For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Post office saving schemes: MIS, SCSS, FD ఖాతాదారులు ఈ నెల్లో ఇలా చేయండి

|

పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. స్మాల్ సేవింగ్స్ చేసేవారికి పోస్టాఫీస్ పథకాలు ఉపయోగకరంగా ఉంటాయి. పోస్టాఫీస్ మంత్లీ సేవింగ్స్ ఇన్‌కం స్కీమ్ (MIS), టైమ్ డిపాజిట్స్ స్కీమ్ (TD), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) తదితర పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తూ నెలవారీ, త్రైమాసిక, వార్షిక ప్రాతిపదికన క్రమమైన వడ్డీ ఆదాయాన్ని పొందవచ్చు. ఈ పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయాన్ని ఇప్పటికీ చాలామంది నగదు రూపంలోనే ఉపసంహరించుకుంటున్నారు. దీంతో తాజాగా ఓ సర్క్యులర్ జారీ చేసింది.

ఏప్రిల్ 1లోగా ఇలా చేయండి

ఏప్రిల్ 1లోగా ఇలా చేయండి

MIS, SCSS, TD విషయంలో నెలవారీ, త్రైమాసికం, వార్షిక వడ్డీ క్రెడిట్ కోసం సేవింగ్స్ ఖాతాను ఉపయోగించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. పోస్టాఫీస్ పథకాల ద్వారా వచ్చిన వడ్డీ ఆదాయాన్ని నగదు రూపంలో ఉపసంహరించుకుంటే మీరు ఏప్రిల్ 1వ తేదీ నుండి ఇదివరకులా చేయలేరు. పోస్టల్ డిపార్టుమెంట్ సర్క్యులర్ ప్రకారం... MIS/SCSS/TD ఖాతాలపై వడ్డీ 01.04.2022 నుండి అమలులోకి వచ్చేలా ఖాతాదారుని పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా లేదా బ్యాంకు ఖాతాలో మాత్రమే క్రెడిట్ చేయబడుతుంది.

అందుకే పోస్టాఫీస్ ఖాతాల్లో ఇన్వెస్ట్ చేసేవారు మార్చి 31వ తేదీలోగా వారి ఖాతాలను పోస్టాఫీస్ ఇన్వెస్ట్ ఖాతా లేదా బ్యాంకు ఖాతాతో తప్పనిసరిగా అనుసంధానం చేయాలని సూచించింది. ఈ తేదీలోపు లింక్ చేయకుంటే వడ్డీ ఆదాయాన్ని సంబంధిత సండ్రీ ఖాతాకు బదలీ చేస్తామని తెలిపింది. ఏప్రిల్ 1 నుండి సండ్రీ అకౌంట్ ద్వారా నగదు రూపంలో చెల్లింపులు ఉండవని, ఔట్ స్టాండింగ్ వడ్డీ ఆదాయాన్ని పోస్టాఫీస్ సేవింగ్స్ లేదా చెక్కు ద్వారా మాత్రమే చేస్తామని తెలిపింది.

ఇలా లింక్ చేసుకోండి

ఇలా లింక్ చేసుకోండి

MIS/SCSS/TD అకౌంట్స్ నుండి పొందిన వడ్డీ ఆదాయాన్ని నేరుగా ఉపసంహరించుకోకుండా సేవింగ్స్ ఖాతాకు జమ చేయడం వల్ల వడ్డీ ఆదాయం తిరిగి వడ్డీని ఆర్జిస్తుంది. అవసరమైనప్పుడు డిపాజిట్‌దారులు పోస్టాఫీస్‌కు రాకుండా వడ్డీ ఆదాయాన్ని ఆన్ లైన్ సహా వివిధ మార్గాల్లో ఉపసంహరించుకోవచ్చు.

ఆయా ఖాతాల నుండి నగదు రూపంలో ఉపసంహరణ చేయాలనుకున్న ప్రతిసారి ఫామ్ నింపవలసిన వచ్చేది. ఇప్పుడు ఫామ్ నింపాల్సిన అవసరం లేదు. డిపాజిటర్స్ వారి MIS/SCSS/TD ఖాతాల నుండి పొందిన వడ్డీ ఆదాయాన్ని పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా ద్వారా RD (రికరింగ్ డిపాజిట్) ఖాతాలకు ఆటోమేటిక్‌గా జమ అయ్యే సౌకర్యం పొందవచ్చు.

తెలివైన పెట్టుబడి

తెలివైన పెట్టుబడి

పెట్టుబడి ఎప్పుడైనా తెలివిగా ఉండాలి. ఆచితూచి, అన్ని తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ పొందవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్స్ సురక్షిత, మంచి రిటర్న్స్ కోసం ఓ ఎంపిక. ఇందులో అతి తక్కువ రిస్క్ ఉంటుంది కాబట్టి ఈ పెట్టుబడుల వైపు ఎక్కువమంది మొగ్గు చూపుతారు. మంచి రిటర్న్స్, సాధారణ వడ్డీ రేటు కంటే అధికంగా ఇచ్చే మరిన్ని స్కీమ్స్ కూడా ఉన్నాయి.

ఇందులో పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్ ఒకటి. ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా అధిక వడ్డీ రేటు అందుతుంది. వడ్డీ రేటుతో పాటు ఇది ట్యాక్స్ బెనిఫిట్ స్కీమ్. ప్రస్తుతం ఈ స్కీంలో వడ్డీ రేటు 5.5 శాతం నుండి 7.6 శాతం మధ్య ఉన్నాయి.

English summary

Post office saving schemes: MIS, SCSS, FD ఖాతాదారులు ఈ నెల్లో ఇలా చేయండి | Post office saving schemes alert: MIS, SCSS and FD account holders must do this

The government has made it mandatory for the use of a savings account for the credit of monthly, quarterly, yearly interest in case of MIS, SCSS, Time Deposit.
Story first published: Tuesday, March 8, 2022, 13:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X