For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు తగ్గించిన PNB: ఏ డెబిట్ కార్డు ద్వారా ఎంత డబ్బు తీసుకోవచ్చు?

|

ప్రభుత్వరంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB) సేవింగ్స్ అకౌంట్స్ వడ్డీ రేటును తగ్గించింది. సేవింగ్స్ అకౌంట్‌లోని నిధులపై ఇచ్చే వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్ల నుండి 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. డిసెంబర్ 1వ తేదీ నుండి కొత్త రేట్లు అమల్లోకి వస్తున్నాయి. రూ.10 లక్షల వరకు సేవింగ్స్ డిపాజిట్ల పైన 2.80 శాతం వడ్డీ రేటు, రూ.10 లక్షలు పైబడిన మొత్తాలపై 2.85 శాతం వడ్డీరేటు ఇస్తారు. ప్రస్తుతం ఇది 2.90 శాతంగా ఉంది. ఎన్నారై సేవింగ్స్ అకౌంట్, డొమెస్టిక్ సేవింగ్స్ అకౌంట్ వడ్డ రేట్లకు కొత్త వడ్డీ రేట్లు వచ్చే నెల నుండి వర్తిస్తాయని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది.

PNB సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లు

PNB సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లు

డిసెంబర్ 1, 2021 నుండి రూ.10 లక్షల లోపు సేవింగ్ ఫండ్ అకౌంట్ బ్యాలెన్స్ పైన ఏడాదికి 2.80 శాతం వడ్డీ రేటు, రూ.10 లక్షల పైన సేవింగ్ ఫండ్ అకౌంట్ బ్యాలెన్స్ పైన ఏడాదికి 2.85 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.

- రూ.10 లక్షల లోపు సేవింగ్స్ ఫండ్ అకౌంట్ బ్యాలెన్స్ - 2.80% p.a.

- రూ.10 లక్షల పైన సేవింగ్స్ ఫండ్ అకౌంట్ బ్యాలెన్స్ - 2.85% p.a.

PNB సేవింగ్స్ అకౌంట్ క్యాష్ విత్-డ్రా రూల్స్

PNB సేవింగ్స్ అకౌంట్ క్యాష్ విత్-డ్రా రూల్స్

PNB కస్టమర్లకు మూడు రకాల డెబిట్ కార్డ్స్ అందుబాటులో ఉన్నాయి. ప్లాటినమ్, క్లాసిక్, గోల్డ్ ఉన్నాయి. ప్లాటినమ్ డెబిట్ కార్డు ద్వారా ఒకరోజు ఉపసంహరణ పరిమితి రూ.50,000. క్లాసిక్ డెబిట్ కార్డు ఉపసంహరణ పరిమితి రూ.25,000. గోల్డ్ డెబిట్ కార్డ్ ఉపసంహరణ పరిమితి రూ.50,000.

వివిధ కార్డుల పరిమితి

వివిధ కార్డుల పరిమితి

ప్లాటినమ్ కార్డు ద్వారా ఉపసంహరణ

- ప్లాటినమ్ క్యాష్ ఉపసంహరణ పరిమితి రోజుకు.. రూ.50,000

- ఒకసారి ఉపసంహరణ పరిమితి రూ.20,000

- ECOM/POS కన్సాలిడేటెడ్ పరిమితి రూ.12,5000

క్లాసిక్ కార్డు ద్వారా ఉపసంహరణ

- క్లాసిక్ నగదు ఉపసంహరణ పరిమితి రోజుకు.. రూ.25,000,

- ప్లాటినమ్ క్యాష్ ఉపసంహరణ పరిమితి ఒకసారి.. రూ.20,000,

- ECOM/POS కన్సాలిడేటెడ్ పరిమితి రూ.60,000.

గోల్డ్ కార్డు ద్వారా ఉపసంహరణ

- గోల్డ్ నగదు ఉపసంహరణ పరిమితి రోజుకు.. రూ.50,000,

- గోల్డ్ క్యాష్ ఉపసంహరణ పరిమితి ఒకసారి.. రూ.20,000,

- ECOM/POS కన్సాలిడేటెడ్ పరిమితి రూ.1,25,000.

English summary

సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు తగ్గించిన PNB: ఏ డెబిట్ కార్డు ద్వారా ఎంత డబ్బు తీసుకోవచ్చు? | PNB Slashes Interest Rates On Savings Accounts

The PNB has lowered interest rates on savings account deposits. The bank has stated that the interest rate on savings account deposits has been reduced by 10 basis points (bps) for balances of less than Rs. 10 lakh and by 5 bps for balances of Rs. 10 lakh and above from the earlier rate of 2.90% respectively.
Story first published: Thursday, November 11, 2021, 10:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X