది. ప్రస్తుతం ఎస్బీఐ అయిదేళ్ల కాలం నుండి 10 ఏళ్ల కాలపరిమితిపై 5.40 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. మూడు నుండి అయిదేళ్ల కాలపరిమితిపై 5.30 శాతం వడ్డీని అందిస్తోంది.
- ప్రతి నెల మీ పొదుపు ఖాతాలో మొత్తం జమ అవుతుంది.
- అరవై ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు 0.05 శాతం అధిక వడ్డీ లభిస్తుంది.
- నామినీ సదుపాయం ఉంది.
- ప్రత్యేక సందర్భాలలో డిపాజిట్ పైన 75శాతం వరకు రుణం పొందవచ్చు. అయితే రుణం తీసుకున్న తర్వాత ప్రతి నెల దీనిపై వచ్చే ఆదాయం లోన్ ఖాతాలోకి వెళ్తుంది.

బదలీ చేసుకోవచ్చు
- పాస్ బుక్ జారీ చేస్తారు. ఒక బ్యాంకు శాఖ నుండి మరో శాఖకు ఈ ఖాతాను బదలీ చేసుకోవచ్చు.
- ఒకరు లేదా ఉమ్మడిగా ఖాతాను ప్రారంభించవచ్చు.
- డిపాజిటర్ మరణిస్తే ముందస్తు ఉపసంహరణ వెసులుబాటు ఉంటుంది. అయితే ఛార్జీలు వర్తిస్తాయి. రూ.15 లక్షల వరకు డిపాజిట్లపై మాత్రం ముందస్తు ఉపసంహరణ ఉంటుంది.
- ఎస్బీఐ యాన్యుటీ స్కీం పైన లభించిన వడ్డీపై టీడీఎస్ వర్తిస్తుంది.
- ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరిగా సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ యాన్యుటీ స్కీంలో వర్తించే రేటు కంటే 50 బేసిస్ పాయింట్లు అదనంగా లభిస్తుంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications