For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

5 ఏళ్ల క్రితం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు రూ.18 లక్షలు, పదేళ్ల క్రితం పెడితే రూ.54 లక్షలు

|

ప్రస్తుతం మార్కెట్ కొంత అస్థిరంగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో మార్కెట్ ఉవ్వెత్తున ఎగికి, రికార్డ్ హైకి చేరుకుంది. అదే సమయంలో భారీగా పతనమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓ వైపు ప్రపంచవ్యాప్తంగా మందగమనం కొనసాగుతుంటే మరోవైపు మార్కెట్లు దూసుకెళ్తున్నాయి కూడా. దీనిని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లు ఓ వైపు దూసుకెళ్తున్నప్పటికీ కొంత ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా స్వల్పకాలంలో మార్కెట్లు నష్టాల్లో, ఆందోళనలో ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మాత్రం మంచి రాబడిని ఇస్తాయని అంటున్నారు. ఈ దీర్ఘకాలంలో నిలదొక్కుకునే కంపెనీలు మంచి రాబడిని అందిస్తాయి.

రోజుకు రూ.13తో రూ.1 కోటి, ఇతర బెనిఫిట్స్రోజుకు రూ.13తో రూ.1 కోటి, ఇతర బెనిఫిట్స్

10 ఏళ్లలో 75 శాతం వృద్ధి

10 ఏళ్లలో 75 శాతం వృద్ధి

ఇటీవల మోతీలాల్ ఓస్వాల్ 24 యాన్యువల్ వెల్త్ క్రియేషన్ స్టడీ 2019లో ఐదు కంపెనీలు ఐదేళ్ళు, పదేళ్లలో అనూహ్యమైన రాబడిని తెచ్చి పెట్టాయి. కాంపౌంట్ యాన్యువల్ గ్రోత్ రేట్ (CAGR) ప్రకారం అయిదేళ్లలో 75 శాతం, పదేళ్లలో 49 శాతం మేర వృద్ధిని కనబరిచాయి. ఓ వైపు స్థిర ఆదాయ సాధనాలు ద్రవ్యోల్భణాన్ని అధిగమించేందుకు ఇబ్బందులు పడుతుండగా, కొన్ని స్టాక్స్ మాత్రం భారీ లాభాలు తెచ్చిపెట్టాయి.

రూ.1 లక్ష పెడితే రూ.17 లక్షలు

రూ.1 లక్ష పెడితే రూ.17 లక్షలు

ఈ నివేదిక ప్రకారం 2014 నుంచి 2019 మధ్య ఈ అయిదేళ్లలో టాప్ వెల్త్ సెక్టార్ 78 శాతం CAGRను నమోదు చేశాయి. ఉదాహరణకు ఇండియాబుల్స్‌లో మీరు అయిదేళ్ల క్రితం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రూ.17,86,899 అవుతుంది. అంటే దాదాపు రూ.18 లక్షలు. బజాజ్ ఫైనాన్స్‌లో అంతేమొత్తం పెడితే ఇప్పుడు రూ.16,88,742 అవుతుంది. ఇది 76 శాతం CAGRను నమోదు చేసింది.

వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే...

వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే...

అయిదేళ్ల క్రితం బాంబే బర్మాలో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే రూ.13,38,276 అవుతుంది. దీని CAGR 68 శాతంగా ఉంది. ఆర్తి ఇండస్ట్రీస్ CAGR 67 శాతంగా ఉండగా, ఇందులో ఇన్వెస్ట్ చేస్తే రూ.12,98,919 అయ్యేది. సుందరమ్ ఫాస్టనర్స్, బజాజ్ ఫిన్ సర్వ్‌లో ఇన్వెస్ట్ చేస్తే రూ.8,94,660 అయ్యేది. వీటి CAGR 55 శాతంగా ఉంది.

పదేళ్ల క్రితం ఇన్వెస్ట్ చేసి ఉంటే...

పదేళ్ల క్రితం ఇన్వెస్ట్ చేసి ఉంటే...

ఇక, ఇండస్ఇండ్ బ్యాంకులో పదేళ్ల క్రితం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు మీ అమౌంట్ రూ.53,93,400 అవుతుంది. అదే సమయంలో పిడిలైట్ ఇండస్ట్రీస్, టైటాన్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తే రూ.28,92,546 అయ్యేది. వరుసగా మూడో ఏడాది కూడా ఫైనాన్షియల్ సెక్టార్ బిగ్గెస్ట్ వెల్త్ క్రియేటింగ్ రంగంగా నిలిచింది.

రిలయన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే...

రిలయన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే...

రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో 5 ఏళ్ల క్రితం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే రూ.5,63,600, హెచ్‌డీఎఫ్‌సీలో ఇన్వెస్ట్ చేస్తే రూ.4,08,500, టీసీఎస్‌లో ఇన్వెస్ట్ చేస్తే రూ.3,65,500లు అయ్యేది.

2014-19 మధ్య టాప్ హెల్త్ క్రియేటర్స్

2014-19 మధ్య టాప్ హెల్త్ క్రియేటర్స్

- రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.5,636 బిలియన్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.4,085 బిలియన్లు, టీసీఎస్ రూ.3,655 బిలియన్లు, హిందూస్తాన్ యూనీలీవర్ రూ.2,391 బిలియన్లు, హెచ్‌డీఎప్‌సీ రూ.1,800 బిలియన్లు, కొటక్ మహీంద్రా రూ.1,795 బిలియన్లు, బజాజ్ ఫైనాన్స్ రూ.1,594 బిలియన్లు, ఇన్ఫోసిస్ రూ.1,497 బిలియన్లు, మారుతీ సుజుకీ రూ.1,420 బిలియన్లు, యాక్సిస్ బ్యాంకు రూ.1,209 బిలియన్ల వెల్త్ క్రియేట్ చేసింది.

English summary

5 ఏళ్ల క్రితం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు రూ.18 లక్షలు, పదేళ్ల క్రితం పెడితే రూ.54 లక్షలు | Rs 1 lakh invested in top companies of this sector becomes nearly Rs 18 lakh in 5 years

Market volatility frightens most people and turns them away from equity investments to the safety of fixed income instruments.
Story first published: Sunday, December 22, 2019, 13:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X