For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RBI FD Rules: ఆర్బీఐ షాక్, బ్యాంకు నుండి డబ్బులు తీసుకోకుంటే నష్టపోతారు

|

కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఇటీవల బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్‌కు సంబంధించి నిబంధనలను మార్చింది. మెచ్యూరిటీ తర్వాత కూడా కస్టమర్లు క్లెయిమ్ చేసుకోని నగదు నిల్వలు బ్యాంకుల్లో పేరుకుపోతున్నాయి. ఒక టర్మ్ డిపాజిట్ మెచ్యూరిటీ అయిన తర్వాత కూడా ఆ మొత్తాన్ని బ్యాంకులు కస్టమర్లకు చెల్లించకపోతే దానిపై దానిపై కస్టమర్లకు వడ్డీ చెల్లించవలసి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది.

కొత్త ఎఫ్‌డీ రూల్

కొత్త ఎఫ్‌డీ రూల్

టర్మ్ డిపాజిట్/ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత క్లెయిమ్ చేయని మొత్తానికి వడ్డీకి సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. కొత్త నిబంధన ప్రకారం... ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీ తర్వాత చెల్లింపులు జరపకపోతే లేదా క్లెయిమ్ చేయకపోతే క్లెయిమ్ చేయని మొత్తం సేవింగ్స్ ఖాతాకు వర్తించే వడ్డీ రేటును లేదా మెచ్యూరిటీ FDపై కాంట్రాక్ట్ వడ్డీ రేటును ఆకర్షిస్తుంది. ఇందులో ఏది తక్కువగా ఉంటే అది వర్తిస్తుంది. అంటే బ్యాంకు వద్ద ఉన్న మొత్తంపై సేవింగ్స్ అకౌంట్‌కు వర్తించే వడ్డీ రేటు లేదా టర్మ్ డిపాజిట్లపై తగ్గించి ఇచ్చే వడ్డీ రేటులో ఏది తక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని చెల్లించాలి.

కస్టమర్లకు నష్టం

కస్టమర్లకు నష్టం

మెచ్యూరిటీ FDs నిబంధనలను కూడా ఆర్బీఐ సర్క్యులర్‌లో పేర్కొంది. గతంలో మెచ్యూరిటీ తర్వాత కస్టమర్లు క్లెయిమ్ చేసుకోని FDలను బ్యాంకులు రెన్యువల్ చేసేవి కావు. ఇప్పుడు క్లెయిమ్ చేయకుండా బ్యాంకుల వద్ద ఉన్న మొత్తంపై వడ్డీ రేటు నిబంధనను మార్చినందున కస్టమర్లు నష్టపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే FDలపై ఎక్కువ వడ్డీ, సేవింగ్స్ డిపాజిట్ల పైన తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయి. అందుకే కస్టమర్లు నష్టపోవాల్సి ఉంటుంది.

అన్ని బ్యాంకులకు వర్తింపు

అన్ని బ్యాంకులకు వర్తింపు

అన్ని రకాల బ్యాంకులకు కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఈ మేరకు ఆర్బీఐ ప్రకటించింది. వాణిజ్య బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులు వంటి అన్ని రకాల బ్యాంకులు ఈ కొత్త నిబంధనలు పాటించాలని ఆర్బీఐ పేర్కొంది. కమర్షియల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులు వంటి అన్ని రకాల బ్యాంకులు ఈ నిబంధనలు పాటించాలి. FD పైన బ్యాంకులు నిర్ణీత కాలపరిమితికి, నిర్ణీత వడ్డీ రేటుతో అందిస్తాయి. రికరింగ్ డిపాజిట్లు, క్యుములేటివ్ డిపాజిట్, రీ-ఇన్వెస్టెడ్ డిపాజిట్లు, క్యాష్ సర్టిఫికెట్లు దీని కిందకు వస్తాయి.

English summary

RBI FD Rules: ఆర్బీఐ షాక్, బ్యాంకు నుండి డబ్బులు తీసుకోకుంటే నష్టపోతారు | RBI news FD Rules: Changes norms for interest on overdue term deposits

RBI's new FD rules are applicable to all commercial, small finance banks, local area banks, and co operative banks.
Story first published: Tuesday, July 6, 2021, 11:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X