For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రాసెసింగ్ ఫీజు మాఫీ, వడ్డీరేటుపై రాయితీ: హోంలోన్ తీసుకుంటున్నారా, ఎస్బీఐ గుడ్‌న్యూస్

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) హోమ్ లోన్ వడ్డీ రేటు పైన 30 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రాయితీ, ప్రాసెసింగ్ ఫీజు పైన 100 శాతం మాఫీ వరకు ప్రకటించింది. ఈ కొత్త హోమ్ లోన్ వడ్డీ రేట్లు సిబిల్ స్కోర్‌తో అనుసంధానించబడి రూ.30 లక్షల వరకు హోమ్ లోన్ పైన 6.80 శాతం నుండి ప్రారంభమవుతాయి. రూ.30 లక్షలకు పైన హోమ్ లోన్ పైన 6.95 శాతం వడ్డీ రేటు నుండి ప్రారంభమవుతాయి. ఈ మేరకు బ్యాంకు తన ప్రకటనలో తెలిపింది.

మహిళా రుణగ్రహీతలకు మరో 5 శాతం రాయితీని ప్రకటించింది ఎస్బీఐ. ఇంటిని కొనుగోలు చేయాలని భావించే వారికి ఆకర్షణీయ రాయితీని ఇచ్చే లక్ష్యంతో వడ్డీ రేటు పైన కన్సెక్షన్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేస్తూ, వడ్డీ రేటుపై ముప్పై శాతం తగ్గిస్తున్నట్లు తెలిపింది.

హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు జంప్: కోలుకుంటున్న రియల్ ఎస్టేట్హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు జంప్: కోలుకుంటున్న రియల్ ఎస్టేట్

SBI announces up to 30 bps concession on home loans rates

రూ.5 కోట్ల వరకు లోన్ పైన ఎనిమిది మెట్రో నగరాల్లోను 30 బేసిస్ పాయింట్ల చొప్పున వడ్డీ రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. కస్టమర్లు యోనో యాప్ ద్వారా కూడా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. 5 బీపీఎస్ పాయింట్ల అదనపు వడ్డీ రాయితీ పొందవచ్చు. మార్చి 2021 వరకు గృహ రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది.

English summary

ప్రాసెసింగ్ ఫీజు మాఫీ, వడ్డీరేటుపై రాయితీ: హోంలోన్ తీసుకుంటున్నారా, ఎస్బీఐ గుడ్‌న్యూస్ | SBI announces up to 30 bps concession on home loans rates

State Bank of India on Friday announced an interest concession of up to 30 basis points on home loans and a 100 per cent waiver on processing fees.
Story first published: Friday, January 8, 2021, 16:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X