పదేళ్లలో భారీ రిటర్న్స్ ఇచ్చిన రిలయన్స్, 2020లోనే మూడొంతులు: ఇవి కూడా...
2020 క్యాలెండర్ ఏడాదిలో రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తీసుకు వచ్చాయి. కేవలం 2020లోనే కాదు ఈ దశాబ్దంలోనే ఈ రెండు దిగ్గజాలు మంచి రిటర్న్స్ అందించాయి. ఎకనమిక్స్ టైమ్స్ సర్వే ప్రకారం గత పదేళ్లలో రిలయన్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వారి సంపద 9.2 లక్షల కోట్లు పెరిగింది. ప్రతి సంవత్సరం సగటున 13.8 శాతం పెరిగింది.
జియో న్యూ ఇయర్ బంపర్ ఆఫర్: రేపటి నుంచి టారిఫ్‌లో ఇదీ పెను మార్పు: ఏ నెట్వర్క్ అయినా

రిలయన్స్ మూడో వంతు 2020లోనే...
గత పదేళ్లలో రిలయన్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వారి సంపద 13.8 శాతం పెరగగా, ఇందులో మూడో వంతు లాభాలు 2020లోనే వచ్చాయి. 2020లో రిలయన్స్ షేర్ల వ్యాల్యూ 33 శాతం పెరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద 3.2 లక్షల కోట్లు పెరిగింది. పదేళ్లలో రూ.9.2 లక్షల కోట్లు పెరిగాయి. రిలయన్స్ స్టాక్ కొద్ది నెలల క్రితం రూ.2370ను క్రాస్ చేసింది. అయితే ఏడాది చివరలో రూ.2000 స్థాయికి పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.2 లక్షల కోట్లకు పైగా తగ్గింది. లేదంటే మరింత రిటర్న్స్ వచ్చి ఉండేవి.

టీసీఎస్ సహా ఈ సంస్థలు కూడా
ఈ దశాబ్దంలో రిలయన్స్ తర్వాత TCS, HDFC బ్యాంకులు భారీ రిటర్న్స్ ఇచ్చాయి. TCS షేర్ల విలువ గత పదేళ్లలో సగటున ఏటా 17%, HDFC షేర్లు విలువ ఏటా 21.9% చొప్పున పెరిగాయి. టీసీఎస్ ఇన్వెస్టర్ల సంపద ఈ కాలంలో రూ. 8.6 లక్షల కోట్లు పెరగగా, HDFC ఇన్వెస్టర్ల సంపద రూ.6.8 లక్షల కోట్లు పెరిగింది. వీటితో పాటు HUL, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పేయింట్స్, ICICI బ్యాంకు కూడా ఈ పదేళ్ళలో భారీగా లాభపడ్డాయి.

ష్రిమ్ ఫీడ్ కంపెనీ జూమ్
ఇక, ష్రిమ్ ఫీడ్ కంపెనీ అవంతీ ఫీడ్స్ ఈ పదేళ్ల కాలంలో భారీగా లాభపడింది. ఈ సంస్థ షేర్లు 214.3 శాతం ఎగిశాయి. కాప్లిన్ పాయింట్ ల్యాబ్, వైభవ్ గ్లోబల్, అల్కైల్ అమిన్స్ కెమ్, బజాజ్ ఫైనాన్స్ కూడా భారీగా లాభపడ్డాయి.