For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు: కరోనా కేసులు పెరిగితే మళ్లీ జంప్

|

ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఈ కొద్ది రోజుల్లో ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేస్తామని ఎవరైనా అనుకొని ఉంటే, వారిని పసిడి ధరలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గతవారం ప్రారంభంలో ఫ్యూచర్ మార్కెట్లో రూ.47,000కు కాస్త పైన ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ అంతలోనే భారీగా పెరిగి రూ.50,000 దిశగా కనిపించింది. తర్వాత వారం రోజుల్లో రూ.1600 వరకు తగ్గి మళ్లీ రూ.47,500 దిగువకు వచ్చింది. మరింత తగ్గుతుందేమో చూద్దామని భావించిన వారికి నిరాశ. గోల్డ్ ఫ్యూచర్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. నేడు(నవంబర్ 26 శుక్రవారం) రూ.300కు పైగా పెరిగింది. రూ.63,000కు దిగువన ఉన్న సిల్వర్ ఫ్యూచర్స్ మళ్లీ ఈ మార్కును దాటింది.

వరస్ట్ వీక్

వరస్ట్ వీక్

అంతర్జాతీయ మార్కెట్లో ఈ వారం బంగారం ధరలు భారీగా పడిపోయాయి. గత ఐదు నెలల కాలంలో బంగారానికి వరస్ట్ వీక్ ఇదే. ఎందుకంటే రూ.50,000 దిశగా కనిపించిన గోల్డ్ ఫ్యూచర్స్ మళ్లీ రూ.47,500 స్థాయికి పడిపోయాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో 1900 డాలర్ల దిశగా కనిపించి, 1800 డాలర్ల దిగువకు పడిపోయింది. అంటే దాదాపు వంద డాలర్ల మేర క్షీణించింది. ఐదు నెలల కాలంలో ఇంత దారుణంగా పడిపోవడం ఇదే మొదటిసారి. ద్రవ్యోల్భణాన్ని అదుపులో ఉంచేందుకు యూఎస్ ఫెడ్ రిజర్వ్ ప్యాకేజీని నిలుపు చేస్తుందని, వడ్డీరేట్లు త్వరలో పెంచవచ్చుననే వార్తల ప్రభావం పసిడిపై పడింది.

గోల్డ్ ఫ్యూచర్ ధరలు

గోల్డ్ ఫ్యూచర్ ధరలు

డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.331.00 (0.70%) పెరిగి రూ.47752.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.301.00 (0.63%) పెరిగి రూ.48075.00 ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్ ధర నేడు భారీగా పెరిగినప్పటికీ 1800 డాలర్లకు దిగువనే ఉంది. క్రితం సెషన్లో 1784 డాలర్ల వద్ద ముగిసింది. నేడు ఈ వార్త రాసే సమయానికి 14 డాలర్లు లాభపడి 1798 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

సిల్వర్ ఫ్యూచర్స్ అతి స్వల్పంగా 0.091 డాలర్లు పెరిగి 23.587 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు స్థిరంగా ఉండి రూ.63,142 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.63,892 వద్ద ఉంది.

మద్దతు ధర.. నిరోధకస్థాయి

మద్దతు ధర.. నిరోధకస్థాయి

ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర రూ.47,250, నిరోధకస్థాయి రూ.47,900 నుండి రూ.48,000. వెండి రూ.64,000కు చేరుకునే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు.

కామెక్స్‌లో గోల్డ్ మద్దతు ధర 1770 డాలర్ల నుండి 1755 డాలర్లు. నిరోధకస్థాయి 1800 డాలర్ల నుండి 1815 డాలర్లు. 1800 డాలర్ల వద్ద బలమైన పరీక్షను ఎదుర్కోవచ్చునని అంచనా.

కరోనా కేసులు పెరిగితే బంగారం ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

English summary

మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు: కరోనా కేసులు పెరిగితే మళ్లీ జంప్ | Renewed COVID fears likely to drive Gold up

Gold was set on November 26 for its worst week in five months, as prices were hammered by increasing bets that the US Federal Reserve would accelerate stimulus tapering, and raise interest rates sooner to curb inflation.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X