For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సిబిల్ స్కోర్ తక్కువగా ఎందుకు ఉంటుంది, క్రెడిట్ స్కోల్ ఎలా పెంచుకోవాలి?

|

సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే రుణాలు రావడం ఇబ్బందిగా మారుతాయి. ఒకవేళ వచ్చినా వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయి. ఏదైనా బ్యాంకు రుణాలు ఇవ్వడానికి ముందు చూసేది సిబిల్ స్కోర్. అందుకే కస్టమర్లు కూడా రుణాలు తీసుకోవడానికి ముందు తమ సిబిల్ స్కోర్ ఎంతుందో చెక్ చేసుకుంటారు. రుణ ఈఎంఐ సరిగ్గా చెల్లించలేకపోయినా, క్రెడిట్ కార్డు బిల్లులు సరిగ్గా కట్టలేకపోయినా సిబిల్ స్కోర్ పడిపోతుంది. అయితే ఆ తర్వాత ఇవన్నీ క్లియర్ చేసినప్పటికీ సిబిల్ స్కోర్ పెరగడం అంత సులభం కాదు.

సిబిల్ స్కోర్ అంటే?

సిబిల్ స్కోర్ అంటే?

సిబిల్ స్కోర్ మూడు అంకెల సంఖ్య. అయితే ఇది కస్టమర్ క్రెడిట్ హిస్టరీ చెల్లింపు రికార్డును వెల్లడిస్తుంది. బ్యాంకులు, క్రెడిట్ సంస్థలు రుణాలు ఇవ్వడానికి ముందు దీనిని పరిగణలోకి తీసుకుంటాయి. క్రెడిట్ స్కోర్ 300 నుండి 900 మధ్య ఉంటుంది. 750కి పైగా ఉంటే దానిని మంచి క్రెడిట్ స్కోర్‌గా పేర్కొంటారు. అంతకు తక్కువ ఉంటే తక్కువ సిబిల్ స్కోర్‌గా భావిస్తాయి బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషనస్.

తక్కువ సిబిల్ స్కోర్

తక్కువ సిబిల్ స్కోర్

తక్కువ సిబిల్ స్కోర్ లేదా లో సిబిల్ స్కోర్‌కు కారణాల్లో ఒకటి పేమెంట్ హిస్టరీ. పేమెంట్స్ ఆలస్యంగా ఉంటే సిబిల్ స్కోర్ పడిపోతుంది. క్రెడిట్ కార్డు బిల్స్ సకాలంలో చెల్లించకపోయినా ఈ ప్రభావం ఉంటుంది. రెగ్యులర్ డిఫాల్టర్ అయితే మాత్రం ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే క్రమరహిత పేమెంట్స్ ఉన్నా కూడా చెడు ప్రభావం పడుతుంది.

హై క్రెడిట్ యుటిలైజేషన్ రేట్

హై క్రెడిట్ యుటిలైజేషన్ రేట్

క్రెడిట్ కార్డు బకాయిలు చెల్లింపుల ప్రభావం సిబిల్ స్కోర్ పైన ఉంటుంది. బ్యాడ్ క్రెడిట్ హిస్టరీ కచ్చితంగా సిబిల్ స్కోర్ పైన ప్రభావం చూపుతుంది. అంతేకాదు, క్రెడిట్ ట్రాక్ రికార్డ్ లేకుంటే ఆ ప్రభావం కూడా సిబిల్ స్కోర్ పైన ఉంటుంది. అన్‌సెక్యూర్డ్ లోన్లు సిబిల్ స్కోర్‌కు సరికాదు.

క్రెడిట్ స్కోర్

క్రెడిట్ స్కోర్

క్రెడిట్ స్కోర్ సరిగా ఉండదని భావించేవారు మెరుగుపరుచుకునేందుకు ప్రయోగాలు చేస్తారు. అప్పుడు వ్యక్తిగత రుణం తీసుకుని చెల్లించేయడం వల్ల క్రెడిట్ స్కోర్ పెంచుకోవచ్చని సలహా ఇస్తే అది అపోహ మాత్రమే. మీ సంపాదన, ఆర్థిక సామర్థ్యం వంటి పలు అంశాల ఆధారంగా బ్యాంకులు రుణం ఇవ్వడం గురించి ఆలోచిస్తాయి. క్రెడిట్ స్కోర్ కేవలం ఒక అంశం మాత్రమే. అందుకే అనవసరంగా రుణం తీసుకోవడం మంచిది కాదు.

ఇక, క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందని బాధపడవద్దు. ఎప్పటి నుండో చెల్లించకుండా ఉన్న క్రెడిట్ కార్డు బిల్లుల్ని, ఈఎమ్ఐలను వీలైనంత త్వరగా చెల్లించాలి. చెల్లింపు గడువులోపే భవిష్యత్తు ఈఎంఐలను క్రమం తప్పకుండా చెల్లించాలి. ఒక్కోసారి గడువులోపు రుణం చెల్లించకుంటే మీ క్రెడిట్ స్కోర్ పైన ప్రభావం చూపుతుంది. అలాంటప్పుడు కొత్త రుణాలను తీసుకోకపోవడం మంచిది. ఉన్న రుణాలు తీర్చాలి.

English summary

సిబిల్ స్కోర్ తక్కువగా ఎందుకు ఉంటుంది, క్రెడిట్ స్కోల్ ఎలా పెంచుకోవాలి? | Reasons why you have A low CIBIL score, How to increase it?

Most of us think that is indeed a big task to get a loan sanctioned from banks. Well yes, it is a lengthy process. But do you know what affects this process?
Story first published: Wednesday, May 12, 2021, 16:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X