For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్మార్ట్ ఫోన్ లేకున్నా, ఇంటర్నెట్ లేకున్నా డిజిటల్ చెల్లింపులు: ఇలా చేయండి

|

మీకు స్మార్ట్ ఫోన్ లేదా? ఇంటర్నెట్ కనెక్షన్ లేదా? అయితే ఈ రెండు లేకపోయినప్పటికీ ట్రాన్సాక్షన్స్ నిర్వహించవచ్చు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యూపీఐ ఆధారిత UPI123పేను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇప్పటి వరకు కేవలం స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు, అదీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న యూపీఐ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ అందుబాటులో ఉంది.

మంగళవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ యూపీఐ123పేను లాంచ్ చేశారు. దీంతో దేశంలోని దాదాపు 40 కోట్లమంది ఫీచర్ ఫోన్ కస్టమర్లు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు సురక్షితంగా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. గ్రామీణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సేవలు అందుబాటులోకి తెచ్చారు.

ఇంటర్నెట్ లేకపోయినా

ఇంటర్నెట్ లేకపోయినా

UPI123Pay డిజిటల్ చెల్లింపుల సహాయార్థం నిత్యం (24X7) అందుబాటులో ఉండేలా హెల్ప్ లైన్ సేవలను డిజిసాథి పేరుతో తీసుకు వచ్చారు.

కేవలం స్కాన్ అండ్ పే మినహాయించి, UPI123Pay ఫీచర్ ఫోన్ కస్టమర్లకు అన్ని రకాల ట్రాన్సాక్షన్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఫీచర్ ఫోన్ యూజర్లు ఇందుకు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అవసరం లేదు. కస్టమర్లు తమ బ్యాంకు అకౌంట్‌తో ఫీచర్ ఫోన్‌ను లింక్ చేసుకుంటే చాలు.

గ్రామీణ ప్రాంతంలోని వారు ఫీచర్ ఫోన్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రస్తుత దశాబ్దం దేశంలో డిజిటల్ చెల్లింపుల పరివర్తణ వ్యవస్థకు సాక్ష్యమని శక్తికాంత దాస్ అన్నారు. నగదు ట్రాన్సాక్షన్స్ తగ్గించేందుకు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంచేందుకు గత మూడేళ్లలో ఆర్బీఐ అనేక చర్యలు చేపట్టిందన్నారు.

రిజిస్టర్ ఇలా

రిజిస్టర్ ఇలా

బ్యాంకులో నమోదైన రిజిస్టర్డ్ మొబైల్ నుండి *99# డయల్ చేసి బ్యాంకు ఖాతాను ఎంచుకోవాలి.

మీ డెబిట్ కార్డులోని చివరి ఆరు అంకెలను ఎంటర్ చేయాలి.

ఎక్స్‌పైరీ డేట్, యూపీఐ పిన్ ఎంటర్ చేసి ధృవీకరించాలి. ఆ తర్వాత మీ సేవలను ఉపయోగించుకోవచ్చు.

మీ రిజిస్టర్డ్ మొబైల్ నుండి డయల్ చేసినప్పుడు కచ్చితంగా మీ బ్యాంకు ఖాతా నెంబర్ సహా ఇతర వివరాలు కనిపించాలి. లేదంటే ముందుకు వెళ్లవద్దు.

నగదు బదలీ ఇలా

నగదు బదలీ ఇలా

తొలుత రిజిస్టర్డ్ మొబైల్ నుండి *99#కి డయల్ చేయాలి.

స్క్రీన్ పైన కనిపించే ఆప్షన్‌లో డబ్బు పంపించడం కోసం సెండ్ మనీ ఆప్షన్ ఉంటుంది. దానిని ఎంచుకోవాలి. ఇందుకు 1 పైన క్లిక్ చేయాలి. మనీ రిక్వెస్ట్ కోసం అయితే 2, బ్యాలెన్స్ చెకింగ్ అయితే 3, ప్రొఫైల్ కోసం 4, పెండింగ్ రిక్వెస్ట్‌ల కోసం 5, ట్రాన్సాక్షన్స్ వివరాల కోసం 6, యూపీఐ పిన్ కోసం 7 సెండ్ చేయాలి.

నగదు పంపించడం కోసం ఆప్షన్ ఎంచుకున్నాక మొబైల్ నెంబర్ అయితే 1, యూపీఐ ఐడీ అయితే 3, సేవ్ చేసిన లబ్దిదారుని కోసం అయితే 4, IFSC కోడ్, అకౌంట్ అయితే 5 క్లిక్ చేయాలి.

మీరు దేని ద్వారా పంపించాలనుకుంటే ఆ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత పంపించాలనుకునే వారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

వారి వివరాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి. అవి ధృవీకరించాక ముందుకు సాగాలి.

వివరాలు సరైనవి అయితే మీరు పంపించాలనుకునే మొత్తాన్ని ఎంటర్ చేయాలి.

అప్పుడు మీ ట్రాన్సాక్షన్ వివరాలు కనిపిస్తాయి. వాటిని ధృవీకరించి, యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. డబ్బు బదలీ తర్వాత మొబైల్ నెంబర్‌కు సందేశం వస్తుంది. ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోవాలి.

English summary

స్మార్ట్ ఫోన్ లేకున్నా, ఇంటర్నెట్ లేకున్నా డిజిటల్ చెల్లింపులు: ఇలా చేయండి | RBI Launches UPI-Based Payment For Feature Phone Users

In order to equip feature phone users in the country with the digital payment ecosystem, Reserve Bank of India Governor Shaktikanta Das launched UPI123Pay on Tuesday.
Story first published: Wednesday, March 9, 2022, 11:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X