For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిటైల్ ఇన్వెస్టర్లకు RBI సరికొత్త స్కీం.. RBI Retail Direct Scheme

|

రిటైల్ పెట్టుబడిదారులు నేరుగా ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఆర్పీఐ రిటైల్ డైరెక్ట్ స్కీం(RBI-RD) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం వ్యక్తిగత పెట్టుబడిదారులు ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడానికి ఆర్బీఐలో ఖాతా తెరవడానికి అనుమతిస్తుంది.

ప్రభుత్వ సెక్యూరిటీలలో రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఆర్బీఐ కొన్ని నెలల క్రితం రిటైల్ డైరెక్ట్ స్కీంను ప్రకటించింది. ఈ పథకాన్ని ఉపయోగించి రిటైల్ పెట్టుబడిదారులు ఆర్బీఐ డైరెక్ట్ గిల్డ్ అకౌంట్ తెరిచి నేరుగా ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇందుకు ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

RBI-RD ఆఫర్ ఏమిటి?

RBI-RD ఆఫర్ ఏమిటి?

RBI-RD అనేది ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడానికి రిటైల్ పెట్టుబడిదారులను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన వేదిక. అటువంటి ప్లాట్‌ఫాంను ఫిబ్రవరి 2021లో ప్రారంభించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఈ సదుపాయాన్ని ఉపయోగించి భారత ప్రభుత్వ ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటెడ్ సెక్యూరిటీలు, సావరీన్ గోల్డ్ బాండ్స్(SGB), స్టేట్ డెవలప్‌మెంట్ లోన్స్(SDL)ను ట్రేడ్ చేయవచ్చు.

ఈ సదుపాయంలో కొత్త ఏమిటి?

ఈ సదుపాయంలో కొత్త ఏమిటి?

గిల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ప్రస్తుతం ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడానికి రిటైల్ పెట్టుబడిదారులకు ఉత్తమ మార్గం. అలాగే ప్రతి శుక్రవారం జరిగే ఆర్బీఐ ప్రాథమిక మార్కెట్ వేలంలో బిడ్స్‌ను ఉంచే జీ-సెక్ డీలర్స్ ద్వారా కొనుగోలుకు మరో ప్రత్యామ్నాయం.సెకండరీ మార్కెట్లో ఎగ్జిస్టింగ్ జీసెక్‌ల లిస్టెడ్ కొనుగోలు కోసం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ద్వారా చేయవచ్చు. అయితే ఈ మార్కెట్లు లిక్విడ్. మీ బ్రోకర్ కూడా నెగోషియేటెడ్ డీలింగ్ సిస్టం ప్లాట్‌ఫాంలో జీ-సెక్‌లను కొనుగోలు చేయవచ్చు. వాటిని మీ డీమ్యాట్ ఖాతాకు బదలీ చేయవచ్చు.

మోడీ ప్రారంభం

మోడీ ప్రారంభం

2021 నవంబర్ 12వ తేదీన ఆర్బీఐకి చెందిన వినియోగదారుల కేంద్రంగా రెండు కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇందులో ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీం, రిజర్వ్ బ్యాంకు ఇంటిగ్రేడెట్ అంబుడ్స్‌మెన్ స్కీం ఉన్నాయి. ఈ స్కీంలను వర్చువల్ ఈవెంట్ ద్వారా లాంచ్ చేశారు. 21వ శతాబ్దంలో ఈ దశాబ్దం దేశాభివృద్ధికి చాలా ముఖ్యమైనదని, ఇలాంటి పరిస్థితుల్లో ఆర్బీఐ పాత్ర చాలా కీలకం అన్నారు.

English summary

రిటైల్ ఇన్వెస్టర్లకు RBI సరికొత్త స్కీం.. RBI Retail Direct Scheme | RBI Retail Direct Scheme: RBI's retail investors new and direct platform

Retail investors can finally invest in government securities directly. The ‘RBI Retail Direct Scheme’ facility gets launched today.
Story first published: Friday, November 12, 2021, 16:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X