చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ఇస్తున్న వడ్డీలో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. ఈపీఎఫ్ వడ్డీ రేటును ప్రభుత్వం 8.5 శాతం నుండి 8.1 శాతానికి తగ్గించింది. ఇది 43 ఏళ్ల కనిష్టం. ఈపీఎఫ్ వడ్డీ రేటు తగ్గిన నేపథ్యంలో ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులేదు.
ప్రస్తుతం కొనసాగుతున్న వడ్డీనే 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి అంటే ఏప్రిల్-జూన్ కాలానికి వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), కిసాన్ వికాస్ పత్ర(KVP), సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రతి మూడు నెలలకు ఓసారి కేంద్రం వడ్డీని నిర్ణయిస్తుంది.

గత ఎనిమిది త్రైమాసికాలుగా కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటును సవరించలేదు. కరోనా కారణంగా సవరణకు దూరంగా ఉంది. అయితే ఈసారి ఈపీఎఫ్ వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయని భావించినప్పటికీ, తొమ్మిదోసారి కూడా కేంద్రం స్థిరంగా కొనసాగించింది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పైన 6.8 శాతం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పైన 7.1 శాతం, కిసాన్ వికాస్ పత్ర పైన 6.9 శాతం, సుకన్య సమృద్ధి యోజన పైన 7.6 శాతం వడ్డీ రేటు అందిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications