SBI బంపరాఫర్: నెలకు ఫిక్స్‌డ్ ఆదాయం కావాలా.. ఇలా చేయండి
ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) యాన్యుటీ డిపాజిట్ పథకంలో కొంత మొత్తాన్ని జమ చేయడం ద్వారా ఆ తర్వాత ప్రతి నెల కొంత మొత్తం పొందవచ్చు. ముందుగా ఒకేసారి డిపాజిట్ చేస్తే దీనిని పొందవచ్చు. డబ్బులు చేతిలో ఉండి, నెలవారీ ఆదాయం కావాలనుకునే వారికి ఈ పథకం ప్రయోజనకరం. ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ ప్రకారం... వన్ టైమ్ డిపాజిట్‌కు బదులుగా బ్యాంకు నెలకు కొంత నిర్ణీత మొత్తం అందిస్తుంది.
వీక్ ఆఫ్: ఉద్యోగులకు గుడ్‌న్యూస్: ప్రభుత్వం ఏం కోరుకుంటోంది?

ఎస్బీఐలో ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు
యాన్యుటీ డిపాజిట్ పథకంలో ప్రతి నెల మీరు డిపాజిట్ చేసిన కొంత భాగాన్ని, అలాగే డిపాజిట్ మొత్తం పైన వచ్చే వడ్డీని కలిపి దీనిని చెల్లిస్తుంది. డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీ చెల్లింపు నెల రోజుల తర్వాత నుంచి ప్రారంభమవుతుంది. ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీంలో కనీసం రూ.25,000 ఇన్వెస్ట్ చేయవచ్చు. పోస్టాఫీస్‌లో ఇలాంటి స్కీంలోనే గరిష్టంగా రూ.4.5 లక్షలు పెట్టుబడిగా పెట్టవచ్చు. కానీ ఎస్బీఐలో గరిష్ట పరిమితి లేదు. ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు.

అదే వడ్డీ...
ఎస్బీఐలో రూ.25,000 లేదా అంతకుమించి మొత్తం డిపాజిట్ చేసి కాల పరిమితిని 3, 5, 7, 10 ఏళ్లు ఎంచుకోవచ్చు. అంటే ఈ స్కీంలో ఈ కాలానికి డిపాజిట్ చేయాలి. ఈ పథకం కింద యాన్యుటీ సబ్‌స్క్రైబర్ నెలకు కనీసం రూ.1000 పొందవచ్చు. ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీంకు ఇచ్చిన వడ్డీనే వరుసగా 3, 5, 7, 10 ఏళ్లకు ఎస్బీఐ చెల్లిస్తుంది.

ఎవరైనా ఓపెన్ చేయవచ్చు
ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీం అకౌంట్‌ను ఇండివిడ్యువల్స్ ఓపెన్ చేయవచ్చు. అలాగే మైనర్లు సింగిల్ పేరు మీద లేదా జాయింట్‌గా తెరువవచ్చు. డిపాజిటర్ మృతి చెందితే యాన్యుటీ మొత్తంలో మిగిలిన డబ్బులు వెనక్కి ఇస్తారు.