గత కొన్నాళ్లుగా క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలు పెరుగుతున్నాయి. అదే సమయంలో వీటి ద్వారా జరిగే మోసాలు కూడా పెరుగుతున్నాయి. అందుకే బ్యాంకులు, ఆర్బీఐ ఎప్పటికి అప్పుడు కస్టమర్లకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పైన హెచ్చరికలు జారీ చేస్తుంటాయి. తాజాగా క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు, కార్డు ట్రాన్సాక్షన్స్ భద్రతను పెంచేందుకు ఆర్బీఐ బుధవారం కొత్త నిబంధనలు జారీ చేసింది. ఆర్బీఐ కొత్త నియమాలు....

వీటికి మాత్రమే అనుమతించాలి
కార్డు జారీ చేసినప్పుడు లేదా కార్డును పునరుద్ధరించినప్పుడు దేశంలోని ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్స్ (PoS) కేంద్రాల వద్ద మాత్రమే దేశీయ కార్డు ట్రాన్సాక్షన్స్‌ను అనుమతించాలని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది.

వీటికి విడిగా కస్టమర్ ఏర్పాటు చేసుకోవాలి
అంతర్జాతీయ ట్రాన్సాక్షన్స్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్, కార్డులేని ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్‌లెక్ ట్రాన్సాక్షన్స్ కోసం కస్టమర్ తమ కార్డుపై విడిగా ప్రత్యేకమైన సేవలను ఏర్పాటు చేసుకోవాలి.

అమలులోకి ఎప్పుడంటే?
ఈ కొత్త రూల్స్ మార్చి 16, 2020 నుంచి అమలులోకి వస్తాయి. పాత కార్డు హోల్డర్స్ ఈ సేవలు వద్దని భావిస్తే నిలిపివేసుకోవచ్చు.

సంస్థల నిర్ణయం
ఇప్పటికే ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డుల విషయంలో, కార్డులను జారీ చేసిన సంస్థలు వారు తీసుకునే రిస్క్ ఆధారంగా అంతర్జాతీయ ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్, కార్డు నాట్ ప్రజెంట్ ట్రాన్సాక్షన్స్ అనుమతించాలా లేక రద్దు చేయాలా అనే నిర్ణయం తీసుకుంటాయి.

24x7 సేవలు
కార్డు హోల్డర్స్‌కు 24x7 కార్డు ఆన్, ఆఫ్ సేవలు అందుబాటులో ఉంటాయి. దీంతో పాటు ట్రాన్సాక్షన్స్ పరిమితిని కూడా ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఈ సేవల్ని మొబైల్ అప్లికేషన్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఇంటరాక్టివ్ వాయిస్ సర్వీసులు వంటి అందుబాటులో ఉన్న అన్ని ఛానల్స్ ద్వారా పొందవచ్చు.

ఆన్ ఆఫ్ ఫెసిలిటీ
డొమెస్టిక్, ఇంటర్నేషనల్, PoS, ఏటీఎం, ఆన్‌లైన్, కాంటాక్ట్‌లెస్ ఇలా ఏ ట్రాన్సాక్షన్స్ అయినా సరే ఈ ఆన్ ఆఫ్ లిమిట్ సెట్ చేసుకునే ఫెసిలిటీని బ్యాంకులు అందుబాటులో ఉంచాలి.

ఈ నిబంధనలు తప్పనిసరికాదు
ప్రీపెయిడ్ గిఫ్ట్ కార్డులు, మాస్ ట్రాన్సిట్ సిస్టం యూజర్లకు ఈ నిబంధనలు తప్పనిసరి కాదు. సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ సూచనలు జారీ చేయడం గమనార్హం.
More From GoodReturns

దుబాయ్‌లో క్రెడిట్ కార్డుతో ఇల్లు బుక్ చేసుకుంటున్నారా.. అయితే ఈ ఆర్బీఐ హెచ్చరిక గురించి తప్పక తెలుసుకోండి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications